రామాయణం అంతగా నచ్చేది కాదు నాకు. రామునికి చాదస్తమెక్కువ అనిపించేది. కారణం ఏమిటంటే, నాకు తెలిసినంతవరకూ రాముడెప్పుడూ పెద్దలేం చెప్పినా కిమ్మనలేదు. చేసుకుంటూపోయాడు. ఏ విషయంలోనూ ఎందుకు - అనే ప్రశ్నతో చర్చకు దిగినట్లు కనిపించదు. పెద్దలేంచెప్పినా అది సరైనదే అయివుంటుందనే నమ్మకం అయుండొచ్చుగాక. మరీ అంతగా నమ్మేయడమే ఇంప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. అలాగే లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీత వీళ్లంతా. ఏ విషయంలోనైనా నువ్విలా చేయమనడంలో అర్థమేమిటి అని అడిగిన సందర్భాలున్నట్లు నాకు తెలియకపోవడంతో రామాయణం నా దృష్టిలో బోరుకొట్టే స్టోరీ. అదే మహాభారతంలో బోలెడు డిస్కషన్లు. సవాలక్ష చర్చలు, వాదాలు, తర్కాలు, క్లాజులు, ట్విస్టులు. బహుత్ రసవత్తర్ స్టోరీ. ఇందులో కూడా రాముని లాంటి కారెక్టర్ ధర్మరాజున్నాడు. భారత కథలో ధర్మరాజు కూడా అంత ఆకర్షణీయమైన మనిషిగా నాకు కనిపించడు. ట్వెంటీ-20 లాంటి మహాభారతంలో పాతకాలపు టెస్టుప్లేయర్లాగా అనిపిస్తాడు ధర్మరాజు. స్లోమూవింగ్, రిలాక్స్డ్ అండ్ అనట్రాక్టివ్ యట్ కూల్ ఫెలో. రాముడూ దాదాపుగా ఇంతే కానీ రాముడు చాలా పవర్ఫుల్. రామాయణమే ఒక టెస్టుమ్యాచ్ కాబట్టి సరిగ్గా ఇమిడిపోయినట్లే. వీళ్లిద్దరిలో నాకు నచ...
కామెంట్లు
http://vaagvilaasamu.blogspot.com/2008/04/blog-post_17.html
మీద కూడా వొక కన్నెయ్యండి మరి.
మరో రాముడు :)
మీ పూరణ చూసి ధైర్యంగా సమస్యను సవరించాను. అభినందనలు. మీ పద్యానికి ప్రతిపదార్థాలు వెతుక్కునే పనిలో పడ్డాను ప్రస్తుతం. ఆకాశవాణికి ఒకసారి మీ దూరవాణిని వినిపించండి మరి! :-))
-
పదాబ్జముల్ అని వుండాలి గా..
కొలువరారా అని వుండాలి గా..
లేక పోతే నా సోపనరెఖా చిత్రం ఒప్పుకోదు :)
తద్దిత్తోం తక తోంత తోంత దిరనా,
తద్దిక్కు తద్దిక్కు తాఁ
రామా! రామ పదాబ్జముల్ కొలువరారా కీర్తి మిన్నందురా!
సమస్యలో "రామ" స్త్రీలింగమా?
ఈ సమస్య చూసైనా శ్రీరాం గారు తిరిగి బ్లాగు వైపు,పద్యాల వైపు వస్తారేమో చూద్దాం
విశ్వామిత్రా,
విని రాసుకోవడమెందుకండి, రికార్డు చేసి వినిపిస్తారు. ఈమధ్య గత కొన్నేళ్లుగా ఫోన్-ఇన్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. నత్తచిరునామా అంటారా, ఏముందీ, "సమస్యాపూరణం, కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప"
శ్రీరాం మళ్లీ పద్యాలు రాయాలని మనమంతా ధర్నా చెయ్యాలి. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.