విజయా వారి విజయపతాక
నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति". క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది. పూర్తి శ్లోకం ఇదీ: విజేతవ్యా లంకా చరణతరణీయా జల...
కామెంట్లు
రఘూ రాముడూ
రమణీయ వినీల ఘన శ్యాముడూ
వాడు-నెలఱేడు-సరిజోడు-మొనగాడు
వాని తనువు మగనీలమేలురా - వాని నగవు రతనాలజాలు రా
వాని జూచి మగవారలైన మరుల్గొనెడు మరో మరుడు మనోహరుడు “రఘూ రాముడూ…”
మగ నీలమేవిటీ?
ఆడ నీలం కూడా ఉంటుందా? :)
వాని కనులు మగ మీల మేలురా ..!
కాస్త తీరిగ్గా కూర్చుని జ్ఞాపకాల తుట్టెని కదిలిస్తే పాట (హరికథ) అంతా గుర్తు చేసుకోవచ్చు. ప్రయత్నిస్తా. అన్నట్టు మొన్న మల్లాది వారి మాది రాసిన నా టపాలో గిరిజా కళ్యాణం యక్షగానం వాగ్దానం సినిమాలో అని రాశానుట - మా అక్క సరి దిద్దింది - అది రహస్యం అనే సినిమాలోది. ఆ సినిమా విశ్వనాథ వారి ఒక నవల ఆధారంగా నిర్మించారని తప్ప వేరే విశేషాలేమీ తెలియవు. ఇంకో తమాషా తెలుసా - వాగ్దానం సినిమా దర్శకుడు ఆచార్య ఆత్రేయ - తన సినిమాలో ఆనాటి ప్రముఖ సినీ కవులందరితోనూ తలా ఒక పాట రాయించుకున్నారుట.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.