పోస్ట్‌లు

మే, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

మంచిపేరు - చెడ్డపేరు - సౌఖ్యం

... అందులో ఆయన నా మస్తిష్కంలో జరుగుతున్న మధనాన్నే ప్రస్తావించారు. మనం చూసే సినిమాల్లో సాధారణంగా హీరో పేదవాడైనా ధనికుడైనా మంచివాడు. అతడికి అమాయకురాలైన చలాకీ చెల్లెలు, ఒక తల్లి, ఒకరిద్దరు ప్రియురాళ్లు ఉండే అవకాశాలు ఎక్కువ. అతడు మంచికి మారుపేరు, నిజాయితీకి నిలువుటద్దం. ఆత్మాభిమానం అతని అందం. అందరికీ తలలో నాలుక, ఆపద్బాంధవుడు వగైరా వగైరా. అతని మార్గం కఠినం. కష్టపడి పని చేసి సంపాదిస్తాడు. అవసరంలో ఉన్నప్పుడు ఆ సంపాదనే నలుగురికీ పంచుతాడు. నిజంగానే మంచివాడే అయినా, "నువ్వు చాలా మంచివాడివి నాయనా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు" అంటే ఇబ్బందిగా మొహమాటంగా కదిలి అంతా "మీ అభిమానం" అని సిగ్గును అభినయిస్తాడు. అతనికి చెల్లెలు గుర్తుకొస్తుంది. అదే సమయంలో ఏ పొలంగట్టునో, కాలేజీలోనో, సందు చివరో విలన్‌గానీ వాడి కొడుకుగానీ ఈమెను చూస్తాడు. తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. దగ్గరికెళ్లి "నువ్వూ పారేసుకో" అంటాడు. అన్నయ్య నేర్పిన ఆత్మాభిమానంతో ఆ చెల్లెలు వాణ్ణి దులిపేస్తుంది. "ఎంత పొగరు" అంటాడు విలన్‌గాడి చెంచా. స్థితప్రజ్ఞుడిలా సర్వజ్ఞుడిలా పోజిచ్చి "పొగరేరా ఆడదానికి అం

మంచిపేరుకూ సుఖానికీ యడమెంత!?

ఈ కథ చెప్పే ఒక మాట: మన బ్లాగులలో తెవికీకి లింకులిద్దాం. లింకు అక్కడ లేకపోతే మనమే తెవికీలో ఒక పేజీ సృష్టిద్దాం. ఈ టపాలోని గొల్లపూడి పేజీ నేనే సృష్టించాను. తెవికీ వాడకాన్ని అలవాటు చేసుకుందాం. గొల్లపూడి మారుతీరావు గారు నటించిన తొలి సినిమా " ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య ". ఆ సినిమా పేరు ఆయన పోషించిన పాత్రను ఉద్దేశించి పెట్టారనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన చెప్పే మాటలు బలే ఉంటాయి. ఒకేఒకసారి ఎప్పుడో పన్నెండు పదమూడేళ్ల క్రితం చూసినా అందులోని రెండు సన్నివేశాలు నాకు పదేపదే గుర్తొస్తూంటాయి. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని తనవద్దకు వచ్చిన ఒక పేదమధ్యతరగతి యువతిని ఇంటర్యూ చేస్తూ ఆమెపై చేయివేసి కాంక్షగా చూసి, ఆమెతో చెంపదెబ్బతిని, ఆమె ఆత్మాభిమానానికి ముచ్చటపడి, ఆమె సంస్కారానికీ ధైర్యానికీ పరీక్షపెట్టిన పెద్దమనిషిగా అభినందించి ఆమెకు ఉద్యోగం ఇవ్వడం - మొదటి సన్నివేశం. పెద్దమొత్తంలో సొమ్ము ఆమెచేతికిచ్చి ఆఫీసులో దాచమని చెప్పి, దాన్ని తానే కాజేసి, నింద ఆ అమ్మాయిపై మోపి, పోలీసులకు ఫోన్ చేస్తానని కోపం నటిస్తూండగా వద్దని బ్రతిమాలుకుంటున్న ఆమెపై మళ్ళీ చేయివేసి, ఆ నిస్సహాయురాలిని తనగదిలోకి తీసుకెళ్లడం

బ్రౌను మహాశయునికి కందపు కైమోడుపు

కం . అంధతమసము న నుండిన గ్రంధము లెన్నియొ వెలుగును గాంచిన ఖ్యాతిన్ ఆంధ్ర నిఘంటువు కూర్చిన సాంద్రతమ ఘనతయు తలతు సతతము బ్రౌణ్యా!

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!!

అమ్మాయిని చూడ్డానికొచ్చినవాడు రిషభాన్ని వృషభం అనగానే శంకరశాస్త్రికి ఒళ్లూపైతెలీకుండా పోతుంది - శంకరాభరణం సినిమాలో. "మన తెలుగుభాషను రక్షించుకుందాం, బ్రతికించుకుందాం, కాపాడుకుందాం ..." ఇలాంటి మాటలు ఎవరినోటైనా వింటే నాకూ అంతే. "బ్రతికించుకోవడమేమిటి నీబొంద? అదొక ఘనకార్యమన్నట్లుగా చెబుతున్నావు! నువ్వు బ్రతికించకుంటే భాషకేమిటి నష్టం? అది చచ్చి ఊరుకుంటే ఎవరిదేం పోయింది? అవసరం లేనపుడు 'రక్షించుకోవడమ'నే బరువును ఎవరైనా ఎందుకు మోస్తారు" అని అడుగుదామనిపిస్తుంది. తెలుగు అవసరమే లేకుండా ఆనందంగా బతుకుతున్న తెలుగు(వారి)బిడ్డలకు ఈ మాటలు అర్థవంతంగా అనిపిస్తాయనుకుంటా. కొన్ని సమావేశాల్లో కొందరు పెద్దమనుషులు చెప్పే ఈ బరువు మాట, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై మోపుతున్న ఈ బరువు - అర్థరహితంగా కనిపిస్తాయి. భాషలో మన సంస్కృతి మూలాలున్నాయి. మంచి నడవడినీ, ఆధ్యాత్మిక చింతననూ, సామాజిక స్పృహనూ, తద్వారా ప్రశాంత జీవనాన్ని సాగించే సమాజాన్ని కొన్ని శతాబ్దాలుగా సాధ్యపరచింది మన మాతృభాష. మన భాషను అనుసరించి వచ్చిన సంగీతము, పురాణ పారాయణ కాలక్షేపాలు, హరికథలు, పిట్టకథలు, తోలుబొమ్మలాట లు, వీధినాటకాలు

పెరగంగా పెరగంగా పెద్దబాబు ...ట.

మన శోధన సుధాకరులు , భూపతిమహాప్రభువులు ఇచ్చిన స్ఫూర్తితో ... హన్నన్నా! నేనేనా తక్కువతిన్నది! ఎన్నదగిన కవిని ఎవరు కాదన్నది!!? ఎన్నెన్నో భావాల కవిత - భావకవిత!? కన్నీరొలికించే కవిత కళ్లకలకంటి కవిత!!? అర్థంకాదన్నవాళ్లకు అందకుండా! పర్థంలేదన్నవాళ్లకు చెందకుండా!! ముక్కల ముక్కల కవిత! ముక్కులదిరేలా!! తిక్కల తిక్కల కవిత! తిక్క కుదిరేలా!! తప్పించుకోలేరు! నా ముప్పేట దాడిని!! గుప్పుగుప్పున వదులుతా!! తప్పులెన్నున్నా! గుక్కతిప్పుకోనివ్వని కవిత! ముక్కును పచ్చడిచేసే కవిత!! ఇది వారికే అంకితం. అంటే ఇది కలిగించే దుష్ప్రభావాలన్నీ వారికే అంటగడతున్నానన్నమాట. దీని స్ఫూర్తితో ఇంకెవరు కవితలు రాసినా అవి కూడా ఈ మూలవిరాట్టులకే ఇందుమూలముగా చెందులాగున పెద్దలు నిశ్చయించినారు. వందే పార్వతీ పరమేశ్వరౌ!!

ఇంటికెడితేను టీవీని పెట్టినారు!

మొన్నటిదాకా రేడియోలో సమస్యాపూరణం పద్యాలు వింటూ, "మన స్థాయి కాదులే" అనుకునేవాణ్ణి. జీవితసత్యాలనూ సన్మార్గాలనూ సరళమైన పద్యాలుగా అల్లి, పద్య ప్రక్రియను పామరుల నాలుకల మీదకు తెచ్చిన తెలుగు వైతాళికుడు మహానుభావుడు వేమన. సుజనరంజని వారి ప్రయత్నం ఇదే దిశలో ఉంది. కానీ, వారిచ్చిన సమస్యను నా స్థాయిలోనే పూరించినా ప్రోత్సహించి ప్రచురించినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మరోసారి కొత్తపాళిగారికి ధన్యవాదాలు.