Tuesday, October 09, 2007

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

వెంకట్ సిద్ధారెడ్డి బ్లాగులో జరిగిన చిన్నపాటి చర్చకు నా అభిప్రాయాన్ని వీలైనంత బలంగా చెప్పే ప్రయత్నం ఈ టపా. అంతే కాకుండా, ఈ వీడియో చివరలో మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓలేటివారి స్వరకల్పన... దివ్యం! అనగా దివినుంచి జాలువారినది అని తాత్పర్యం. నేనొక ఇరవైమార్లు విని, అందరూ మళ్లీమళ్లీ విని ఆనందించాలనే సదుద్దేశంతో యూట్యూబుకు చేర్చాను. [ఇది ముమ్మాటికీ కాపీహక్కుల ఉల్లంఘనే. మాటీవీ వాళ్లు నామీదకు యుద్ధానికి రారని ఆశిస్తున్నాను. :)]

20 comments:

venkat said...

thanks a lot for sharing it......

కొత్త పాళీ said...

Balu is quite amazing in his frankness! More than in Chennai, I found this kind of "absorption of audience in music" in Pune audiences.

Ranare, kudos for bringing this video out.

వికటకవి said...

బాలు కి కొంచం గర్వం, పొగరు అని మన జనాలు(ముఖ్యంగా సినిమా వాళ్ళు) అంటారు. కానీ, నేనొప్పుకోను. ఏమాత్రం విషయం లేని జనాలు రెచ్చిపోయి తమని తాము ప్రమోట్ చేసుకొనే రోజుల్లో, అంతటి మహానుభావుణ్ణి గుర్తెరగటం, గౌరవించటం ముఖ్యం. మల్లది గారూ చాలా బాగా చెప్పారు నిజాల్ని. నిజమెప్పుడూ చేదే కదా! చివర్లో ఆయన గాత్రం అదిరింది. రానారె, బహు కృతజ్ఞతలు.

రానారె said...

వెకట్ - కొంతవరకూ ఇది మన ప్రవర్తనకు సంబంధించిన విషయం. దీన్ని ప్రమోట్ చేసినందుకు మీకూ నెనరులు.

కొత్తపాళీ, వికటకవిగార్లు - సమకాలీనుల గొప్పతనం అంత సులభంగా గ్రాహ్యం కాదు కదండి... మహామహా ఘంటసాల విషయంలోనూ ఇంతేనటకదా! ఒకరు ఏదైనా మంచి మాట చెబితే, అందులోని సత్యాన్నీ విషయాన్ని గురించి చర్చించడాన్నొదిలేసి, ఆమాట చెప్పడానికి వాడికి అర్హత ఏయేవిధాలుగా లేదో తవ్వితీసే ప్రయత్నాలు చెయ్యడం మన రాజకీయనాయకులనుంచీ ప్రజలందరమూ నేర్చుకుంటున్నట్లున్నాం.

lalitha said...

నాకు "జన్మకో శివ రాత్రి" లాంటి అనుభవాలలో పూణెలో జాకీర్ హుస్సేన్ కచ్చేరీకి వెళ్ళడం ఒకటి. జనవరి ప్రాంతంలో కచ్చేరీల పండుగలు జరిగేవి. ఇప్పటికీ జరుగుతున్నాయేమో. విద్యార్థులు afford చెయ్యగలిగే లెవెల్లో టిక్కెట్టు ధరలు ఉండేవి. విద్యార్థులు అంత మక్కువగానూ వెళ్ళే వాళ్ళు. నేను ఒక్క సారి వెళ్ళి మిగిలిన సార్లు ఎంత miss అయ్యానో తెలుసుకోగలిగాను.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఆయన పాడిన ఆ కీర్తనని నేను ప్రత్యక్షంగా చూసాను. మళ్ళీ ఇక్కడ చూసే అవకాశం కలిగింది. మీకు నెనర్లు

కొత్త పాళీ said...

@Harsha - keertana??
Didn't he sing a love song?

కృష్ణమోహన్ చివుకుల said...

రానారె గారూ, మంచి వీడియోని అందించినందుకు ధన్యవాదాలు. బాలు గారి వ్యాఖ్యలు సునిశితంగా, కొంచెం తమిళ పక్షపాతంగా అనిపించాయి. ఏమో మరి, ఆంధ్రదేశంలో ఉంటున్నాను కదా - కొంచెం చురుక్కున తగిలాయి.ఆ మరి - అక్కడికి తమిళులు వెర్రి సినిమాలు, గట్రా మాకు తెలియనివా ... ఇలా అనిపించినా, "రెండు తప్పులు ఒక కరక్టు అవ్వవు కదా" అని గుర్తుకువచ్చింది. మన తప్పు మన తప్పే. మల్లాది వారి గాత్రం, అందులో మాధుర్యం, అందించిన పాట అన్నీ అద్భుతం. కాకపోతే కడు భారమా, మేఘమాల లాంటి కొన్ని పదాలలో కొన్నిసార్లు ఆయన వదిలేసిన వత్తులు కొంచెం ఇబ్బంది పెట్టాయి.

వికటకవి said...

కృష్ణమోహన్ గారూ,

కడు భారమా నాకూ డైటు వచ్చింది, కానీ ఆడియో అంత క్లియర్గా లేదుకదా, నా పొరబాటేమో అనుకున్నాను. అంత మంచి పాటలో అవి చాలా ఇబ్బందే. కాకపోతే, అన్ని చోట్ల తప్పు పలకలేదు. కొన్నిసార్లు. తాదాత్మ్యంలో జరిగినాయేమో.

lalitha said...

