స్థానబలిమి జ్యోకులు
ఈ మహానగరానికి మేమొక చివరా సినిమా హాళ్లు మరో చివరా వుండటం వల్ల ఇక్కడ తెలుగు సినిమా చూడటం మాకొక ప్రయాస. ఒక్కళ్లమే అంతదూరం పోవడమనేది పరమ బోరింగు అనుభవం (థాంక్స్ టు జంధ్యాల) ఔతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ గుంపుగా పోతుంటాం. గుంపు మొత్తం కదలడానికి వీలుపడని లేదా ఇష్టపడని సినిమాలకైతే ఒక్కళ్లమే వాక్‌మన్లో (ఐపాడో ఏదో ఒక పాడు) పాటలు వింటూ వెళ్లొచ్చు. ఎంత సేపటికీ థియేటర్ రాలేదే అనిపిస్తుంది. సినిమా మీద మోజు మాత్రం తగ్గదు. తమాషైన ఈ సందర్భంకోసం నా మటుకు నేను ఒక ప్లేలిస్టు తయారుచేసి పెట్టుకున్నాను. అందులో నుంచి కొన్ని పాటలు:
*. ఏడు కొండల సామీ ఎక్కడున్నావయ్యా(ప్రార్థన ప్రారంభగీతం)
*. నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండే దీ నేలపై
*. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా
*. హరహర మహాదేవా శంకర! హిమాలయాలకు రాలేనయ్యా
*. ఉన్నావా ... అసలున్నావా ... (భక్తిరంజని సమాప్తం)
*. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలదీ పెరుగును అనురాగం, విరహంలోనే వున్నది అనుబంధం ... (రక్తిరంజని మొదలు)
*. ఆకాశమా నీవెక్కడ! అవనిపైనున్న నేనెక్కడ!!
*. ఎన్నాళ్లో వేచిన ఉదయం ... (ధియేటర్ సమీపానికి చేరుకున్నాక)
*. వ-స్తున్నా నే-నే వ-స్తున్నా (కొత్తపాట. మీరూ ఒక చెయ్యి వెయ్యొచ్చు.)
ఈమధ్య ఒక తెలుగు సినిమా చూద్దామని ఐదు మందిమి బయల్దేరాం. రివ్యూలు, రేటింగులు ప్రోత్సాహకంగా లేవు. పై లిస్టులో వున్న పాటలను పాడుతూవుంది సీడీ ప్లేయరు. నగర పొలిమేరల్లో కర్మాగారాల పొగ గాలితో పాటు నేరుగా రోడ్డుమీదకు వస్తోంది. మా వాహనంలోకి ఆ ఘాటు ప్రవేశించింది. వెంటనే మా వాచోమి(వాహన-చోదక-మిత్రుడు) సీడీప్లేయరు గొంతు నొక్కి, "కృళ్లిన క్రోడి గృడ్ల వాసన గల దట్టమైన పొగ, ధారాళమైన దగ్గు" అన్నాడు. ఆయన ఆ మాట చెప్పిన తీరుకు మాకందరికీ విపరీతమైన నవ్వుతో పాటు దగ్గు కూడా కలిసి కొంత సేపు ఊపిరాళ్లేదు. ఆ మనిషి మాత్రం నవ్వకుండా "మీరంతా వట్టి దగ్గుబాటోళ్లు" అన్నాడు. ఆ పైన "ఆ ప్యాక్టరీ వాడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు."
