పోస్ట్‌లు

ఆగస్టు, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

గూగులమ్మ పదాలు

ఏడో విడత... ******* బుద్ధి మాంద్యుల చేత అర్థ మాంద్యపు వాత సబ్‌-ప్రైము తలరాత ఓ గూగులమ్మా! మాంద్య మార్థిక మగుట ఉద్యోగులకు నొసట హృద్రోగముల చెమట ఓ గూగులమ్మా! పింకు స్లిప్పుల సెగకు జంకకుండా వెదుకు సద్యోగములె దొఱుకు ఓ గూగులమ్మా! స్లంపు వేళల జనము జంపు చేయుట శుభము అంటబోదట అఘము ఓ గూగులమ్మా! కొత్త విద్యల నేర్పు శక్తులన్నిటి కూర్పు మాంద్యమున ఓదార్పు ఓ గూగులమ్మా! కఠినమౌ ఈ జగతి ఓర్మి గల్గిన సుమతి పొంద గలడట సుగతి ఓ గూగులమ్మా!

శాసనసభలో ...

ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడొచ్చన్నమాట! ;-)

పొద్దుపోని యవ్వారం - 10

" అలో " " ... " " నిన్నే " " ప్చ్.. " " ఏమయిందలా వున్నావ్ " " పోయింది " " ..?? ఏం పోయింది? " " ఏదైతే పోకూడదో అదే పోయింది " " అంత ముఖ్యమైన వస్తువు ఏందబ్బా! పోతే మళ్లీ కొనొచ్చుగదా? " " వస్తువు కాదు " " మరి? మనిషా? మనసా? " " కాదు! కాదు!! " " ఇంకేముంది నువ్వు పోగొట్టుకోవడానికి? " " పురుషలక్షణం. " " వోవ్..! వోవ్..!!! ఏం జరిగిందేమిటి?ఏదైనా తగిలిందా?ఎవరితోనైనా ఎక్కడైనా గొడవా? " " ఇంకెక్కడ! అఫీసులోనే. గొడవేం లేదు. మర్యాదగా పిలిచి, మెత్తగా మాట్లాడి, చెప్పి మరీ తీసేశారు. " " మ్...?!! వాళ్లు తీసేసింది నీ ఉద్యోగమేనా? " " ఔను. " " వార్నీ! చంపేశావు గదా ! ఓసోస్... " " ఉద్యోగం పురుష లక్షణం అన్నారు తెలుసా! అదే పోయింతరువాత... " " మగవానికి ఉండాల్సిన సవాలక్ష దరిద్రపు లక్షణాల్లో ఉద్యోగం ఒకటి. అంతే. అంతకు మించి ఊహించుకోకు. " " ... "

సాయం సమయం సెక్సు

'తెలుగుతో పాటు ఇంగ్లీషు చందమామ కూడా చదవండ్రా, మీ ఇంగ్లీషు మెరుగవుతుంద'ని ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల (ముక్కావారిపల్లె) లో మా ఆంగ్ల గురువు చెప్పారు - సెలవులకు ముందు. ఆమె సలహాను మరిచిపోకుండా రాజంపేటలో బస్సు మారేముందు చందమామలు కొన్నాను. తెలుగు చందమామను బస్సులో చదివితే వాళ్లూవీళ్లూ అడుగుతారని సంచిలో దాచిపెట్టి, ఇంగ్లీషు చందమామను హస్తభూషణంగా అలంకరించుకొని, రాయచోటి బస్సులో కూర్చున్నాను - దానిజోలికీ దాన్నిచదివే నా జోలికీ ఎవరూ రారని. ఆ ఇంగ్లీషులో కథ చదవడం చాలా కష్టంగా వుంది. బొమ్మలన్నా ఒకసారి చూద్దామని పేజీలు తిప్పుతూ, ఒక బొమ్మను చూసి ఆగిపోయాను. ఆ బొమ్మ వెనుక కమామీషు ఏమిటో కనుక్కుందామనే బలమైన కుతూహలం కలిగింది. ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద రాతిని దొర్లించాలని శ్రమపడుతుంటాడు, ఆ రాయి కదలదు. ఇదంతా ఆ పిల్లవాని తండ్రి చూస్తూవుంటాడు. ఇదీ ఆ బొమ్మ. దాని పక్కన నాలుగే నాలుగు ఇంగ్లీషు ముక్కలున్నాయి. "నిజంగా నువ్వు నీ బలాన్నంతా ఉపయోగిస్తే, ఆ రాయి కదులుతుంది" "నాకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను" "లేదే! నీ పక్కనున్న మనిషి సాయాన్ని నువ్వు అడగనేలేదే! సమయం వృధా చేస్తున్నావు."