చదువుల గీర్వాణి ... పలికినా అపశృతుల్ ...

రాత్రి 'జెమిని' వార్తలు చూస్తున్నాను - నా మిత్రుని ఇంట్లో. ఒకానొక సరస్వతీదేవి చదువుతోంది.

ఒక గ్రామంలో ఒక ముదుసలి పెద్దాయన ఎనిమిది భాషలను చదవడమూ రాయడమూ చేయగలడట. ఆయనపై "జెమిని టీవీ కదనం" అంది సరస్వతీదేవి. "కదనమా?!" అనుకుంటూ వున్నాం. అది ముసలాయనపైనా కదనమే అయింది. పెద్దాయన పాపం రెండు మాటలన్నా సరిగా చెప్పీచెప్పకనే ఆయన మాట కట్టు.

వార్తల్లో ఆ తరువాత - రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు. అసలే కరవు సీమ. అందులో ఉన్నట్టుండి భారీవర్షాలు, కాలువల్లో మనుషులు గల్లంతు. అలాంటి పరిస్థితిలో ఆ ప్రాంతంపై ఆ 'చదువులతల్లి' ప్రత్యేక కదనమట.

తరువాత ఇంకెవరిపైనో మళ్లీ కదనం. అది కూడా ఇరాక్‌పై బుష్ కదనం కన్నా అధ్వాన్నంగా ముగిసింది. "థూ యీనె@$#$^&* కమిట్‌మెంట్ లేని కథనాలూ, కమిట్‌మెంట్ లేని జర్నలిజం ..." అని మా మిత్రుడేదో గొణిగాడు.

ఆ వార్తలమ్మ విన్నారేమో, ఏకంగా బంగాళాఖాతంలో వాయుగుండంపైనే కదనం ప్రటించేశారు.

అవాక్కయ్యారా!?

కామెంట్‌లు

teresa చెప్పారు…
వార్తలమ్మ 'వదనం' చూసి ముచ్చట పడి 'కదనం'లో తప్పుల్ని సర్దుకోవాలిమరి :)
spandana చెప్పారు…
రోజూ ఈ "కదనం" వినీ వినీ అందులో తప్పేంటో మీ "కథనం" చదివాక్కానీ అర్థం కాలా!

ఇంతకు ముందు హైదరాబాదులో జరిగిన "బాంబు పేలుళ్ళు", "వంతెనలు కూలడాలూ" పత్రికల్లో మరియూ టీవీ వార్తల్లో "సంఘటనలు" గా వర్ణింపబడ్డప్పుడు నేనూ అవాక్కయ్యా!

