వీవెన్‌కు వీరతాళ్లు

తమ ఖ్యాతి విస్తరించాలనేది నైజంగా ఉన్న జనాలనే ఎక్కువగా చూస్తుంటాం. కీర్తి కండూతితో సాధారణ ప్రజానీకం తమపైనే ఆధారపడేలా చేయడానికి శాయశక్తులా కృషిచేసేవారినీ చూస్తుంటాం. లేఖిని లేఖకుడు(code writer), రూపకర్త(designer) మరియు నిర్వాహకుడు అయిన వీవెన్ ఇందుకు భిన్నం. లేఖిని లాంటి సాధనాలమీద మీద ఆధారపడటం తగ్గించుకొమ్మంటున్నారు. లేఖిని లాంటి సాధనం లేకుండా ఇంగ్లీషు రాసినట్లు నేరుగా కంప్యూటర్లో తెలుగు రాయడం ఉత్తమమని వీవెన్ ఎప్పుడో అంగీకరించారు. తాను స్వయంగా Inscriptకు మారి, మిగతా వారిని కూడా అటువైపే తిప్పే ప్రయత్నంలో భాగంగా "లేఖిని మూసేస్తే..." అనే ఆలోచనను కలిగించారు. తనకెంతో కీర్తిని తెచ్చిన, తెస్తున్న లేఖిని వాడకాన్ని తగ్గించుకొమ్మంటున్నారు. అరుదుగా కనిపించే ఇలాంటి నిస్వార్థపరత్వానికి మనం అభివాదాలు చేయాలి, అనుసరించాలి. కొత్త బ్లాగుస్పాటు(www2)కు మారకముందు నా బ్లాగులో లేఖినికి లంకె, ఆ లంకెమీదకు మూషికము రాగానే "వీవెన్ వర్థిల్లాలి!" అనే ఆశీస్సు కనిపించేది. నేను లేఖినితోనే తెలుగులో రాయడం మొదలెట్టినందువలన Inscript కు మారిన తరువాతకూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆ లింకునూ ఆశీస్సునూ అలాగే ఉంచాను. ఈ సందర్బంగా "వీవెన్ చిరకాలం వర్ధిల్లాలి!" అని ఆకాంక్షిస్తున్నాను. అయితే లేఖిని మూసివేతకు నేనూ వ్యతిరేకమే. తెలుగులో రాయడములోని మజా లేఖినితో సులభంగా ప్రారంభమౌతుంది. చట్టబద్ధమైన హెచ్చరిక ఏమిటంటే - లేఖినికి బానిసలు కాకండి. ఎవరిదీ చట్టం అంటారా, చేసింది నేనే(వీవెన్ కూడా). అమలు జరపడం ప్రజలచేతుల్లో (వేళ్లలో!?) ఉంటుందనేది తెలిసిన సంగతే.

కామెంట్‌లు

మన్యవ చెప్పారు…
ranare garu,

inscript lO type ceyyatam elago telipe online tutorials vunnaya?
రానారె చెప్పారు…
మన్యవగారు,
మీ ప్రశ్నతో ఈ టపాలో "నేరుగా కంప్యూటర్లో తెలుగు" అనే లింక్ ఇచ్చాను. దాన్ననుసరిస్తే ఒక కీబోర్డు కనిపిస్తుంది. దానిమీద ఉన్న Shift మీటను నొక్కి చూడండి. Inscript లో రాయడమంటే తెలుగు టైపురైటరులో టైపుచేయడమన్నమాటే. కాస్తంత ఓపిక కావాలి. కానీ ఇది చాలా ఉపయోగం. Linux లో కూడా Inscript సదుపాయం ఉందిట.
S చెప్పారు…
అవును, లినక్స్ లో కూడా ఉంది. నేనేమో ఆ కీబోర్డు ఎనేబుల్ చేసినా వాడను. మళ్ళీ దిసేబుల్ చేసేస్తూ ఉంటా. చాలా మటుకు నేను పద్మ extension నే వాడుతూ ఉంటా. ఆఫ్లైను టైపింగ్ ఎప్పుడో గానీ చేయను కనుక నో ప్రాబ్లెం. internet Explorer వాడాల్సి వస్తే లేఖిని వాడతా అప్పుడు.
rākeśvara చెప్పారు…
నేను ఎప్పుడు Inscript చేస్తా.
తెలుగు stickers కొనుక్కోగలిగితే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఏ వేలు క్రింద ఏముందో బట్టి వచ్చేసింది.

ఐనా నేను లేఖిని మూసివేయడానికి వ్యతిరేకమే. లేఖిని కొత్త బ్లాగర్లను ఆకర్షిచడంలో చాలా విజయవంతమైంది.
నేను కూడా వీవె'ను'డివినదాన్ని బట్టి ఇన్స్క్రిప్ట్ మొదలేట్టా. భయపడినంత కష్టం గా లేదు. చాలా సులభం. కానీ, ?, `;:"' లాంటివి పెట్టాలంటే ఇంగ్లీషుకు మారాల్సివస్తోంది. ఏదైనా సులభోపాయం ఉందా? ఈమధ్య 'ఆటవెలదుల'తో బాగా రమిస్తున్నట్లున్నారు? బాగున్నాయి.
రానారె చెప్పారు…
కొవ్వలిగారు, Alt+Shift ద్వారా ఇంగ్లీషు-తెలుగు కీబోర్డులకు అటు ఇటు సులభంగా మారిపోవచ్చు. ఆటవెలదులతో అంత చనువు లేదండి, చిన్నచిన్న ఆటలాడటం వరకే, అదీ కొత్తపాళీగారి దయ. ధన్యవాదాలు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం