పోస్ట్‌లు

అక్టోబర్, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

మా విద్విషావహై!

భూషయ్య: వాళ్ల పద్ధతులు నాకేం నచ్చలేదు. అందుకే వాళ్లను చంపాలి, చంపుతున్నాం. లాడెను: వాళ్లూ అంతే. చాలా ప్రమాదకరం. మేమంతా ఒక్కటై వాళ్లను లేకుండా చెయ్యాల్సిందే. మోడీ: నేనూ అలాగే అనుకుంటున్నాను. అందుకే రామనామం జపించే రాక్షసులకు దొడ్డివాకిలి తెరిచా. అమాయక అమెరికన్: తీవ్రవాదికి గడ్డం వుంటుంది. వాడు అల్లాను పూజిస్తాడు. వాడుండకూడదు. ఆవేశపు ముస్లిమ్: నా కళ్లముందే ఇంత ఘోరం జరిగింది. నాకు రక్షణలేదు. కనీసం నలుగురిని చంపి నేనూ చస్తా. హిందూ మూర్ఖుడు: ఇస్లాం లేకుంటే ఇండియా బాగుపడిపోతుంది. అమెరికా కూడా నాశనమైపోవాలి. లాడెన్ = అరేబియన్ జార్జిబుష్ బుష్ = అమెరికన్ మోడీ మోడీ = ఇండియన్ లాడెన్ వీళ్లందరిదీ ఒకటే మతం. రాక్షస మతం. అన్నదమ్ములే వీళ్లంతా. వీళ్లది ఒకటే జాతి. రాక్షస జాతి. నరమేధం చేసిన రాక్షసుల అంశ వీళ్లు. ఇప్పుడు దేవుని పేరిట చేస్తున్నా రా పని. వీళ్లెవరూ మతోద్ధారకులు కారు. మత రక్షకులు అసలే కారు. ప్రశాంతంగా బతికే అమాయక జనాన్ని చంపి "హమ్‌ భీ మర్ద్ హైఁ" అని రొమ్మువిరిచిన మోడీ హిందూమతోద్ధారకుడు ఎలా అవుతాడు? సంఘంలోని కలతలకు ఆజ్యంపోసి పెంచినవాడు శ్రీరామునికి ప్రీతిపాత్రుడెలా అవుతాడు? దుష్ట ర...

చదువుల గీర్వాణి ... పలికినా అపశృతుల్ ...

రాత్రి 'జెమిని' వార్తలు చూస్తున్నాను - నా మిత్రుని ఇంట్లో. ఒకానొక సరస్వతీదేవి చదువుతోంది. ఒక గ్రామంలో ఒక ముదుసలి పెద్దాయన ఎనిమిది భాషలను చదవడమూ రాయడమూ చేయగలడట. ఆయనపై "జెమిని టీవీ కదనం " అంది సరస్వతీదేవి. "కదనమా?!" అనుకుంటూ వున్నాం. అది ముసలాయనపైనా కదనమే అయింది. పెద్దాయన పాపం రెండు మాటలన్నా సరిగా చెప్పీచెప్పకనే ఆయన మాట కట్టు . వార్తల్లో ఆ తరువాత - రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు. అసలే కరవు సీమ. అందులో ఉన్నట్టుండి భారీవర్షాలు, కాలువల్లో మనుషులు గల్లంతు. అలాంటి పరిస్థితిలో ఆ ప్రాంతంపై ఆ 'చదువులతల్లి' ప్రత్యేక కదనమట . తరువాత ఇంకెవరిపైనో మళ్లీ కదనం . అది కూడా ఇరాక్‌పై బుష్ కదనం కన్నా అధ్వాన్నంగా ముగిసింది. "థూ యీనె@$#$^&* కమిట్‌మెంట్ లేని కథనాలూ, కమిట్‌మెంట్ లేని జర్నలిజం ..." అని మా మిత్రుడేదో గొణిగాడు. ఆ వార్తలమ్మ విన్నారేమో, ఏకంగా బంగాళాఖాతంలో వాయుగుండంపైనే కదనం ప్రటించేశారు. అవాక్కయ్యారా!?

కొత్తపాళిగారి బ్లాగులో: భద్రుడి కథపై చర్చ

భద్రుడి కథ చర్చించడానికి ఆహ్వానం అన్నారు కొత్తపాళిగారు. నేను రాసిందే ఒక్క కథ. చదివింది మహా అంటే నూరు కథలు. ఇంతలోనే ఒక కథను గురించి నా అభిప్రాయాలు ఇవీ అని చెప్పగలిగే అధికారం ఇంకా రాలేదుగనుక, ఈ కథను చదువుతూ పోతున్నప్పుడు నాకు కలిగిన ఆలోచనలు క్రమంగా ... (ఇది వాడ్రేవుచినవీరభద్రుని కథ అని చూసి చదవలేదు, ఒకవేళ చూసివున్నా ఈ రచయిత గురించి నాకేమీ తెలీదు గనుక ముందుగా ఏర్పరచుకొన్న అభిప్రాయాలేవీ నాలో లేవు.) 1. కథ ప్రారంభంలోని ఈ మూడు మాటలు ... ౧. "ఈ నగరం ఎంత క్రియాశీలం! ఎంత కోలోహలం! కానీ దాని ఆరాటంలో నాకేదీ మనోవికాసం గోచరించదు." ౨. "వేసవి మధ్యాహ్నం వేళ మాగన్నుగా నిద్రిస్తున్నట్టుండే గ్రామం" ౩. "నీడ అంటే ఏమిటి? నిన్ను నువ్వు మరచిపోగల నిశ్చింత. నిన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేని ఒక క్షణం. పక్కమనిషిని చూసి బెదరవలసిన అవసరం లేని తావు." నగరంలోకి చేరిన వెంటనే నేను కోల్పోయినట్లుగా గ్రహించింది "నీడ". మనుషులకీ మనుషులకీ మధ్య అవిరళమైన ఆకాశాన్ని, మాగన్నుగా నిద్రిస్తున్నట్లుండే గ్రామాన్నీ చూసిన నాకు -- ఈ భావాన్ని నాస్టాల్జియా అని కొట్టివేయడానికి వీల్లేదనిపిస్తుంది. నే...

అయ్యా ... అదన్నమాట విషయం!

ఏతావాతా తేలిందేమిటంటే , మనం వాల్మీకిరామాయణాన్ని పూర్తిగా చదవకుండా మాట్లాడటం --- నలుగురు గుడ్డివాళ్లు ఏనుగును ఒక్కోడూ ఒకోచోట తాకి అదెలావుంటుందో చెప్పబూనినట్లుంటుంది అని. చర్చకు నేను మంగళం పాడేస్తున్నాను. "ఈ పరిషత్తు పాలిటిక్స్ నాదగ్గర కుదరదు, నాకింకా రెండు డైలాగులున్నాయి" అంటారా? :) మీ డైలాగులు చెప్పేముందు ఒక్క మాట ... [ఈ మాట నాది కాదు, ఎవరిదో మీరు సులభంగా కనిపెట్టగలరు :) ఈ మాటను చెప్పినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ] " ... ఒక మహాకావ్యాన్ని, చందమామలో నీతికథల స్థాయిని మించి చూడలేకపోతున్న ఇప్పటి జెట్ యుగాన్ని చూస్తూంటే మాత్రం రవ్వంత బాధగానే ఉంది ..." నేనన్నాను - " ... నేటి జెట్‌యుగంలో నేనూ ఒకణ్ణే. కానీ రామాయణంలో తప్పకుండా ఏదో మహత్తు వుంది, అదేమిటి, అది నాకు ఎందుకు అందడంలేదు అన్నది కనుక్కుందామని కూడా నా ప్రయత్నం. " జవాబు: "... నాకు తోచిన సమాధానం: ఇక్కడ వ్యాఖ్యలు రాస్తున్న వాళ్ళలో ఎంతమంది రామాయణాన్ని (పూర్తిగా?) చదివారు? చాలా మందికి తెలిసింది – కొన్ని సినిమాలు, రామానంద్ సాగర్ జిల్లెట్ కంపెనీ షేవింగ్ సామాన్లకి వ్యాపార ప్రకటన్లా తీసిన ఒక చెత్త టి....