అంతగా నవ్వడానికి ఆ మాటలో ఏముందంటే - ఒకటి మా ఐదుగురి చదువూ పదోతరగతి దాకా తెలుగు మాధ్యమే. ఆ తరువాత కూడా పేరుకు ఇంగ్లీషే కానీ దాదాపుగా తెలుగులో చదువుకున్నట్టే లెక్క. మాకు హైడ్రోజన్ సల్ఫైడు (H2S) యొక్క "క్రుళ్లిన క్రోడి గ్రుడ్డు వాసన"వాసన Chemistryలో కంటే ముందుగా రసాయనశాస్త్రంలో పరిచయమయింది. మాలో కొంతమందిమి ప్రయోగశాలలో దాన్ని వాసన చూసివున్నాం కూడా. అప్పటి మా గురువులు, కృ.క్రో.గృ.వాసనను బట్టీకొట్టడం, పదేపదే యూనిట్ పరీక్షల్లో రాయడం, ఎంసెట్ కోసం H2S పరమాణువుల మధ్య గల 92.1 డిగ్రీల కోణాన్ని కూడా బట్టీ కొట్టాం. అప్పుడు ఎందుకు బట్టీ కొట్టామో, ఇప్పుడు దాని ఉపయోగమేమిటో సరిగా తెలీదు. ఆ తరువాత బెంగుళూర్లోని హోసూర్ రోడ్లో కచేరీ(ఆఫీసు)కొస్తూ అలాంటి వాసనను రోజూ పీల్చాం. ఇక, దట్టమైన పొగ- ధారాళమైన దగ్గు అనేది చిన్నప్పుడు మేం విన్న గంగాధర మిమిక్రీలో ఒక బీడీ యాడ్. ఆ పైన మేమంతా ఇష్టపడే మా మిత్రుని జ్యోకులగాత్రంలోని ప్రత్యేకమైన యాస. ఈ అనుభవాలన్నీ ఒక్క క్షణంలో మనసును నింపేసి సల్ఫేన్ను కాస్తా నైట్రస్ ఆక్సైడ్గా మార్చేసినాయ్.
కొన్ని జోకులు టపాసుల్లాంటివి. ఒకసారి వాటి వొత్తి అంటుకుని పేలితే వాటి కథ అంతటితో ముగిసిపోతుంది. ఇలాంటి జోకులను తీసుకెళ్లి మరోచోట పేల్చాలని చూస్తే, పేలిన టపాకాయను మళ్లీ పేల్చడానికి ప్రయత్నించినట్టే. ఈ టపాలో నేను చేసింది అదేనంటారేమో!
అందుకే వీటిని 'స్థానబలిమి జోకు'లంటాన్నేను! థాంక్స్ టు వేమన్న.

కామెంట్‌లు
కొనగోట మీటిన చాలు..
ముఖ్యంగా దగ్గుబాటొళ్ళు, వాచోమి, "కృళ్లిన క్రోడి గృడ్ల వాసన గల దట్టమైన పొగ, ధారాళమైన దగ్గు" :)
ఒక్కళ్లమే బదులుగా ఒకరమే అనాల్సింది. 'పోతాండారా' బదులుగా 'వెళ్తున్నారా' అన్నప్పుడు నా మాటల్లో కల్తీ(!) చేరిందనుకున్నాను. 'చూసినారు' బదులుగా 'చాశారా' కూడా వచ్చేసింది - ముఖ్యంగా రాతలో. ఇంట్లోవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, మాండలికం రాయాలనుకున్నప్పుడు తప్ప, పల్లె వదిలి పట్టణం, పట్టణం వదిలి నగరం, మహానగరం చేరేకొద్దీ మన అసలు భాష కల్తీ [అనగా నాగరీకం :)] అవడం అనివార్యమే కదా మనకిష్టమున్నా లేకున్నా!
* జగమే మాయ.. బ్రతుకే మాయ
* కుడి ఎడమైటే.. పొరబాటు లేదోయ్
* రారా.. కనరారా
* జన్మ మెత్తితిరా.. అనుభవించిరా
* దేవుడికేం.. హాయిగా ఉన్నాడు
* బొమ్మను చేసి.. ప్రాణము పోసి
* తనువుకెన్ని గాయాలైనా.. మాసిపోవు ఎలాగైనా
* ఆశ నిరాశను చేసితివా?
* ఆ నావ దాటే పోయింది
* సుడిగాలి లోన దీపం..
* మనసు గతి ఇంతే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.