ఉత్పలమాల - గురువు - లఘవు
భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూణ కో
దండకళా రప్రచండ భుజతాండవ కీర్తికి రామ మూర్తికిన్ రెండవ సాటి దైవమిక లే
డనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ము
లజాండము నిండ మత్త వేదండమునెక్కిచాటెదను దాశరథీ కరుణా పయోనిధీ!
చిన్నప్పుడు మా నాయన నేర్పిన పద్యం ఇది. అర్థంతో సహా నేర్పారు కాబట్టి ఇంకా గుర్తుంది. పద్యం నాలుగు పాదాలూ రాశానుగానీ, పాదాలను ఎక్కడబడితే అక్కడ అమ్మతోడుకూడాలేకుండా అడ్డంగా నరికేసినట్లున్నాను. ఇలా కాదుగాని ఒక మహాప్రయత్నం చేసి ఛందోబధ్దంగా నాలుగు పాదాలు ఒకేపొడవులో వుండేట్టుగా నిలబెట్టాలని మొదలుబెట్టాను. మనం చిన్నప్పుడు అంటే తొమ్మిది, పదవ తరగతుల్లో చదువుకుని మరచిపోతామేమో నని కొంచెం బెంగపడిన ఛందస్సు పునరావలోకనం. పద్యంలో ఒక తప్పున్నా ఛందస్సు చెడిపోతుంది కదా. నాకు తెలిసి ఈ పద్యం నేను తప్పులు లేకుండా రాసినానని గట్టి నమ్మకం. ముందుగా - "యమాతారాజభానసలగం" అనుకొన్నాను.
ఎక్కడో విన్న వాసన తగులుతోందా? లేక ఏమిటిది కపాలమాంత్రికుని మహామంత్రం లాగ వుందే అంటారా? తెలుగు వర్ణమాల నేర్చుకోవడంలో ఓనమాలు ఏమిటో (ఈ కాలంలో అఆఇఈ ఏమిటో), తెలుగు ఛందస్సు నేర్చుకోవడంలో "యమాతారాజభానసలగం" అలాగన్నమాట నాకు. కొంచెసేపు దాన్నట్లా పక్కనబెడదాం. పెట్టి, పద్యంలో పలికే శబ్దాలను రెండే రెండు రకాలుగా విభజించి చూద్దాం. సాధారణమైన, హ్రస్వమైన, గాంధీగారిలాగా నిరాడంబరమైన క, గి, తు, మె, జొ, అ, ఇ, ఉ ఇలాంటి శబ్దాలు మొదటి రకం. మిగతావన్నీ రెండోరకం శబ్దాలే. కం, ఓమ్, తృ, తృప్, మక్, చాన్, షీన్, ఢాం, తుస్, క్ష్, త్స్ ఇలాంటివన్నీ. మొదటిరకం శబ్దాన్ని లఘువు అని, రెండవరకం శబ్దాన్ని గురువు అనీ అంటారు. వీటిని సూచించడానికి ఒక గుర్తు ఏదైనా వుంటే బాగుంటుందికదా. లఘువును అనే సంజ్ఞతోను, గురువును U అనే సంజ్ఞతోను మనం గుర్తిద్దాం. ఇవి నచ్చకపోతే మీ ఇష్టంవచ్చినవి మీరు లఘువు గురువులకు సంజ్ఞలుగా వాడుకోవచ్చు. ఎక్కడికో వెళ్లిపోతున్నామా?
"మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్దే -- ఒంట్లో వొక్కోనరం మెలికడిపోద్దే -- ఢమాల్" మళ్లీ కలియుగానికి వచ్చేసినట్లే కదూ! శ్రవణానందకరమైన ఈ పాటలోని శబ్దాలను పైనచెప్పుకొన్న రెండు రకాలుగా విడదీసి, లఘువుకు I అనీ, గురువుకు U అనీ గుర్తుపెడదాం, రవితేజ అన్నట్లు ఖామెడీగా.
మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్దే -- ఒంట్లో వొక్కోనరం మెలికడిపోద్దే -- ఢమాల్
మాస్ తో పెట్ టు కుం టే మ డ త డి పోద్ దే ఒంట్ లో వొక్ కో న రం మె లి క డి పోద్ దే ఢ మాల్
U U U I U U I I I I U U U U U U I U I I I I U U I U
ఇదే విధంగా "జింతాట చితాచితా జింతాట చితాచితా జింతాట తా - అద్దీ మ్యాటరు" అనే 'విక్రమార్కుడు' సినీసాహిత్యాన్ని ప్రయత్నించవచ్చు. వద్దా? సరే. మన కపాలమంత్రాన్ని ప్రయత్నిద్దాం. మంత్రజపంలో ఉచ్చారణ దోషంవుంటే దాని ప్రభావం వికటిస్తుందంట. కపాలమంత్రం సులభమైనది. కాబట్టి గురులఘువులు చూద్దాం.
య మా తా రా జ భా న స ల గం
I U U U I U I I I U
యమాతారాజభానసలగం అనుకున్నామే, ఇందులో ఒకో అక్షరం దానిపక్కనున్న రెండు అక్షరాలు కలిసి చేసే శబ్దాన్ని గణం అంటారు (అని గుర్తు).
య - యగణము - యమాతా - IUU
మా - మగణము - మాతారా - UUU
తా - తగణము - తారాజ - UUI
రా - రగణము - రాజభా - UIU
జ - జగణము - జభాన - IUI
భా - భగణము - భానస - UII
న - నగణము - నసల - III
స - సగణము - సలగం - IIU
ల, గం -- మిగిలిపోయాయి కదా? ఈ రెండూ రెండక్షరాల గణాలుగా మన పద్యాలలో కలబడతాయి, కాదు, కనబడతాయి.
లల - II
లగ - IU
గల - UI
గగ - UU
ఇప్పుడు మన దాశరథీ శతక పద్యాన్ని గణాలుగా విడగొట్టి డి.ఎన్.ఏ పరీక్షచేసి అది ఏ వంశాంకురమో చూద్దాం.
భండన భీముడా ర్తజన బాంధవు డుజ్వల బాణతూ ణకో
UII UIU III UII UII UIU IU
దండక ళాప్రచం డభుజ తాండవ కీర్తికి రామమూ ర్తికిన్
UII UIU III UII UII UIU IU
రెండవ సాటిదై వమిక లేడను చున్‌గడ గట్టిభే రికా
UII UIU III UII UII UIU IU
డాండడ డాండడాం డనిన దమ్ముల జాండము నిండమ త్తవే
UII UIU III UII UII UIU IU
దండము నెక్కిచా టెదను దాశర థీకరు ణాపయో నిధీ
UII UIU III UII UII UIU IU
గమనించే వుంటారు ప్రతి వరుసలోను శబ్దం ఒకేలా వుంది, (ప్రతిపాదములో గణాల క్రమం ఒకేలా వుంది). మన ఇంగ్లీషు రైమ్స్ లాగా. ఇవి మన తెలుగు రైమ్స్ - అని చెప్పుకోవలసి వస్తోంది. ఏం ఫరవాలేదు. ఇంటర్‌నెట్‌లో తెలుగు వ్యాప్తితో మళ్లీ నన్నయ, పోతన, శ్రీనాథునివంటి కవులను చూస్తాం. ఇంతకీ పై పద్యం చదివినపుడు ప్రతి పాదంలోనూ వినబడే శబ్దం ఏమిటి?
UII UIU III UII UII UIU IU అని కదా. ఒకోటి ఒకో గణం. పైన చెప్పుకొన్నవాటిలో ఇవి ఏ గణాలో పోల్చి చూద్దాం.
