మహాపాపము - దైవకార్యము
యాభై అయిదు మాటల్లో కథ **** **** **** **** **** "తార్చడం మహాపాపం, మూర్ఖుడా!" " ........... " "దేవుడు తొలిసారి మనుషులను సృష్టించినప్పుడు పాపాత్ములున్నారా స్వామీ?" "లేరు" "ఒకానొక రోజు వాళ్లలో ఒకావిడకు ఎంతకూ తిండి దొరకలేదుట. పాపం, ఆకలికి తట్టుకోలేకపోయింది." "ఊఁ..." "వాళ్లలోనే అదృష్టవంతుడొకడు తిండి సంపాదించాడు. వాణ్ణడిగింది." "ఊఁ..." "వాడిచ్చాడు. ప్రతిఫలమడిగాడు. అయిష్టంగానే అంగీకరించింది." "ఊఁ..." "సృష్టించి, కడుపు మాడ్చి, చోద్యం చూసిన దేవుడే నాకు గురువు." "ఊ..." "మహాపాపమే... దైవకార్యమున్నూ." "ఊ...!?" "నా వాళ్లకు తిండి సంపాదించడానికి, నేను ఇతరులను ఉపయోగిస్తా." "ఊ..." "దేవుడెందుకు చేశాడో!" "...డో!?"