పోస్ట్‌లు

అక్టోబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

తోలుతిత్తి ఇది

చిత్రం
తోలుతిత్తి ఇది సెప్టెంబరు అక్టోబరు నెలలలో నేనుంటున్న ఇంటి చుట్టుపక్కల చెట్ల మొదళ్ల బెరళ్లకు ఇలాంటివి చాలా కనిపించాయి. ఈ తోలుతిత్తి వీపుభాగం మధ్యలో పడిన చీలిక నుంచి పురుగు బయటకు వెళ్లిపోయిందని చూడగానే తెలుస్తుంది. ఈ పురుగు ఏమిటో ఎవరికైనా తెలుసా? ఇంటికొచ్చేవాళ్లను భయపెడదామని ఒకటి తెచ్చి ద్వారబంధనానికి (దాలమందరానికి) తగిలించాను. కానీ ఎవరూ భయపడినట్టుగా నాతో చెప్పలేదింతవరకూ.

షావుకారులో బహుదూరపు బాటసారి పయనం

నేనింతవరకూ షావుకారు సినిమా చూడలేదు. ఇప్పుడే యూట్యూబులో ఆ సినిమా క్లిప్పింగులు చూస్తూ... జైలు సన్నివేశానికి (రామారావు, నారాయణపాత్రధారి జైల్లో కలిసే సన్నివేశానికి) నేపథ్యంగా 'బహుదూరపు బాటసారీ' హార్మోనియం మీద [@ 4:30 ] విని ఆశ్చర్యానందాలు పొందాను. ఘంటసాల ఈ పాట సాహిత్యమూ, స్వరాలూ రెండూ కూర్చి పాడిన ప్రైవేటు రికార్డింగ్ మాత్రమే విన్నానిన్నాళ్లూ. బహుశా స్వరాలు కూర్చడం అయిన తరువాతే సాహిత్యం కూర్చివుంటాడనుకుంటా.

కడప జిల్లా - డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా

రాష్ట్రప్రభుత్వం 'కడపజిల్లా' పేరును 'డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా'గా మారుస్తూ ఉత్తర్వులు చేసిందనే వార్తను చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కడప అనే పేరుకు చిన్నప్పటి నుండి అలవాటు పడివున్నాను. వెంకటేశుని గడప కాలక్రమాన కడప అయిందంటారు. ఆంగ్లేయుల Cuddapah అనే స్పెల్లింగు కూడా నాకు నచ్చేదికాదు. కొన్నేళ్లక్రితమే Kadapa గామారిందని తెలిసి సంతోషించాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ పేరునే తీసేయాలనడం బాధాకరం. వై.ఎస్. స్మృత్యర్థం కడప విమానాశ్రయాన్ని అభివృద్ధిచెయ్యడమో, మరో కొత్త అభివృద్ధిపని చేపట్టి దానికి ఆయన పేరు పెట్టడమో చేస్తే బాగుంటుందిగానీ, చారిత్రాత్మకమైన జిల్లా పేరును మార్చడం యేమీ బాగలేదు. సదరు మార్పు ఇష్టం లేనివారు ముప్పైరోజుల్లో తమ అభ్యంతరాన్ని తెలియజేయొచ్చని కూడా వార్తల్లో వచ్చింది. ఎలా తెలియజెయ్యాలో నాకు తెలియలేదు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగివున్న తరుణంలో విడుదలైన ఈ ఉత్తరువులకు అభ్యంతరం తెలియజేయడానికి గల గడువు మించిపోతోంది. అంతర్జాలంలో ఎవరో ఈ ఫిర్యాదు ఏర్పాటు చేశారు. అక్కడ సంతకం చేస్తే రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి అభ్యంతరం తెలిపినట్టేనట. ఇదెంతమాత్రం

మినీ మీనాక్షి

గత ఆరు వారాల్లో ఐదుసార్లు వెళ్లాను దేవళానికి. ఇప్పుడు మనం కలసిమెలసి తిరగడానికి దొరికిన సావాసగాళ్లు భక్తులయిరి. దేవళాలకు పోకూడదని నియమమేదీ లేదుగానీ, గత ఆరు వారాలు మినహాయిస్తే అంతకు ముందు ఐదేళ్లలోనూ మొత్తం కలిపితే ఐదుసార్లకు మించి దేవళానికి వెళ్లివుండనేమో. గుళ్లో ఆహ్లాదకరంగా గాలి వీస్తూ వుంటుంది. జనం ఎక్కువగా వుండరు. ఆ మెట్ల మీద కూర్చుని వుంటే హాయిగా వుంటుంది. దేవుళ్లవిగ్రహాల ముందు నిలబడే సమయం కంటే ఆ ఆవరణంలో మెట్లమీదే నేను ఎక్కువ సమయం గడిపాను. ఈ ఐదుసార్లలో రెండోసారి దేవళానికి పోయినప్పుడు చిన్న తమాషా జరిగింది. వెళ్లగానే కాళ్లూచేతులూ కడుక్కొని, ముందుగా వినాయకుని విగ్రహం ముందు నిముషం పాటు నిలబడి చేతులు కట్టుకుని కండ్లు మూసుకున్నాను. ఒక గంటసేపు మంచి నిద్రపట్టినప్పుడు కలిగే హాయి కలిగింది. మళ్లీ రెండుసార్లు వెళ్లినప్పుడు అక్కడే నిలబడితే అలాగే అనిపిస్తుందేమోనని చూశాను. అనిపించలేదు. ఐదోసారి జనం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నేనసలు దేవుళ్లవిగ్రహాలజోలికే పోలేదు. పాలరాతి రాధాకృష్ణులకు పక్కగా ఒకమూల మెట్లమీదే కూర్చుండిపోయాను మావాళ్ల దర్శనాలు, దండాలు, దక్షిణలు, ప్రదక్షిణలు పూర్తయిందాక. విగ్రహాలకు ఇనుపకడ