కడప జిల్లా - డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా

రాష్ట్రప్రభుత్వం 'కడపజిల్లా' పేరును 'డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా'గా మారుస్తూ ఉత్తర్వులు చేసిందనే వార్తను చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కడప అనే పేరుకు చిన్నప్పటి నుండి అలవాటు పడివున్నాను. వెంకటేశుని గడప కాలక్రమాన కడప అయిందంటారు. ఆంగ్లేయుల Cuddapah అనే స్పెల్లింగు కూడా నాకు నచ్చేదికాదు. కొన్నేళ్లక్రితమే Kadapa గామారిందని తెలిసి సంతోషించాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ పేరునే తీసేయాలనడం బాధాకరం. వై.ఎస్. స్మృత్యర్థం కడప విమానాశ్రయాన్ని అభివృద్ధిచెయ్యడమో, మరో కొత్త అభివృద్ధిపని చేపట్టి దానికి ఆయన పేరు పెట్టడమో చేస్తే బాగుంటుందిగానీ, చారిత్రాత్మకమైన జిల్లా పేరును మార్చడం యేమీ బాగలేదు.

సదరు మార్పు ఇష్టం లేనివారు ముప్పైరోజుల్లో తమ అభ్యంతరాన్ని తెలియజేయొచ్చని కూడా వార్తల్లో వచ్చింది. ఎలా తెలియజెయ్యాలో నాకు తెలియలేదు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగివున్న తరుణంలో విడుదలైన ఈ ఉత్తరువులకు అభ్యంతరం తెలియజేయడానికి గల గడువు మించిపోతోంది. అంతర్జాలంలో ఎవరో ఈ ఫిర్యాదు ఏర్పాటు చేశారు. అక్కడ సంతకం చేస్తే రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి అభ్యంతరం తెలిపినట్టేనట. ఇదెంతమాత్రం ఫలితాన్నిస్తుందో తెలీదుగానీ, నా అభ్యంతరాన్ని వ్యక్తం చెయ్యడానికి నాకు దొరికిన సులభమైన మార్గమిది. జిల్లా పేరు మార్పు విషయంలో నాలాగే అనుకునేవాళ్లు చెయ్యగలిగిన మానవప్రయత్నం ఇంకేదైనా వుందా?

కామెంట్‌లు

విజయ క్రాంతి చెప్పారు…
త్వరలో ....నార జిల్లా ...రోశయ్య జిల్లా , కోట్ల జిల్లా ....పరిటాల జిల్లా , చిరంజీవి జిల్లా , ఎన్టిఆర్ జిల్లా ,జూనియర్ ఎన్టిఆర్ జిల్లా ,...ఇలా మన బ్రతుకులకి ఇంకా ముందుండి ముసళ్ళ పండగ .... ఎప్పటికి నేను పుట్టింది కడప జిల్లా లోనే ....
Saahitya Abhimaani చెప్పారు…
కడప జిల్లాకి పేరు మార్చటం. ఏమంత కొంపలు ముణిగిపోయాయని జిల్లా పేరు మార్చటం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం నిరాహార దీక్ష చేసి, తన ప్రాణాలే పోగొట్టుకున్న పొట్టి శ్రీరాములుగారి పేరు నెల్లూరు జిల్లకి పెట్టతానికి కొన్ని దశాబ్దాలే పట్టిందే, కడప జిల్లా పేరు మార్చటానికి ఏమిటి ఇంత తొందర??

ఈ లెఖ్ఖన, గుజరాత్ రాష్ట్రం పేరు గాంధి రాష్ట్రం అని 1948 జనవరి 31నే పెట్టాల్సింది మరి. ఇప్పటికి గాంధీ పేరున ఏరాష్ట్రంలో నైన జిల్లాకు పేరు ఉన్నదా? నాకు తెలిసినంతవరకు లేదు.

ఇలా ప్రతి రాజకీయ నాయకుడి పేరు జిల్లాలకి, అనేక పబ్లిక్ స్థలాలకు బలవంతాన రుద్దటం మానేయ్యాలి. ప్రజలు వాళ్ళంతట వారే ప్రేమగా పిలుచుకునేట్టుగా ఉండాలి. ఇంత మహాత్ముడిగా పేరు పడిన గాంధీ పేరున ప్రతి చిన్నా చితకా ఊళ్ళల్లో మహత్మా గాంధీ రోడ్డని పేరు పెట్టటం, ఆ మర్నాటి నుండి, ఎం జి రోడ్డని పిలవటం!! ఇదేమి మూర్ఖత్వం.

కడప జిల్లాకు పేరు మార్చటం అది కూడా ఒక ఐదేళ్ళు మాత్రమే పరిపాలించిన ఒక రాజకీయ నాయకుని పేరు, ఆ రాజకీయ నాయకుడు మరణించిన రోజులలోనె పెట్టటం తప్పనిసరిగా తప్పిదం, ప్రభుత్వం చేసిన పొరపాటు పని అని ఈ దేశపౌరుడిగా అభిప్రాయపడుతున్నాను.


ఇక ఫిర్యాదు గురించి, మీరు ఇచ్చిన లింకు పని చేయటంలేదు. దయచేసి మరొకసారి ఇవ్వండి. చూద్దాం, మన అభిప్రాయాన్ని వినిపించటానికి వీలుంటుందేమో!!
రానారె చెప్పారు…
శివగారు: లంకె సరిచేశాను. కృతజ్ఞతలు.
cbrao చెప్పారు…
http://te.chavakiran.com/blog/?p=573&cpage=1#comment-386
రానారె చెప్పారు…
థాంక్స్ రావుగారూ. ఆవిధంగా ముందుకు పోదాం. :-)
Anil Dasari చెప్పారు…
పదండి ముందుకు, పదండి తోసుకు ....
సుజాత వేల్పూరి చెప్పారు…
ఆగండి, నేనూ వస్తున్నా!

కడప పేరు మార్చడం నాకూ ఇష్టం లేదు. ఇక్కడ నేనూ ఫిర్యాదు చేస్తాను. కడప ఇంగ్లీష్ స్పెల్లింగ్ మార్చడం కూడా నచ్చింది. cudappah అనే మాటని దూర దర్శన్ హిందీ, ఇంగ్లీషు న్యూస్ రీడర్లు "కుడపహ" అని చదవడం అనే చేదు అనుభవాన్ని ఇంకా మర్చిపోలేదు నేను.

అసలు స్థలాలకి, ప్రాంతాలకీ మనుషుల పేర్లు పెట్టడం ఏమి ఇలాంటి విషయాల్లో ఆయా జిల్లాల ప్రజల మనోభావాలకు విలువ లేదా? ఎవర్ని అడిగి పెడుతున్నారు ఈ పేరు?

శివప్రసాద్ గారు చెప్పినట్లు మహాత్మా గాంధీ పేరుని అడ్డమైన ప్రతి రోడ్డుకీ పెట్టేసి ఎం. జీ రోడ్డని పిలవడం నాక్కూడా ద్రోహంగా కనిపిస్తుంది.
రానారె చెప్పారు…
త్రివిక్రమ ఉవాచ:
“notice is hereby given inviting objections or suggestions on the above proposal from all persons residing within the Kadapa District who are likely to be affected thereby for being taken into consideration by the Government” అని సదరు జీవోలో స్పష్టంగా ఉంది. అంటే మీ ఆన్లైన్ పిటిషన్ చెల్లదు. కడప జిల్లా నివాసిగా నేను రాతపూర్వకంగా నా సూచనను మా జిల్లా కలెక్టరుకు పోస్టులో పంపించాను. ఈమెయిల్ చెయ్యబోతే “rejected by the recipient domain” అని వచ్చింది.
Saahitya Abhimaani చెప్పారు…
How about bringing this petition campaign going on to the attention of media??
Zach Taylor చెప్పారు…
we should join this group and promote it

Say NO to YSR Dristrict!!
http://www.facebook.com/group.php?gid=146154027271

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం