విలేకరుల షూటౌట్ ప్రహసనం
ఆఫీసులో పనిలో ఉండగా ఒక వేగు వచ్చింది - "మన ఆఫీసు బయట భారీగా పోలీసులు మొహరించారు. పైన ఒక "ఛాపర్" కూడా తిరుగుతోంది. పక్కనే ఫలానా అపార్టుమెంట్ ప్రాంగణమంతా దిక్బంధనం చేయబడింది."
నా పక్క ఛాంబర్లో పనిచేసే మిత్రుడు ఆ అపార్టుమెంట్ ప్రాంగణంలోనే కొత్తగా వచ్చి చేరాడు భార్యాసహితంగా. నేనీ వేగును చదివేలోగా అతను ఫోనులో మాట్లాడుతున్నాడు - హిందీలో. ఆ తరువాత కుప్పలుతెప్పలుగా వేగులు. మిత్రుని ఇంట్లో సోదా జరిగిందని తెలియవచ్చింది. ఆతని పక్కింట్లో సోదాచేయడానికి పోలీసులు తలుపులు బాదుతున్నా ఎవరూ తీయడం లేదనికూడా తెలియవచ్చింది. ఆ తరువాత సహోద్యోగమన్యుల్లో చాలామంది స్వయంగా వచ్చేశారు - పరామర్శ చేయడానికి. ఐతే అందరూ ఒక్కసారిగా రాలా. మిత్రుడు పాపం ఒక్కొక్కరికీ ఓపికగా సంజాయిషీ చెప్పుకోవలసివచ్చింది - వాళ్ల ఫలానా అపార్టుమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘటనకు పాక్షిక బాధ్యత వహిస్తున్నట్లుగా.
విషయమేమిటంటే - తన మాజీ ప్రేయసి అపార్టుమెంట్లోకి చొరబడి ఆమెనూ మరియు ఆమె సరికొత్త ప్రియుడినీ తుపాకితో కాల్చిన ఒక వ్యక్తిని స్థానిక పోలీసులు కాల్చి చంపివేశారు లేదా అతనే కాల్చుకుచచ్చాడు.
పరామర్శకులు, విలేకరులు, తదితర ఔత్సాహికులంతా వెళ్లిపోయాక మిత్రుడు ఒంటరివాడైనాడు. ఒక్కడూ తన పనిలో పునర్నిమగ్నుడై వుండగా ... నేను లేచివెళ్లి పక్కన నిలబడ్డాను. తలపైకెత్తి నన్ను చూడగానే కొన్ని గంటల పాటు జరిగిన విలేకరుల సమావేశం మనసులో మెదిలి ఒక నవ్వు విసిరాను.
మిత్రుడు కూడా నా నవ్వును పసిగట్టి అన్నాడు హిందీలో - "చూశావా రాంభాయ్! జరిగినదానికి నేనే కారణమన్నట్టుగా అందరూ ఎలా ప్రశ్నలు గుప్పిస్తున్నారో? నేనే కాల్చినట్టుగా మాట్లాడుతున్నారు. నాకు గర్ల్ ఫ్రెండైనా లేదే! కనీసం మాజీదైనా! ఉన్నదల్లా నా ఒక్కగానొక్క కొత్త భార్య. హు!"
"ఉదయం ఎనిమిది గంటలనుండీ పాపం నువ్వావిడను చూడనూలేదు, అపార్టుమెంట్లోకి చొరబడింది అసలే లేదు. అన్నీ తెలిసే అడుగుతున్నారు జాలి లేని జనం!" అన్నాన్నేను - హిందీలో. నా హిందీ పాండిత్యానికి నవ్వాడో, ఆయన 'వా'పోతకు నేనిచ్చిన పొడిగింతకు నవ్వాడో గానీ మొత్తానికి పెద్దపెట్టున నవ్వాడు. ఆయనతోపాటు నేనూ ఒక మోస్తరుగా నవ్వాను.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.