పోస్ట్‌లు

పేరడీస్ లాస్ట్ - వర్డ్స్ వర్త్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పొద్దుపోని యవ్వారం - 11

ఇంతకూ ఏమంటారు కొత్తపాళీగారు? ఈ వారాంతం తీరిక లేదంట! ఏమంట? శతజయంత్యుత్సవాలంట. ఉత్సవా-లు? ఎన్నేమిటీ? మూడు. ముగ్గురికి. వాళ్లు పుట్టి నూరేండ్లు నిండబోతున్నాయంట. ఎవరయ్యా ఆ త్రిమూర్తులు? కొడవటిగంటి కుటుంబరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, త్రిపురనేని గోపీచందు. వీళ్లకా? హహ్హహ్హహ్హ..!! ఎందుకు నవ్వుతావు? నేను పుట్టిన దశాబ్దం మొదట్లోనే మొదటి ఇద్దరికీ నిండిపోయాయన్నారు నూరేండ్లూ. అంతకు రెండు దశాబ్దాలముందే గోపీచందుకు నిండిపోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ నూరేండ్లు నిండబోతున్నాయంటూ పండగలు చేస్తున్నారంటే యేమనుకోవాలి? ???? కొ.కు. 1980లో, శ్రీశ్రీ 1983లో, గోపీ 1962లో మహాప్రస్థానం చేశారు. స్వర్గంలో కొత్తకొత్త కథలూ కవితలూ వినిపించడానికి. అసలు స్వర్గమూ అదీ అంటే హేతువాదులూ వీర నాస్తికులు వీళ్లొప్పుకోరేమో కూడా. మరీ విపరీతం మనిషివి నువ్వు. కొ.కు. 1909లోనూ, శ్రీశ్రీ - గోపీచందు లు 1910లోనూ పుట్టారు తెలుసా? ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్పరచయితలూ మహాకవులూ వీళ్లు. ఐతే ఏమంటావు? మూడు మాటలు. 1. నీకు నుడికారం బాగా తలకెక్కిందని. 2. మహాకవులకు మరణం లేదనీ, వయసుతో నిమిత్తంలేదనీ. 3. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - వీళ్ల రాతలు చదవవోయ్ ...

పొద్దుపోని యవ్వారం - 10

" అలో " " ... " " నిన్నే " " ప్చ్.. " " ఏమయిందలా వున్నావ్ " " పోయింది " " ..?? ఏం పోయింది? " " ఏదైతే పోకూడదో అదే పోయింది " " అంత ముఖ్యమైన వస్తువు ఏందబ్బా! పోతే మళ్లీ కొనొచ్చుగదా? " " వస్తువు కాదు " " మరి? మనిషా? మనసా? " " కాదు! కాదు!! " " ఇంకేముంది నువ్వు పోగొట్టుకోవడానికి? " " పురుషలక్షణం. " " వోవ్..! వోవ్..!!! ఏం జరిగిందేమిటి?ఏదైనా తగిలిందా?ఎవరితోనైనా ఎక్కడైనా గొడవా? " " ఇంకెక్కడ! అఫీసులోనే. గొడవేం లేదు. మర్యాదగా పిలిచి, మెత్తగా మాట్లాడి, చెప్పి మరీ తీసేశారు. " " మ్...?!! వాళ్లు తీసేసింది నీ ఉద్యోగమేనా? " " ఔను. " " వార్నీ! చంపేశావు గదా ! ఓసోస్... " " ఉద్యోగం పురుష లక్షణం అన్నారు తెలుసా! అదే పోయింతరువాత... " " మగవానికి ఉండాల్సిన సవాలక్ష దరిద్రపు లక్షణాల్లో ఉద్యోగం ఒకటి. అంతే. అంతకు మించి ఊహించుకోకు. " " ... "

