సీరియల్‌మా అమృ'తంగ'మయ
మన తెలుగు టీవీ ఛానెళ్లలో వస్తున్న ధారావాహికల్లో ఒకే ఒక్కదాన్ని మాత్రం 'సీరియల్' అని పిలిచి అవమానించకూడదు. దానిని 'అమృతం' అని గౌరవించాలి. ఇది ఒక హాస్యామృతం. కామెడీ బంగారం. దీనిలోని 'సర్వమూ' అమృ'తంగ'మయం.
తెలుగు సినిమాల్లో కాస్తోకూస్తో వైవిధ్యం గలవి నిర్మిస్తున్న ఒకే ఒక దివ్యసుందరమూర్తి - ఆహ్హా... ఆతడెవ్వరయ్యా అంటే - గుణ్ణం గంగరాజు. వారానికొక ఎపిసోడ్ - నాణ్యతలో లోపం రాకుండా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూరావడం తెలుగు టీవీ హాస్య ప్రధాన ధారావాహికల చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. సంభాషణల్లో విరుపులు, చురకలు, చమత్కారాలను ప్రతీ ఎపిసోడ్‌లోనూ తీసుకురావడమంటే 'మాటలు'కాదు. ఈ శ్రమ చేయడానికి గొప్ప అభిరుచి కావాలి.
అమృతంలోని హాస్యం ఆరోగ్యకరమైనది. సున్నితమైనది. అంతర్లీనంగా చిన్న నీతికథలా కూడా ఉంటుంది. మనలోనూ మన తోటి మనుషుల ప్రవర్తనలోనూ బయటపడే చిన్న బలహీనతలు ఈ ధారావాహికకు ముడిసరుకు. పాత్రలమధ్య పరస్పర సహానుభూతి ఉంటుంది. తీవ్రమైన విద్వేషాలుండవు. ఇందులో ఎవరూ శాశ్వతంగా విలన్లు కారు.
మన హాస్యనటుల్లో మంచి ఉచ్చారణ గలవారు అతికొద్దిమంది. వారిలో ఒకరైన విలక్షణ నటుడు హనుమంతరావు ఇందులో ముఖ్య పాత్రధారి. ఏమాత్రం ఎక్కువా కాకుండా తక్కువా కాకుండా 'అంజి/ఆంజనేయులు' పాత్రధారిగా ఈయన సన్నివేశాలను పండించే తీరు ఆంధ్రప్రేక్షకులకు తెలిసిందే. ఇతర పాత్రధారులందరూ ఈయనకు దీటుగానే నటిస్తున్నారు. కల్యాణి మాలిక్ సంగీతం కూడా చెప్పుకోదగినది.
"Everybody Loves Raymond" చూసినప్పుడల్లా... తెలుగులో కనీసం ఇలాంటి సీరియళ్లను కాపీ ఐనా కొట్టరే మనవాళ్లు అనిపించేది. కాపీ ఏం ఖర్మ, సొంతంగా కాస్త మెదడును ఉపయోగించి మనవాళ్లు నిర్మిస్తున్న ఒకే ఒక నాణ్యమైన ధారావాహిక 'అమృతం'.
జస్ట్‌యెలో పేరున పనిచేస్తున్నవారందరికీ ఆయురారోగ్యైశ్వర్యానందాలు చేకూరుతూనే ఉండుగాక! తెలుగు సినిమాలలోనూ టీవీ కార్యక్రమాలలోనూ సృజనాత్మకత పెంపొందుగాక.

కామెంట్‌లు
--ప్రసాద్
http://blog.charasala.com
పంచెకట్టు భక్తవత్సలం = రాజశేఖరరెడ్డి
అమ్మతల్లి = సోనియా గాంధీ
గొడ్డలి పార్టీ = టీఆరెస్స్
బాణం పార్టీ = భాజాపా
జనం పార్టీ = కాంగ్రెస్సు
ఇలాగన్నమాట............
వెంకటరమణగారుపయోగించిన విశేషణం 'భయంకరంగా' నవ్వించింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.