అమృతభరితము రామచరితము
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పదాలకు పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరాలద్దిన ఈ పాట... పాపం, నాకు నచ్చింది, నా నోటబడింది. ముందుగానే చెప్పి చేస్తున్నాను గనుక పూచీ నాది కాదు.
powered by ODEO
ఎన్ని సారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ
అన్నకొలదీ విన్నకొలదీ అమృత భరితము రామచరితము
ఎన్ని సారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ
కలముపట్టి కవివరేణ్యులు గళమువిప్పి గాయకులు నీ
మధురనామము కొలువగా మైమరచినిను ధ్యానించగా
వెలసెనెన్నో పాటలు నినుజేరుటకు విరిబాటలు
బ్రతుకు బరువై సుఖము కరువై అలసిసొలసిన వేళలా
యే దారిలేని ఎడారిలో ....
యే దారిలేని ఎడారిలో ఆధారమైనది నీదు నామము
కొవ్వలిగారు ఈ పాటను మరింత శ్రద్ధగా పాడారు. ఈ లలితగీతాన్ని పరిచయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు.ఆయన గాత్రం వినండి.

కామెంట్‌లు
ఈ పోస్టుని ఇన్నాళ్ళూ ఎలా చూడలేకపోయానో?
గురువును మించలేకనే పాట నడకను వేగవంతం చేసి, తాళం జతచేసి, లల్లాయిగా పాడేయటం జరిగింది. గురువుగారి పాటలో నిజంగానే బ్రతుకు బరువైనట్లు, సుఖం కరువైనట్లు, ఏ దారీలేనపుడు రామనామమే ఆధారమైనట్లుగా అనిపిస్తుంటే, శిష్యుడి పాటలో ఇవన్నీ తాళంకోసం జరిగినట్లుగా లేవూ! గువురుగారిలా పాడాలని ఐదో తేదీనుండి ప్రయత్నించి, చేతకాక ఈరోజే ఇలా పూర్తిచేశాడు శిష్యుడు. అందుకే ఈ పోస్టు ఇన్నాళ్లూ బయటకు రాలేదు. థాంక్యూ కామేశ్ గారూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.