టింగురంగని సందేహాలు

ముల్లు : " ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు - ఎక్కడో గుచ్చావు చాపముల్లు " అన్ని వర్గాలనూ కదిలించిన పాట. "సుప్రీం హీరో మఱియు మెగాస్టార్ అయిన మిమ్మల్ని... నిన్నగాకమొన్న చిత్రసీమలో అడుగుపెట్టిన నగ్మా 'బే' అనడమేమిటి? ఇతర హీరోల అభిమానుల ముందు తలెత్తుకోలేకున్నాను." అని ఒక అభిమాని తన రక్తంతో లిఖించి చిరంజీవికి పంపించాడని 'ఇండియా టుడే'లో చదివాను ఆ కాలంలో. "ఏం పాటలో ఏం ఖర్మో, రాబోయే కాలంలో ఇంకా ఏమేం వినాల్సొస్తుందో!" -- మరో వర్గం "ఏం పాట!! నా సామిరంగా... ఏమి స్టెప్పులూ...!!!" -- ఇంకో వర్గం నాకు మాత్రం ఇవేవీ పెద్దగా పట్టలేదు. ఈ పాటలో 'స్‌సోడాకొట్టు అలా అలా విస్కీకొట్టు ఇలా ఇలా' అనేటప్పుడు బాలు గొంతు తాగిన చిరంజీవి గొంతుమాదిరే వుంటుందికదా అనుకుంటే, చిత్ర కూడా తాగినట్టు పాడటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించేది. అప్పుడు మనం ఏడో తరగతి - ఎనిమిదో తరగతి ఆ మధ్యలో ఉన్నాం. సినిమాలు అందనంత దూరంలో ఉండేవి. పాటలు మాత్రం ఊర్లో వినబడుతూ ఉండేవి. కొన్నాళ్లకు రేడియోలో కూడా వచ్చాయి. చాపముల్లేమిటి చాపముల్లు? చేపముల్లు అంటే అర్థం చేసుకోవచ్చు. చేపముల్లయితే ఎవరో గుచ...

పొద్దుపోని యవ్వారం - 9

దాశరథీ శతకం తెలుసా? శతకమొకటి వుందని తెలుసు ఎవర్రాశారో తెలుసా? కంచెర్ల గోపన్న పద్యాలేమైనా వచ్చునా? శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ అనే పద్యం వచ్చు ఇంకా? భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూ... ఆగక్కడ. గోపన్న కాళిందిలో కాలేశాడు !!!?? ఏమిటలా మిడిగుడ్లేసుకుని నన్ను చూస్తావు? ఆ పద్యాన్ని చూడు పద్యానికేఁ?! ఆ పద్యం ఎవరిగురించి? రామమూర్తిని గురించి కదా! రాముడు ముందా? భీముడు ముందా? త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కృష్ణునితోపాటే భీముడు ఎవరు ముందు? రాముడే. అయితే? అయితే గోపన్న ఏమన్నాడు? భండన భీముడు అన్నాడు. ఎవరిని? రాముణ్ణి! అంటే తప్పేముంది? తప్పా తప్పున్నరా?!! భీముణ్ణి రామునితో పోల్చితే... అందం, చందం, తల్లీ-బిడ్డా న్యాయం. నలుగురూ ఒప్పుకుంటారు. రామదాసు చేసిందేమిటి? ఎప్పుడో రామాయణంనాటి రాముణ్ణి మొన్నటి మహాభారతం భీమునితో పోల్చి, అవమానం చేసినాడుకదా! ఇదేమని అడిగినవాడు ఒక్కడూ లేకపోయినాడే!! నువ్వు బయల్దేరినావు కదా? అంటే, నీకిది తప్పుగా తోచలేదా? చూడు చిట్టితండ్రీ! భండనము అంటే యుద్ధమని తెలుసుకున్నావు, బాగుంది. భీముడంటే భారతంలో భీముడు కాదు నాయనా. భీ అనే సంస్కృతశబ్దానికి భయమనే అర్థముంది. భీమము ...

పొద్దుపోని యవ్వారం - 8

అధ్యక్షా! ... అనగానే నీకేం గుర్తుకొస్తుంది? శాసనసభలో రాజశేఖరరెడ్డి బొంగురుగొంతు. నాకూ ఆ వాచకమూ ఆకారమే మనసుకొస్తుంది నీకేనేమిటి, తెలుగువాళ్లకెవరికైనా అంతే! శాసనసభ్యులందరూ అధ్యక్షా అని ప్రశ్నలు వేస్తూవుంటారు కదా అధ్యక్షుడున్నదే తడికరాయబారానికి కదా! అంతేనా? సస్పెన్షన్లు, వాయిదాలు, వగయిరాలు కూడా చేస్తూవుంటాడనుకో. మరి, అధ్యక్షుడు ప్రశ్నలు వేయడా? వెయ్యడు. వేసినా లాభంలేదని తెలుసుగనక. ఎందుకనగా? ఎందుకేమిటి? అధ్యక్షుడు ప్రశ్నలువేస్తే అవేమౌతాయో తెలుసా? ఏమౌతాయి?! అధ్‌యక్షప్రశ్నలు. ...?! సమాధానం చెప్పే ధర్మరాజేడీ, అందునా ఆంధ్రదేశపు శాసనసభలో ???

పొద్దుపోని యవ్వారం - 7

"ఇందాకటి నుండి చూస్తున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు!?" "... హహ్హహ్హ హ్హహ్హ " "వినిపించేలా నవ్వమని కాదు నా ఉద్దేశం" "నాలోనేను నవ్వుకోక, నీలో నేను నవ్వుకోలేనుకదా! ... హహ్హహ్హ " "సంతోషించాంగానీ, విషయం చెప్పు" "ఇప్పుడే సుబ్బరాయునింటికెళ్లొస్తున్నానూ, ఆ మొగుడూపెళ్లాల వాదు ..." "ఎవరూ, ఆ పిసినారి ఇంటికేనా?" "సరిగ్గా ఆయన భార్యకూడా ఆయన్ను ఇదేమాట అన్నది" "ఏ మాట?" "చీర కొందామని ఏడాది తరవాత అడిగాను , ముష్టి మూడువేలు, దానికీ ఏడుస్తారు, మీరు మహాపిసినారి - అంది" "భలే! ఉన్నమాటే అంది. తరువాత?" "నేనివ్వను, అంతగా కావాలంటే నీ పరపతినుపయోగించి నువ్వే తెచ్చుకో -అన్నాడు" "ఆవిడేమంది?" "నువ్వు ప్రాణంతోవుండగా పరపతులతో నాకేం పనీ - అంది!" "....!!?" "... అలాగే ఒక మగవాణ్ణి పిసి'నారి' అని ఆక్షేపించడం కూడా తమాషాగా లేదూ?" "$#^@&"

రసికవతంసుడు - టైపాటు

రాజ భోజ రవితేజ దాన జిత కల్పభూజ జోహార్ నీదు ... సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ పై పంక్తులు ఎవ్వరివో ఎక్కడివో అందరికీ తెలుసు. ఈ పాటను కనకపోయినా కనీసం వినియైనా వుంటారు. ఇందులో "..." ఏమిటో ఎవరైనా చెబుతారేమోనని ఈ టపా రాస్తున్నాను. అసలింతకూ నాకీపాట ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న ఒక పుస్తకంలో రసికవతంసుడు అనే పదం చదివాను. ఎవరా రసికవతంసుడు అంటే, రాయలవారు. మనకు తెలిసిన కృష్ణదేవరాయల సంగతి కాదు, తంజావూరు నాయకరాజులలో ప్రసిద్ధుడైన రఘునాథరాయల సంగతి. ఈయన గురించి ఏం చెప్పారంటే "1600 మొదలు 1630 వరకు తంజావూరును పాలించిన పండితకవి రఘునాథనాయకుడు, కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక అంతకుమించినవాడని ఎంచదగిన ఆంధ్రభోజుడు. శత్రువులను నిర్మూలించుటలో అవక్ర పరాక్రమశాలి. జనరంజకముగా దేశాన్ని పరిపాలించుటలో నేర్పుగల రాజనీతి నిపుణుడు. సహృదయులు మెచ్చేటట్లు రసభావకవిత సంస్కృతం, తెలుగు రెండింటిలో చెప్పగల విద్వత్కవి. నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించగలిగిన సంగీతశాస్త్ర నిపుణుడు, మేధావి. యజ్ఞనారాయణ దీక్షితులు, మధురవాణి, రామభద్రాంబ మొదలగు కవిశిరోమణులను తీర్...