భ ర న భ భ ర వ
భరనభభరవ - ఈ గణాలున్న పద్యం యెక్క ఛందస్సును మన పెద్దలు ఉత్పలమాల అన్నారు. మన పద్యం ఉత్పలమాల వంశాంకురమని మన డి.ఎన్.ఏ పరీక్షలో తేల్చాం. తమాషా ఏమిటంటే పద్యానికి నాలుగే పాదాలుంటాయనుకునేవాణ్ణి ఇన్నాళ్లూ. ఈ పద్యానికి ఐదున్నాయి. నాకిదొక విచిత్రం. ఈ రోజు ఇలా మొదలెట్టగానే ఇన్ని విషయాలుగుర్తొచ్చినందుకు, తెలిసినందుకు చాలా అనందంగా వుంది. నేను చెప్పినపద్ధతి పక్కా కమర్షియల్ సినిమాలాగా ఉందనిపిస్తే, తెవికీ టాకీస్‌లో ఆర్టు సినిమా ఆడుతోంది. చూడండి.
ఈ పని చేస్తున్నంతసేపూ నేను ముక్కావారిపల్లెలోని ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాలలో చదువుకునేటప్పుడు మా తెలుగు ఉపాధ్యాయిని నజీరాబేగం గారు, ఈ ఛందస్సు సాధనచేయటం కోసమే మేము రాసిన ఎన్నో పరీక్షలు, అ ఎర్రమట్టి, మేము నీళ్లుపోసి పెంచిన జామచెట్లు, అన్నీ గుర్తొస్తూవున్నాయి. ఈ మధ్యనే ఫోన్‌నంబరు దొరికింది. సంక్రాంతికి వారంముందునుంచీ ప్రయత్నిస్తూనే వున్నాను, ప్రతిసారీ హచ్ ఏదోఒక కథచెబుతూంది. పోలికలో కొంచెం మా అమ్మలాగా వుండేది. పదవ తరగతి చివరిపరీక్షరాసి బయటికొస్తూంటే "ఏయ్ మొద్దూ ఇలారా" అని పిలిచి వీడుకోలు చెబుతూ "ఎన్ని బ్యాచ్‌లు వచ్చివెళ్లినా మీ బ్యాచ్‌ని, ముఖ్యంగా నిన్ను మరిచిపోనయ్యా" అన్నమాట నా చెవుల్లో అమృతమైంది. చివరిసారిగా చూసి పన్నెండు సంవత్సరాలయింది. ఇన్నాళ్లూ బతుకుదెరువుకోసం చదువులపోరాటంతోనే గడిచిపోయింది. మళ్లీ ఒకసారి చూడాలి. కనీసం మాట్లాడాలి.

కామెంట్‌లు
మీరు నిజంగా అసాధ్యులు. తెలుగు సినిమా పండుగదినాల్లో దాశరథీశతకంలోని ఒక పద్యంతో మొదలుపెట్టి, కమర్షియల్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు కళ్ళముందు అలా... చూపించి మీ ఊరి బడికి మమ్మల్ని తీసుకెళ్తే, మా ఊరి బడి నా కళ్ళ ముందు కదలాడుతోంది. ఉపాధ్యాయుల చేత "ఎన్ని బ్యాచ్‌లు వచ్చివెళ్లినా మీ బ్యాచ్‌ని, ముఖ్యంగా నిన్ను మరిచిపోనయ్యా" అనిపించిన మీరు ధన్యులు.
ఐతే "ంట" తో "ండ" కు ప్రాస చెల్లుతుందా?
post beginning lO padyam lO renda va paadam lO
raama murtikin
missing.. its there in the other places though.
chaala baaga cheppaaru.
are you going to continue the venture with others like chempakamaala, tEtageeti etc also?
i am very much interested to learn and apply to what i write.
excellent job!!
మీ సూచనకు ధన్యవాదాలు. తప్పు సరిదిద్దుకున్నాను.
నిజమే, మీరన్నట్లు మిగతా ఛందస్సులకూ ఒకో మంచి ఉదాహరణతో రాయెచ్చు. మీరిచ్చిన ఆలోచన మెల్లమెల్లగా అమలులో పెడతాను.
"భరనభభరవ", "యమాతారాజభానసలగం" లాంటి వాటితో మళ్ళీ మా తెలుగు పండితున్ని కళ్ళముందుంచారు.
ధన్యోస్మి!
--ప్రసాద్
http://blog.charasala.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.