పోస్ట్‌లు

సంగీతం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

షావుకారులో బహుదూరపు బాటసారి పయనం

నేనింతవరకూ షావుకారు సినిమా చూడలేదు. ఇప్పుడే యూట్యూబులో ఆ సినిమా క్లిప్పింగులు చూస్తూ... జైలు సన్నివేశానికి (రామారావు, నారాయణపాత్రధారి జైల్లో కలిసే సన్నివేశానికి) నేపథ్యంగా 'బహుదూరపు బాటసారీ' హార్మోనియం మీద [@ 4:30 ] విని ఆశ్చర్యానందాలు పొందాను. ఘంటసాల ఈ పాట సాహిత్యమూ, స్వరాలూ రెండూ కూర్చి పాడిన ప్రైవేటు రికార్డింగ్ మాత్రమే విన్నానిన్నాళ్లూ. బహుశా స్వరాలు కూర్చడం అయిన తరువాతే సాహిత్యం కూర్చివుంటాడనుకుంటా.

ఇటీవల నేను చూచిన చిత్రములు

అరుంధతి - గత ఆదివారం చూసిన సినిమా. ఈమధ్య వచ్చిన రొడ్డకొట్టుడు సినిమాలకు ఇది భిన్నమైనది. ఈ సినిమాలో నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. పతలా దబరాను పెద్ద నొక్కుపడేలా బలమైన గరిటెతో వాయిస్తే వచ్చే శబ్దాన్ని ఒకసన్నివేశంలో వినిపిస్తారు కోటి. 'ఇప్పుడు మీరు భయపడాలన్నమాట' అని సబ్ టైటిల్ వేసివుంటే ప్రయోజనం వుండేదేమో. స్టీలు పాత్రల సంగతి వదిలేసి, సినిమాపాత్రల విషయానికొస్తే రొ'టీన్' పాత్రల్లో ఎప్పుడూ కనిపించే అనుష్కకు ఇదో వెరయిటీ. ఇందులో విలను వీరోయినును ఎలా అనుభవించి చంపాలనుకుంటాడో మాటిమాటికీ ఆమెతో చెప్పీ చెప్పీ చెప్పీ చివరికి అనుభవించకుండానే చచ్చిపోతాడు. ఒక అందమైన గుడ్డి నాట్యాచారిణిని పొడుగాటి కత్తితో రెండుపోట్లు పొడిచి, రక్తంలో ఆమె విలవిలలాడుతుండగా విలను ఏకాగ్రచిత్తంతో తనపనేదో తాను చేసుకుంటూ -సుఖపడుతూ పోతున్నావు, పోతూ సుఖపెడుతున్నావు, నీవెంత ధన్యవోకదా- అనే కవితాత్మకమైన డైలాగు చెప్పే దృశ్యం ఈ సినిమాలో హైలైట్. మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రం. గ్రాఫిక్సూ అవీ బాగున్నాయి. సినిమా చివరివరకూ మెదలకుండా చూశాను. ఖర్మ. స్లమ్ డాగ్ మిలియనీర్ - నేనీ సినిమాకు ...

ఆవొ సునావూఁ

ఇక్కడి నా సహోద్యోగుల్లో చాలా మందికి సంగీతంపై ఆసక్తి వుంది. మాలో కొందరు ఒక మోస్తరుగా పాడగలరు. కొందరేమో ఏదైనా ఒక వాయిద్యాన్ని బాగా సాధన చెయ్యాలనుకొంటూ వుంటారు. (!) మాకొక హైహై నాయకుడున్నాడు. ఈ నాయకుడు ఎంతో శ్రమకోర్చి, మాకు మంచి తిండి కూడా పెట్టి, మేమనే మాటలు పడుతూ, అప్పుడప్పుడూ మాపై తిరగబడుతూ మొత్తానికి మాలో ఒక ఆరేడుమందిని ఒక తాటిపై నిలబెట్టగలిగినాడు. ఇప్పుడు మేమంతా ప్రతి సోమవారం సాయంత్రం రెండు గంటలపాట మా ఇంట్లో సమావేశమై, గొంతులు చించుకొంటూ, గిటార్ల తీగలు తెంచుతూ, కీబోర్డులు, డ్రమ్ములూ పగలగొడుతూ నానా రభస చేసి ఆనందంగా విడిపోతాం. ఇలా చేబుతున్నానుగానీ, మా జట్టులో క్రమశిక్షణ కొంచెం ఫరవాలేదు. గ్రహాలన్నీ అనుకూలించిన ఒకానొక శుభముహూర్తాన గోవిందా నటించిన ఒక హిందీ సినిమా పాటను మేము తిరగ్గొట్టి కలిపాం. అనగా రీమిక్సు చేశామన్నమాట. మాదగ్గర సరయిన రికార్డింగు పరిజ్ఞానమూ పరికరాలూ లేకపోబట్టిగానీ ... ఈ ఘటనలో ఒక ప్రధానగాయకుడు, ఇద్దరు సహాయగాయకులు, ఒక సహాయగాయని, ఒక గిటారివాడు, ఒక డ్రమ్మరి పనివాడూ, ఇద్దరు కీబోర్డు ప్రెసిడెంట్లు పాపం/పాలు పంచుకున్నారు. నేను కీబోర్డు (రెండవది) వాయిస్తూ, అక్కడక్కడా కాస్త గొంతు చేస...

