పోస్ట్‌లు

ఆగస్టు, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

లఘు కవితలు - సర్వలఘు కందము

కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ... కం. మిడిమిడి తెలివిడి తెగబడి వడివడి పరుగిడు కవితల పడిపడి చదువన్ దడదడ మని జడి కురిసెను గడగడ వణికెను భువనము ఘటములు పగిలెన్!! ... ఇదీ నా పద్ధతి. గతంలో ఇలాంటిదే ఒక తవిక కూడా తయారు చేశాను. భాషందం బ్రతు కందం అంటున్న రాకేశుని బ్లాగులో కాస్త నవీనమైన పద్ధతిలో కందపద్యాన్ని గురించిన మంచి పరిచయమొకటి చూశాను. బమ్మెర పోతన్న గారి భాగవతంలోని ఒక సర్వలఘుకందాన్ని గురించి రాకేశ్ మాట్లాడుతూ, "మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం" అన్నారు. 'అందరూ చనిపోయే ముందు' అంటే 'కలియుగాంతంలో' అని కాదని విజ్ఞ

స్థానబలిమి జ్యోకులు

ఈ మహానగరానికి మేమొక చివరా సినిమా హాళ్లు మరో చివరా వుండటం వల్ల ఇక్కడ తెలుగు సినిమా చూడటం మాకొక ప్రయాస. ఒక్కళ్లమే అంతదూరం పోవడమనేది పరమ బోరింగు అనుభవం (థాంక్స్ టు జంధ్యాల) ఔతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ గుంపుగా పోతుంటాం. గుంపు మొత్తం కదలడానికి వీలుపడని లేదా ఇష్టపడని సినిమాలకైతే ఒక్కళ్లమే వాక్‌మన్లో (ఐపాడో ఏదో ఒక పాడు) పాటలు వింటూ వెళ్లొచ్చు. ఎంత సేపటికీ థియేటర్ రాలేదే అనిపిస్తుంది. సినిమా మీద మోజు మాత్రం తగ్గదు. తమాషైన ఈ సందర్భంకోసం నా మటుకు నేను ఒక ప్లేలిస్టు తయారుచేసి పెట్టుకున్నాను. అందులో నుంచి కొన్ని పాటలు: *. ఏడు కొండల సామీ ఎక్కడున్నావయ్యా(ప్రార్థన ప్రారంభగీతం) *. నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండే దీ నేలపై *. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా *. హరహర మహాదేవా శంకర! హిమాలయాలకు రాలేనయ్యా *. ఉన్నావా ... అసలున్నావా ... (భక్తిరంజని సమాప్తం) *. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలదీ పెరుగును అనురాగం, విరహంలోనే వున్నది అనుబంధం ... (రక్తిరంజని మొదలు) *. ఆకాశమా నీవెక్కడ! అవనిపైనున్న నేనెక్కడ!! *. ఎన్నాళ్లో వేచిన ఉదయం ... (ధియేటర్ సమీపానికి చేరుకున్నాక) *

మయాన అనగానేమయా?

ఎవరో పిలిస్తె వచ్చిందీ, ఎవరికోసమో పోతోందీ, మయాన మజిలీ యేసిందీ, మయాన మజిలీ యేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే (౨) పళ్ళు పదారూ రాలునులే .. పళ్ళు పదారూ రాలునులే మొన్నామధ్యొకసారి మాటీవీలో 'పాడాలని వుంది' కార్యక్రమంలో ఒక పాప ' గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ' అనే పాట పాడింది. నిర్వాహకుడు బాలసుబ్రహ్మణ్యంగారు ఆ పాట సాహిత్యాన్ని గురించి రెండుముక్కలు చెబుతూ ఈ నాలుగు పంక్తులనూ ఉటంకించి ఇక్కడ ఆత్రేయ 'మయాన' అనే పదాన్ని వేసినందుకు మురిసిపోయారు. మయాన అంటే ఏమిటో చూద్దామని బ్రౌణ్యము లో వెతికాను కానీ అక్కడ దొరకలేదు. 'మయాన' అంటే 'మధ్యలో' అని ఈ పాట సందర్భానుసారం నాకు అర్థమయింది. నేను పుట్టక ముందు నుంచీ ఈ పాటను వింటున్నానుగానీ, ఇది మూగమనసులు సినిమాలోనిదని నాకిప్పుడే గూగులమ్మ ద్వారా తెలిసింది. నేనింకా 'మూగమనసులు' చూడలేదు. మొన్న ఆదివారం చిన్న పని మీద రోడ్డునబడి చిరంజీవి పాటలు వింటూ వెళుతూ వుండగా 'మయాన' మళ్లీ తగిలింది. మెగాస్టార్ సగటు అభిమానులు చెప్పగలరా ఏ పాటలోనో? సగటు అభిమానులను ఎందుకు అడుగుతున్నానంటే వీరాభిమానులు చెప్పలేరని నా అనుమానం. సరే చ

వినాశ కాలే ...

ప్రస్తుతం టెక్సాస్ గుండా ఒక హరికేన్ ప్రయాణిస్తూవుంది. ఈ తెల్లవారుజామున తీరాన్ని దాటిందట. ఈదురు గాలుల వలన పెద్ద ప్రమాదం లేకపోయినా హ్యూస్టన్ మహానగర పరిసరాల్లోని కొన్ని కౌంటీలకు దీని ప్రభావం వల్ల వరదలొచ్చే అవకాశం వుంది కనుక జాగరూకులై వుండండి అని రేడియో, టీవీ, ఇంటర్నెట్టు, బయటర్నెట్టుల్లో నిన్నంతా ఒకటే హోరు. మా కచేరీకి సెలవు ప్రకటించే అవకాశం వుండవచ్చని ఒక అధికారిక వేగు కూడా అందింది. అధికారిక వేగులకు మామూలుగా పట్టే చెత్తబుట్ట యోగం దీనికీ పడుతుందనే అంచనాలతో దాన్నే ఉద్యోగులంతా ఫార్వర్డు చేసుకుని రసీదులు కూడా అందుకున్నారు. నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు మా వాహనమోహన్ నాకు ఫోన్ చేసి, 'రేపటి కోసం తిండీ నీళ్లూ సిద్దం చేస్కున్నావా' అన్నాడు. "మరీ అంత 'యమ'ర్జన్సీ అంటావా?" అన్నాను. "ఏమో ఎవరు చూశారు! మంచినీళ్లు, చిరుతిళ్లు మాత్రం కొని దగ్గరపెట్టుకో. కావాలంటే నేనే కొంటా నీకోసం. ఇప్పటికే వాల్‌మార్టు, ఫియెస్టాల్లో మంచినీళ్ల బాటిళ్లు, కేన్లు మాయమయ్యాయి. గ్యాస్ స్టేషన్లలో చిన్నచిన్న క్యూలు తయారైనాయి. ఈ రాత్రికి బాగా వాన పడుతుందంటున్నారు. రెండ్రోజుల పాటు కరంటు పోయినట్లు వూహించు,