బాలూ గారంటే నాకు అభిమానం. ఆయన గొంతు ఇష్టం. తెలుగు వాడై ఎన్నో భాషలలో మెప్పించడం ఇంకా ఆనందం.

అయితే, ఆయన తల్చుకుంటే కొన్ని పాటలు పాడకుండా ఉండలేరా? తెలుగు సినిమా పాట సాహిత్య విలువలను కాపాడడానికి తన వంతు సాయం చెయ్యలేరా?

తమిళుల సంగతి తెలియదు కానీ, తెలుగు వారికి (inlcuding me) ఏమున్నా లేకున్నా భాష విషయంలో అభిమానం కన్నా ఆత్మన్యూనత కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. అందుకే తమిళ స్నేహితులు బాలు గారిని మెచ్చుకుంటుంటే మనసు మహదానంద పడిపోతుంటుంది. వారు తెలుగు వాడని బాలూని దూరం చేసుకున్నారా, లేక ప్రజ్ఞ ఉందని ఇటువంటి వారిని దగ్గరికి తీసుకుంటున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. వారితో మాట్లాడేటప్పుడు ఇతను తమిళ వాడా కాదా అనే విషయం అసలు స్ఫురణకు కూడా రాదు.

మనం ఏం చెయ్యచ్చు మన భాష మీద మనకున్న "అభిమానాన్ని" చూపుకోవడానికి? తమిళులని తెగనాడడం మటుకు కాదు. అలాగే వారిని చూసి వాతలు పెట్టుకోవడమూ కాదు. ప్రతి ఒక్క తెలుగు వాడూ తెలుగుని ప్రేమించినా ప్రేమించకపోయినా, తెలుగు వారిలో తెలుగు గొప్పదనం తెలిసి, ఆస్వాదించి, పంచే వారు చాలా మంది ఉన్నారు. బ్లాగుల బాట ఇంకో రాచ బాట. మన భాష తెలుగు భాష. మనం దాని సుగుణాలను చాటుకుందాం. ఇంకో భాషతో, ఇంకో భాష మాట్లాడే వారితో పోల్చుకోవడం అవసరం ఉందంటారా? రాయల అభిమానం మనకు ఆడంబరం కాకూడదు. ప్రతి భాషా తీయనిదే.

ఇక్కడ తమిళం వినండి. మీకు ఏమనిపిస్తుందో చూడండి.
http://bookbox.com/view_online.php?pid=17

కాపికాము (courstesy సిరి గారు) సిండ్రోము లాగే ఎవరి తల్లిని వారు ప్రేమించడానికి ఆ తల్లి మిగిలిన వారికంటే గొప్పదే అవ్వక్కర్లేదు కదా.

రానారె said...

శాస్త్రీయసంగీతం నేర్పేవారిలోనూ నేర్చుకొనేవారిలోనూ ఉచ్చారణకు ప్రాధాన్యతనిచ్చేవారు అతి తక్కువేమో. తమిళులను వదిలేయొచ్చు, తెలుగువారైన సంప్రదాయసంగీత గాయకులలో సరైన ఉచ్చారణతో పాడుతున్నవారిని మీరెరుగుదురా? (తెలుసుకోదలచి అడుగుతున్నాను.)

ఆయన పాడుతూంటే సాహిత్యంమీదకు మనసుపోలేదు. మీరన్నాక గమనించాను - ఈ పాట సాహిత్యం ఏమిటని.

గడచేనటే సఖీ ఈ రాతిరి - కడు భారమైన యడబాటున
ఈ మేఘ ?????? - ఏ ??????
కా????? బైన నిదుర రాదాయనే

ఎవరికైనా అర్థమయివుంటే దయచేసి తెలుపమని ప్రార్థన.

వికటకవి said...

ఈ మేఘ వేళ - ఏ మోగ? చెలియా
కామితం బైన నిదుర రాదాయనే

ఎన్ని సార్లు విన్నా ఇంతకు మించి అర్థం కాలా. ఆ క్వశ్చన్ మార్క్ పదమే పెద్ద పూరణ. అది తెలిస్తే సరి.

రాకేశ్వర రావు said...

హృదయభాను ప్రసన్నుడైయ్యాడు :)
ధన్యవాదాలు

teresa said...

నాకర్థమైనంతవరకూ ఆ చివరి లైను -
స్వామి దవ్వైన నిదుర రాదాయనే..
( దవ్వు= దూరం)

రానారె said...

కానీ గడచేనటే.. అని పాడుతున్నది స్త్రీ కాదు కదండీ!?

teresa said...

స్త్రీ కాదని మీకెలా తెలిసిందీ? నేనిప్పుడే మళ్ళీ ఓ సారి వింటే ఈపాటలో రాకుమారి తన విరహబాధని చెలికత్తెకు మొర పెట్టుకూంటోందేమోననే కొత్త కోణం తట్టింది మరి!

రానారె said...

అమ్మో! నిజమే... నేనసలా దృష్టితో ఆలోచించనేలేదు. ధన్యవాదాలు. దవ్వైన... ఈ పదాన్ని భలే పట్టుకున్నారు.

వికటకవి said...

చెలియా, అన్నాడు కాబట్టి పాడింది చెలికాడే. కామితం అంటే, కోరుకొన్న/ఆశపడ్డ అన్న అర్థములో సరిపోతుంది.

vikatakavi said...

on further hearing, i think i'm wrong with the last sentence, and as teresa pointed out it does starts with 'swaami' for sure, though i'm not sure of the rest. sorry.

vikatakavi said...

raanaare,

if my previous post, i'm not sure but, if i said "hearing", please modify it to "listening" and post it. needless to say, you don't have to post this one though :-)

thanks

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.