సిసలైన సివిలింజనీరు శ్రీరామచంద్రమూర్తి

రామాయణం అంతగా నచ్చేది కాదు నాకు. రామునికి చాదస్తమెక్కువ అనిపించేది. కారణం ఏమిటంటే, నాకు తెలిసినంతవరకూ రాముడెప్పుడూ పెద్దలేం చెప్పినా కిమ్మనలేదు. చేసుకుంటూపోయాడు. ఏ విషయంలోనూ ఎందుకు - అనే ప్రశ్నతో చర్చకు దిగినట్లు కనిపించదు. పెద్దలేంచెప్పినా అది సరైనదే అయివుంటుందనే నమ్మకం అయుండొచ్చుగాక. మరీ అంతగా నమ్మేయడమే ఇంప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. అలాగే లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీత వీళ్లంతా. ఏ విషయంలోనైనా నువ్విలా చేయమనడంలో అర్థమేమిటి అని అడిగిన సందర్భాలున్నట్లు నాకు తెలియకపోవడంతో రామాయణం నా దృష్టిలో బోరుకొట్టే స్టోరీ. అదే మహాభారతంలో బోలెడు డిస్కషన్లు. సవాలక్ష చర్చలు, వాదాలు, తర్కాలు, క్లాజులు, ట్విస్టులు. బహుత్ రసవత్తర్ స్టోరీ. ఇందులో కూడా రాముని లాంటి కారెక్టర్ ధర్మరాజున్నాడు. భారత కథలో ధర్మరాజు కూడా అంత ఆకర్షణీయమైన మనిషిగా నాకు కనిపించడు. ట్వెంటీ-20 లాంటి మహాభారతంలో పాతకాలపు టెస్టుప్లేయర్లాగా అనిపిస్తాడు ధర్మరాజు. స్లోమూవింగ్, రిలాక్స్‌డ్ అండ్ అనట్రాక్టివ్ యట్ కూల్ ఫెలో. రాముడూ దాదాపుగా ఇంతే కానీ రాముడు చాలా పవర్‌ఫుల్. రామాయణమే ఒక టెస్టుమ్యాచ్ కాబట్టి సరిగ్గా ఇమిడిపోయినట్లే. వీళ్లిద్దరిలో నాకు నచ...

విలేకరుల షూటౌట్ ప్రహసనం

ఆఫీసులో పనిలో ఉండగా ఒక వేగు వచ్చింది - "మన ఆఫీసు బయట భారీగా పోలీసులు మొహరించారు. పైన ఒక " ఛాపర్ " కూడా తిరుగుతోంది. పక్కనే ఫలానా అపార్టుమెంట్ ప్రాంగణమంతా దిక్బంధనం చేయబడింది." నా పక్క ఛాంబర్లో పనిచేసే మిత్రుడు ఆ అపార్టుమెంట్ ప్రాంగణంలోనే కొత్తగా వచ్చి చేరాడు భార్యాసహితంగా. నేనీ వేగును చదివేలోగా అతను ఫోనులో మాట్లాడుతున్నాడు - హిందీలో. ఆ తరువాత కుప్పలుతెప్పలుగా వేగులు . మిత్రుని ఇంట్లో సోదా జరిగిందని తెలియవచ్చింది. ఆతని పక్కింట్లో సోదాచేయడానికి పోలీసులు తలుపులు బాదుతున్నా ఎవరూ తీయడం లేదనికూడా తెలియవచ్చింది. ఆ తరువాత సహోద్యోగమన్యుల్లో చాలామంది స్వయంగా వచ్చేశారు - పరామర్శ చేయడానికి. ఐతే అందరూ ఒక్కసారిగా రాలా. మిత్రుడు పాపం ఒక్కొక్కరికీ ఓపికగా సంజాయిషీ చెప్పుకోవలసివచ్చింది - వాళ్ల ఫలానా అపార్టుమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘటనకు పాక్షిక బాధ్యత వహిస్తున్నట్లుగా. విషయమేమిటంటే - తన మాజీ ప్రేయసి అపార్టుమెంట్లోకి చొరబడి ఆమెనూ మరియు ఆమె సరికొత్త ప్రియుడినీ తుపాకితో కాల్చిన ఒక వ్యక్తిని స్థానిక పోలీసులు కాల్చి చంపివేశారు లేదా అతనే కాల్చుకుచచ్చాడు. పరామర్శకులు, విలేకరులు, తదితర ఔత...