పొద్దుపోని యవ్వారం - 6

"హరికేన్ గురించి నీకేమైనా తెలుసా?" "అట్లాంటిక్, తూర్పుపసిఫిక్ మహాసముద్రాల్లో పుట్టిపెరిగే వినాశకరమైన సుడిగాలి-వా న " " అట్లాంటిక్ ఇట్లాంటిక్ లాంటి జవాబు ఎవరినడిగినా చెబుతారు " "మరి ఎట్లాంటిక్ జవాబులు కావాలి నీకు?" "దాన్ని హరికేన్ అని ఎందుకంటారో తెలుసా?" "ఏదో ఒకటి అనాలి కదా" "ఎందుకురా పెళ్లి చేస్కున్నావంటే - రాసిపెట్టుంది, చేస్కున్నానన్నాడంట వెనకటికెవడో. " "నీకు తెలిస్తే నువ్వే చెప్పరాదా!" "ఆంగ్లమున. అట్లాంటిక, పసిఫిక తీరములందు పాపం పెరిగినపుడు శ్రీమహావిష్ణువు ఝళిపించే బెత్తమే హరికేన్. ఆంగ్లభాషనందూ ఎస్పన్యోలు నందూ హరి హరియే. బెత్తమనగా కేన్. ఆంగ్లమున." "మోకాటికీ బట్టతలకూ ముడిబెట్టినట్టుంది " "దైవలీల అలాగే వుంటుంది. తెలుగులో బెత్తం అని పలకడం చేతగాక bastón అని పలుకుతాడు ఎస్పన్యోలు శాన్యోరు. caña అని కూడా అంటాడు. " "మోకాటికీ బట్టతలకూ కాదు, కాటికీ నీబొందకూ ముడిబెడితే బాగుండును దైవలీల " "...!!?" ****************************** మానవుడు నిస్సహాయుడై చూస్తుండిపోయేలా ఒక ...

పొద్దుపోని యవ్వారం - 5

"తిన్నడంటే తెలుసునా?" "తెలుగు భాషలోనేనా?" "ఆహాఁ! తెలుగులోనే" "తెలంగాణంలోనా కోస్తాంధ్రంలోనా సీమయాసలోనా?" "తెలంగాణంలో" "తిన్నడంటే పేఠ్ భర్ బిర్యానీ దట్టించిండన్నట్టు" "మరి, కోస్తాంధ్రంలో?" "తిన్నడంటే చక్కనివాడు, వంకరల్లేనివాడు" "రాయలసీమలో?" " సీమలో తిన్నడంటే భక్తకన్నప్ప" "తిన్నడంటే అన్నిచోట్లా ఒకే అర్థం రాదా?" "ప్రస్తుత పరిస్థితుల్లో రాదు" "పోనీ భక్తకన్నప్ప అంటే రాష్ట్రమంతటా ఒకటే అర్థం వస్తుందా?" "రాష్ట్రమంతటా ఒకటే అర్థం రావాలంటే భక్తకన్నప్ప అంటే సరిపోదు" "మరేమనాలి?" "అవిభక్త కన్నప్ప" " ... " "అవిభక్త కన్నప్ప అంటే కన్నడభాషలో కూడా అర్థం మారదు" "అవిభక్త కన్నప్పకు విభక్తులతో ఏమైనా పేచీ వున్నదా?" "పేచీ లేని భక్తుడు గనుకనే అవిభక్తుడయినాడు" "మరి మనమో!?" " ... "

పొద్దుపోని యవ్వారం - 4

"ఇది విన్నారా, మహారాజు ఈరోజు కవిగారిని సన్మానించారట" "ఊఁ" "కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నారట" "ఊఁ" "గండపెండేరం తొడిగారట" "ఊఁ" "మదగజం పైన ఎక్కించి రాచవీధుల్లో ఊరేగించారట" "కవులను ఎక్కించవలసిందే, ఏగించవలసిందే" "ఏఁ?" "వారంతట వారుగా ఏనుగుపైకి ఎక్కలేరు, ఊరేగలేరు. మావటీ కావలసిందే" "అదే, ఎందుకని?" "నిరంకుశాః కవయః అంటే ఏమిటనుకున్నావు?" "రంకు లేని వాడే కవి" "నీ మొహం. కవులకు రంకు అలంకారం" "మరేమిటి దానర్థం?" "నిరంకుశాః కవయః అంటే అంకుశం లేనివాడే అసలైన కవి" "అంకుశం ఉన్నవాడు?" "మావటిః"

స్థానబలిమి జ్యోకులు

ఈ మహానగరానికి మేమొక చివరా సినిమా హాళ్లు మరో చివరా వుండటం వల్ల ఇక్కడ తెలుగు సినిమా చూడటం మాకొక ప్రయాస. ఒక్కళ్లమే అంతదూరం పోవడమనేది పరమ బోరింగు అనుభవం (థాంక్స్ టు జంధ్యాల) ఔతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ గుంపుగా పోతుంటాం. గుంపు మొత్తం కదలడానికి వీలుపడని లేదా ఇష్టపడని సినిమాలకైతే ఒక్కళ్లమే వాక్‌మన్లో (ఐపాడో ఏదో ఒక పాడు) పాటలు వింటూ వెళ్లొచ్చు. ఎంత సేపటికీ థియేటర్ రాలేదే అనిపిస్తుంది. సినిమా మీద మోజు మాత్రం తగ్గదు. తమాషైన ఈ సందర్భంకోసం నా మటుకు నేను ఒక ప్లేలిస్టు తయారుచేసి పెట్టుకున్నాను. అందులో నుంచి కొన్ని పాటలు: *. ఏడు కొండల సామీ ఎక్కడున్నావయ్యా(ప్రార్థన ప్రారంభగీతం) *. నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండే దీ నేలపై *. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా *. హరహర మహాదేవా శంకర! హిమాలయాలకు రాలేనయ్యా *. ఉన్నావా ... అసలున్నావా ... (భక్తిరంజని సమాప్తం) *. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలదీ పెరుగును అనురాగం, విరహంలోనే వున్నది అనుబంధం ... (రక్తిరంజని మొదలు) *. ఆకాశమా నీవెక్కడ! అవనిపైనున్న నేనెక్కడ!! *. ఎన్నాళ్లో వేచిన ఉదయం ... (ధియేటర్ సమీపానికి చేరుకున్నాక) *...

పొద్దుపోని యవ్వారం -3

" రామానాయుడికి తల్లిగారు లేరట కదా " "ఆయనే ముసలివాడయ్యాడు. తల్లిగారు పోయుంటారు !" " అసలుంటే కదా పోవడానికి. అందుకే ఆయనను నిర్మాత రామానాయుడంటారు " "అదెలాగా?" " నిర్ +మాత=నిర్మాత. మాత లేనివాడు గనుక నిర్మాత అయ్యాడు" " మరి... అరవింద్? " " బ్రహ్మదేవునికి నారదుడిలా రామలింగయ్యగారికి మానసపుత్రుడన్నమాట "

పెరగంగా పెరగంగా పెద్దబాబు ...ట.

మన శోధన సుధాకరులు , భూపతిమహాప్రభువులు ఇచ్చిన స్ఫూర్తితో ... హన్నన్నా! నేనేనా తక్కువతిన్నది! ఎన్నదగిన కవిని ఎవరు కాదన్నది!!? ఎన్నెన్నో భావాల కవిత - భావకవిత!? కన్నీరొలికించే కవిత కళ్లకలకంటి కవిత!!? అర్థంకాదన్నవాళ్లకు అందకుండా! పర్థంలేదన్నవాళ్లకు చెందకుండా!! ముక్కల ముక్కల కవిత! ముక్కులదిరేలా!! తిక్కల తిక్కల కవిత! తిక్క కుదిరేలా!! తప్పించుకోలేరు! నా ముప్పేట దాడిని!! గుప్పుగుప్పున వదులుతా!! తప్పులెన్నున్నా! గుక్కతిప్పుకోనివ్వని కవిత! ముక్కును పచ్చడిచేసే కవిత!! ఇది వారికే అంకితం. అంటే ఇది కలిగించే దుష్ప్రభావాలన్నీ వారికే అంటగడతున్నానన్నమాట. దీని స్ఫూర్తితో ఇంకెవరు కవితలు రాసినా అవి కూడా ఈ మూలవిరాట్టులకే ఇందుమూలముగా చెందులాగున పెద్దలు నిశ్చయించినారు. వందే పార్వతీ పరమేశ్వరౌ!!

బ్లాగి'నోళ్లు' అందరూ మంచోళ్లు

చిత్రం: బ్లాగుమనసులు రచన: ఆత్రమయ్య బ్లాగుతా కొల్లగా 'ఫుల్లు'గా బడిబాబులా సదువుకో బుద్ధిగా మరింత శ్రద్ధగా... "బ్లాగుతా" మొదలుపెడితే మనసు కాస్త కుదుట పడతది కుదుటపడ్డ మనసుకేమొ నిదుర పడతది నిదురకన్న మనిషికేమి సౌఖ్యమున్నదీ ఆ సుఖము దోచుకొనుటకె మన బాసులున్నదీ... "బ్లాగుతా"