పోస్ట్‌లు

అప(ర)స్వరం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆవొ సునావూఁ

ఇక్కడి నా సహోద్యోగుల్లో చాలా మందికి సంగీతంపై ఆసక్తి వుంది. మాలో కొందరు ఒక మోస్తరుగా పాడగలరు. కొందరేమో ఏదైనా ఒక వాయిద్యాన్ని బాగా సాధన చెయ్యాలనుకొంటూ వుంటారు. (!) మాకొక హైహై నాయకుడున్నాడు. ఈ నాయకుడు ఎంతో శ్రమకోర్చి, మాకు మంచి తిండి కూడా పెట్టి, మేమనే మాటలు పడుతూ, అప్పుడప్పుడూ మాపై తిరగబడుతూ మొత్తానికి మాలో ఒక ఆరేడుమందిని ఒక తాటిపై నిలబెట్టగలిగినాడు. ఇప్పుడు మేమంతా ప్రతి సోమవారం సాయంత్రం రెండు గంటలపాట మా ఇంట్లో సమావేశమై, గొంతులు చించుకొంటూ, గిటార్ల తీగలు తెంచుతూ, కీబోర్డులు, డ్రమ్ములూ పగలగొడుతూ నానా రభస చేసి ఆనందంగా విడిపోతాం. ఇలా చేబుతున్నానుగానీ, మా జట్టులో క్రమశిక్షణ కొంచెం ఫరవాలేదు. గ్రహాలన్నీ అనుకూలించిన ఒకానొక శుభముహూర్తాన గోవిందా నటించిన ఒక హిందీ సినిమా పాటను మేము తిరగ్గొట్టి కలిపాం. అనగా రీమిక్సు చేశామన్నమాట. మాదగ్గర సరయిన రికార్డింగు పరిజ్ఞానమూ పరికరాలూ లేకపోబట్టిగానీ ... ఈ ఘటనలో ఒక ప్రధానగాయకుడు, ఇద్దరు సహాయగాయకులు, ఒక సహాయగాయని, ఒక గిటారివాడు, ఒక డ్రమ్మరి పనివాడూ, ఇద్దరు కీబోర్డు ప్రెసిడెంట్లు పాపం/పాలు పంచుకున్నారు. నేను కీబోర్డు (రెండవది) వాయిస్తూ, అక్కడక్కడా కాస్త గొంతు చేస...

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

ఈ పాట గురించి గత అక్టోబరులో చిన్న చర్చ జరిగింది. అప్పట్లో ఆ వీడియో చూసి సంతోషపడి నాకొక వేగు (e-mail) పంపారు పరుచూరి శ్రీనివాస్ గారు. ఆ తరువాతి సంభాషణల సందర్భంగా కొన్నాళ్లకు ఈ పాట సాహిత్యాన్నీ, అటుపైన కొన్నాళ్లకు వోలేటి గారు స్వయంగా పాడిన రికార్డును పంపించారు. ఆ పాటను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో వుండేలా చెయ్యడానికి నాకీరోజు తీరింది. శ్రీనివాస్ గారికి అనేక కృతజ్ఞతలతో, మీకు సమర్పిస్తున్నాం __ :) గడచేనటే సఖీ ఈ రాతిరీ కడు భారమైన ఎడబాటునా ఈ మేఘవేళ ఏమో కదే చెలియ స్వామి దవ్వైనా నిదుర రాదాయెనే ఈ కడిమి వోలె ఎదురు చూచేనే సఖియా ఏకాకి నా బ్రతుకు చేదాయెనే రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం,సంగీతం: వోలేటి వెంకటేశ్వర్లు

కరిగించిన సీసం - మీ చెవుల్లో

ఇది జంధ్యాలగారి సీసం. సినిమా జంధ్యాల కాదు. మనకు తెలిసిన ఇంకో జంధ్యాల . 'పద్యం పైకెళ్లిందిగానీ సరిగా కిందకు దిగినట్టులేదే' అనిపిస్తోందా? టేకాఫ్ కానీ, లాండిగ్ కానీ ఆ మధ్యలో ఇంకేవిన్యాసాలైనాగానీ అత్యుత్తమంగా చేయగల మహా పైలెట్‌ తో -- ఒక్కసారి విమానం నడిపిచూడాలనుకునే మానవుని పోల్చినప్పుడు అలానే అనిపిస్తుంది మరి! :-) ఒడెయో తో శక్తిమంతం

అమృతభరితము రామచరితము

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పదాలకు పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరాలద్దిన ఈ పాట... పాపం, నాకు నచ్చింది, నా నోటబడింది . ముందుగానే చెప్పి చేస్తున్నాను గనుక పూచీ నాది కాదు . powered by ODEO ఎన్ని సారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ అన్నకొలదీ విన్నకొలదీ అమృత భరితము రామచరితము ఎన్ని సారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ కలముపట్టి కవివరేణ్యులు గళమువిప్పి గాయకులు నీ మధురనామము కొలువగా మైమరచినిను ధ్యానించగా వెలసెనెన్నో పాటలు నినుజేరుటకు విరిబాటలు బ్రతుకు బరువై సుఖము కరువై అలసిసొలసిన వేళలా యే దారిలేని ఎడారిలో .... యే దారిలేని ఎడారిలో ఆధారమైనది నీదు నామము కొవ్వలిగారు ఈ పాటను మరింత శ్రద్ధగా పాడారు. ఈ లలితగీతాన్ని పరిచయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. ఆయన గాత్రం వినండి.