--ప్రసాద్
http://blog.charasala.com
అజ్ఞాత చెప్పారు…
language that is spoken at the moment is Telugish, after some days tenglish
అజ్ఞాత చెప్పారు…
సరస్వతీదేవి reading is not correct, saraswati devi will never pronounce in that ugly way .... please dont compare saraswathi (goddess) with our telugu langars(anchors and newreaders)
రాఘవ చెప్పారు…
ఏంజేస్తాం చెప్పండి... భాష,భాషణం కన్నా యీ దూరదర్శనివాళ్లకి "దృగానందం" కలిగించడమే ముఖ్యమైపోయింది.
రానారె చెప్పారు…
ఎనానిమసుగారు, వార్తలు చదువుతున్నది కాబట్టి ఆవిడను చదువులతల్లి అని వ్యంగ్యంగా అన్నాను. చదువులతల్లి అని సరస్వతీదేవిని పిలుస్తాం మనం. మనకు వాక్శుద్ధినిచ్చే తల్లి. కానీ టీవీలోని చదువులతల్లి ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది! అని నా బాధ. కంపేరు లేదూ రిపేరూ లేదు. ఏమిటో ఈ కాలంలో ప్రతిదీ సెన్సిటివ్ ఇష్యూ అయికూర్చుంటోంది.
రానారె చెప్పారు…
కాబట్టి మిత్రులార, మనం చేయగలిగిందేమిటంటే తప్పుడు తెలుగు కనబడినచోట్ల పనిగట్టుకొని మరీ మాన్పించడమే. చొరవగా సున్నితంగా చెప్పి చిన్నచిన్న తప్పులను మాన్పించడమొక్కటే మార్గం. లేకపోతే, ఇలాంటి టపాలు చదవి వగచి మరచిపోవలసివస్తుంది తప్ప పరిస్థితిలో మార్పుండదు. అంతర్జాలంలో తెలుగు పుంజుకుంటున్న ఈ దశలోనే ఇలాంటి ప్రయత్నం e-తెలుగు.org ప్రాజెక్టుల్లో భాగంగా జరగాల్సిన అవసరం ఉంది. చెబితే విని తెలుసుకుందామనుకునే వాళ్లే నేటి యువతరంలో ఎక్కువ. కాబట్టి సందేహించనవసరం లేదన్నది నా అనుభవం. వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.
చదువరి చెప్పారు…
అన్నట్టు అదే జెమినీ వాళ్ళ మీకోసం కార్యక్రమం చూసినట్టు లేరు, మీరు - మా పొద్దున్నే వస్తదది (పసిఫిక్కు సాయంత్రం 7 గం.). అది చూసుంటే మీరిది రాసుండకపోయేవాళ్ళు. దానికో ప్రత్యేకత ఉంది.. మిగతా కార్యక్రమాల్లో కనబడేవి లంగర్ల పొరపాట్లు, తప్పులు. "మికొసం" కు ఓ ప్రత్యేకత ఉంది. తెలుగును ఇంగ్లీషులా చదవడం (పలకడం), దీర్ఘాలను హ్రస్వాలు చెయ్యడం, (సరే.. ఒత్తుల మార్పిడి ఎలాగూ ఉంటుందనుకోండి) లాంటివి దాని లంగరింగుకు తొలి ప్రాధాన్యత! ఆషామాషీ వాళ్ళ వల్ల కాదది. అందుకే ఒక్కరో ఇద్దరో లంగరు పిల్లలను ప్రత్యేకించారా పనికిమాలిన పనికి. మీరా కార్యక్రమం ఓ నాల్రోలు చూడాలని నా కోరిక! మధ్య మధ్యలో వచ్చే కామెడీ చిటుకులను తప్పక చూస్తూ ఉండాలి సుమా! లేకపోతే లంగరు దెబ్బకు మూర్ఛిల్లే ప్రమాదం కలదని వినియోగ హెచ్చరిక!!
rākeśvara చెప్పారు…
తప్పంతా ఆవిడది కాదు.
ఈ వత్తక్షరాలు ద్రవిడ భాషలకు స్వతహాగా వచ్చినవి కావు. అఱువు తెచ్చుకుని మాకు గదా ౫౬ అక్షరాలున్నాయనుకుంటాం. కథ అనడానికి నూటికి తొంబై తొమ్మిది మంది కద అనే అంటారు. వృత్తిరీత్యా వార్తా చదువరి కాబట్టి ఆమె ఆ తప్పు చెయ్యకూడదనుకోండి.

బాధ, బాధ్యత, పద్ధతి వగైరా లాంటివి వ్రాసేటప్పుడు దేనికి వత్తుంటుందో దేనికి వుండదో నాకింకా అయోమయమే.
చిన్నమయ్య చెప్పారు…
"శ్రుతి" కదా!
రానారె చెప్పారు…
చిన్నమయ్యగారూ, ఔను. ఏ వయసులో ఏయేవిషయాల్లో ఎంతెంత అజ్ఞానాంధకారంలో వున్నానో చూసుకోవడానికి, మీలాంటివారు చెబితే వినడానికీ ఈ టపాలన్నీ పనికొస్తున్నాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం