పెరగంగా పెరగంగా పెద్దబాబు ...ట.
మన శోధన సుధాకరులు, భూపతిమహాప్రభువులు ఇచ్చిన స్ఫూర్తితో ...
హన్నన్నా! నేనేనా తక్కువతిన్నది!
ఎన్నదగిన కవిని ఎవరు కాదన్నది!!?
ఎన్నెన్నో భావాల కవిత - భావకవిత!?
కన్నీరొలికించే కవిత కళ్లకలకంటి కవిత!!?
అర్థంకాదన్నవాళ్లకు అందకుండా!
పర్థంలేదన్నవాళ్లకు చెందకుండా!!
ముక్కల ముక్కల కవిత!
ముక్కులదిరేలా!!
తిక్కల తిక్కల కవిత!
తిక్క కుదిరేలా!!
తప్పించుకోలేరు! నా
ముప్పేట దాడిని!!
గుప్పుగుప్పున వదులుతా!!
తప్పులెన్నున్నా!
గుక్కతిప్పుకోనివ్వని కవిత!
ముక్కును పచ్చడిచేసే కవిత!!
ఇది వారికే అంకితం. అంటే ఇది కలిగించే దుష్ప్రభావాలన్నీ వారికే అంటగడతున్నానన్నమాట.దీని స్ఫూర్తితో ఇంకెవరు కవితలు రాసినా అవి కూడా ఈ మూలవిరాట్టులకే ఇందుమూలముగా చెందులాగున పెద్దలు నిశ్చయించినారు. వందే పార్వతీ పరమేశ్వరౌ!!
కామెంట్‌లు
అన్నట్టు ఈ సందర్భం లో నేను మా మిత్రులొకరు చెప్పిన ఒక "కొత్త" కవిత చెప్పకపోతే మహా పాపం అవుతుంది.
అది ఇలా సాగుతుంది:
సూరి..
హోటల్ లో దూరి..
తిన్నాడు పూరీ..
జేబులో చూస్తే డబ్బుల్లేవు మరి..
అప్పుడు కనిపించిందొక లారీ..
తర్వాత నాకు గుర్తు లేదండీ బాబోయ్.
ఏ కవిత చదివిన తర్వాత ఎక్కువ వాంతులు అవుతాయో దానికి ప్రధమ బహుమతి.
ఇంకా స్పూర్తి పొందాలంటే వెంటే ఈ కింది లంకెకి వెళ్ళి, వచ్చిన ఉత్తేజంతో ఇంకోటి రాయండి మా ఆవిడ వంట సరీగా వండనప్పుడు పాడుకుంటా :-)
http://ideenaamadi.blogspot.com/2007/01/blog-post_19.html
-విహారి
రావుగారూ, మీ వ్యాఖ్యతో నా కవిత్వపు విశిష్టత ఇనుమడించింది.
స్వాతిగారూ, కొత్త అనే పదానికి కొమ్ములుపెట్టి - నా ప్రార్థన మీక్కొంచెం కొత్తగా అనిపించి వుండొచ్చు - అన్న విక్టరీవెంకీ డైలాగ్ గుర్తుచేశారు.
సుధాకరా, ఈ యేడు ఇండిక్ బ్లాగువారిని ఈ విషయంమీద ఒప్పించాలి.
రాధికగారు, బొమ్మరిల్లు సినిమాలో - పిచ్చెంక్కించేస్తా - డైలాగ్ ఉందే, నా ఉద్దేశం అదే. పదాల అల్లిక బాగుండకపోతే చదవరుకదా, చదివితేనే కదా రాసిన ఉద్దేశం నెరవేరేది!
కొత్తపాళీగారూ, రెండుసామెతను కలిపి యడాపెడా... చిన్నప్పుడు ఈతబర్ర, చింతబర్ర పెనవేసి మమ్మల్ని కొట్టేవాళ్లు మా శ్రీనివాసా కాన్వెంట్లో అయ్యవార్లూ అమ్మవార్లూ.
విహారిగారూ, నా కవితకొక ప్రయోజనం ఉందని తెలిసి చాలా సంతోషించాను. అలాగే పాడుకోండి - కాపీరైటు అభ్యంతరాలేమీ లేవు. కాపోతే, మరో కవి బ్లాగుకు దారిచూపి, నాకే పిచ్చెక్కించెయ్యాలని చూస్తారా...!!?
ఇక జ్యోతిగారు, జంధ్యాల సినిమాలో వీరభద్రరావును గుర్తుచేశారు. కవిత్వానికున్న శక్తి అలాంటిది మరి.
మీ అందరికీ కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.