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

వెంకట్ సిద్ధారెడ్డి బ్లాగులో జరిగిన చిన్నపాటి చర్చకు నా అభిప్రాయాన్ని వీలైనంత బలంగా చెప్పే ప్రయత్నం ఈ టపా. అంతే కాకుండా, ఈ వీడియో చివరలో మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓలేటివారి స్వరకల్పన... దివ్యం! అనగా దివినుంచి జాలువారినది అని తాత్పర్యం. నేనొక ఇరవైమార్లు విని, అందరూ మళ్లీమళ్లీ విని ఆనందించాలనే సదుద్దేశంతో యూట్యూబుకు చేర్చాను. [ఇది ముమ్మాటికీ కాపీహక్కుల ఉల్లంఘనే. మాటీవీ వాళ్లు నామీదకు యుద్ధానికి రారని ఆశిస్తున్నాను. :)]

సీరియల్‌మా అమృ'తంగ'మయ

మన తెలుగు టీవీ ఛానెళ్లలో వస్తున్న ధారావాహికల్లో ఒకే ఒక్కదాన్ని మాత్రం 'సీరియల్' అని పిలిచి అవమానించకూడదు. దానిని 'అమృతం' అని గౌరవించాలి. ఇది ఒక హాస్యామృతం. కామెడీ బంగారం. దీనిలోని 'సర్వమూ' అమృ'తంగ'మయం. తెలుగు సినిమాల్లో కాస్తోకూస్తో వైవిధ్యం గలవి నిర్మిస్తున్న ఒకే ఒక దివ్యసుందరమూర్తి - ఆహ్హా... ఆతడెవ్వరయ్యా అంటే - గుణ్ణం గంగరాజు. వారానికొక ఎపిసోడ్ - నాణ్యతలో లోపం రాకుండా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూరావడం తెలుగు టీవీ హాస్య ప్రధాన ధారావాహికల చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. సంభాషణల్లో విరుపులు, చురకలు, చమత్కారాలను ప్రతీ ఎపిసోడ్‌లోనూ తీసుకురావడమంటే 'మాటలు'కాదు. ఈ శ్రమ చేయడానికి గొప్ప అభిరుచి కావాలి. అమృతంలోని హాస్యం ఆరోగ్యకరమైనది. సున్నితమైనది. అంతర్లీనంగా చిన్న నీతికథలా కూడా ఉంటుంది. మనలోనూ మన తోటి మనుషుల ప్రవర్తనలోనూ బయటపడే చిన్న బలహీనతలు ఈ ధారావాహికకు ముడిసరుకు. పాత్రలమధ్య పరస్పర సహానుభూతి ఉంటుంది. తీవ్రమైన విద్వేషాలుండవు. ఇందులో ఎవరూ శాశ్వతంగా విలన్లు కారు. మన హాస్యనటుల్లో మంచి ఉచ్చారణ గలవారు అతికొద్దిమంది. వారిలో ఒకరైన విలక్షణ నటుడు హనుమంతరావు...

గూగులమ్మ పదాలు

గురువుగారూ, మీరిచ్చిన ఎసైన్మెంటు రెండవ వాయిదా: పెండ్లియగుటొక ఫేటు బ్యాచిలరుపై వేటు పెండ్లామె రూంమేటు ఓ గూగులమ్మా! ఉద్యోగమున మనుట రెండు మేడల గొనుట బ్రతుకులో సెటిలగుట!? ఓ గూగులమ్మా! చేసెడిది గోరంత చూపెడిది కొండంత లౌక్యమట ఈ వింత ఓ గూగులమ్మా! పైకోర్టు చీవాట్లు ప్రభువులకు అలవాట్లు పాలితుల గ్రహపాట్లు ఓ గూగులమ్మా! రైతు ముఖమున తేట మాయమౌ ప్రతి యేట ఇసుక వేయును మేట ఓ గూగులమ్మా! అవినీతి జేజమ్మ నేతగుట మా ఖర్మ తొండ ముదిరె గదమ్మ ఓ గూగులమ్మా!