బాలు - H

బాలు - ABCDEFG గురించి విన్నాం. కానీ నేను చెప్పబోయేది బాలు - H గురించి. చాలా యేళ్లకు ముందు ఒకసారి మా మామిడితోటలో కాయలు కోయిస్తున్నాం. కోసేవాళ్లు ఎవరంటే మా తోటకు తూర్పున వున్న ఈడిగపల్లె యువజనులు. పరాచికాలకు పెట్టింది పేరు ఆ పల్లె. ఆ పల్లెలో ప్రతి మనిషికీ కనీసం ఒకటైనా అడ్డపేరుంటుంది. ప్రతి పేరు వెనుకా ఒక కథ. కొన్ని పేర్లలో ఎంత సృజనాత్మకత వుంటుందంటే గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకోవాల్సిందే. సరే, విషయానికొస్తే - ఆ రోజు ఒకాయన చెట్టెక్కి గట్టిగా పాట పాడుతున్నాడు. చెట్టు పైనుంచి కోసి కింద వేసే కాయలకు దెబ్బతగలకుండా సంచిపట్టతో పట్టుకుంటూ కింద నిలబడి వున్న మనిషి, వీధి నాటకం శైలిలో అన్నాడు, "అహో ధర్మనందనా! ఎవరిదా కోగిల గానము? భరించనలవి గాకండా వుండాదీ!" దానికి సమాధానంగా ఆ చెట్టుమిందనున్న మనిషి - "నీ @క్an #$@&a, మామిడి కాయలతో కొట్టి సంపుతా. కోగిలేంది వాయ్? ఘంటసాల అను, ల్యాపోతే యస్పీబాలసుబ్బరమణ్ణెం అను" అంటూ ఒక మంచి కాయను నేలకేసి కొట్టేసినాడు. అది అన్యాయంగా పిచ్చలైపోయింది. "ఒరే బాలసుబ్బరమణ్ణెమా, యా పొద్దన్నా అద్దంలో నీ మొగం జూసుకున్న్యా(వా)?" "నా మొగానికేమిలే గ...

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

ఈ పాట గురించి గత అక్టోబరులో చిన్న చర్చ జరిగింది. అప్పట్లో ఆ వీడియో చూసి సంతోషపడి నాకొక వేగు (e-mail) పంపారు పరుచూరి శ్రీనివాస్ గారు. ఆ తరువాతి సంభాషణల సందర్భంగా కొన్నాళ్లకు ఈ పాట సాహిత్యాన్నీ, అటుపైన కొన్నాళ్లకు వోలేటి గారు స్వయంగా పాడిన రికార్డును పంపించారు. ఆ పాటను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో వుండేలా చెయ్యడానికి నాకీరోజు తీరింది. శ్రీనివాస్ గారికి అనేక కృతజ్ఞతలతో, మీకు సమర్పిస్తున్నాం __ :) గడచేనటే సఖీ ఈ రాతిరీ కడు భారమైన ఎడబాటునా ఈ మేఘవేళ ఏమో కదే చెలియ స్వామి దవ్వైనా నిదుర రాదాయెనే ఈ కడిమి వోలె ఎదురు చూచేనే సఖియా ఏకాకి నా బ్రతుకు చేదాయెనే రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం,సంగీతం: వోలేటి వెంకటేశ్వర్లు

ఆడదాని ఫార్ములా!

-- డాక్టర్రాజు : -) వేమనయోగి కూడా చెప్పలేని వేదాంత సారం!

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

వెంకట్ సిద్ధారెడ్డి బ్లాగులో జరిగిన చిన్నపాటి చర్చకు నా అభిప్రాయాన్ని వీలైనంత బలంగా చెప్పే ప్రయత్నం ఈ టపా. అంతే కాకుండా, ఈ వీడియో చివరలో మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓలేటివారి స్వరకల్పన... దివ్యం! అనగా దివినుంచి జాలువారినది అని తాత్పర్యం. నేనొక ఇరవైమార్లు విని, అందరూ మళ్లీమళ్లీ విని ఆనందించాలనే సదుద్దేశంతో యూట్యూబుకు చేర్చాను. [ఇది ముమ్మాటికీ కాపీహక్కుల ఉల్లంఘనే. మాటీవీ వాళ్లు నామీదకు యుద్ధానికి రారని ఆశిస్తున్నాను. :)]

అదీ ఆనందమంటే!

ఇట్లా పాడుకుంటూ దానికి నేనే వాద్యసహకారం కూర్చుతూ ఆనందించే రోజు ఎప్పుడో మరి! ఏదో ఒక్క వాయిద్యమైనా కనీసం ఈ మాత్రం నేర్చుకోకుండా చచ్చిపోకూడదు. తాళ్ సినిమా వచ్చిందనికూడా తెలీదు నాకప్పుడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నా మిత్రుని ఇంటికెళ్తే "ఒక మంచి పాటుంది, విను" అని అతడే అమర్చిన పెద్ద స్పీకర్లలో వినిపించిన పాట ఇది. విశేషమేమిటంటే విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న నాకు ఈ పాట పూర్తయే సరికి ప్రశాంతత కలిగింది. ఆ తరువాత ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. ఇలాంటి ఎన్నో పాటలు ఈనాటికీ అందిస్తున్న ఆ సంగీత ప్రభంజనానికి (ఇసై పుయల్‌) ఎన్నెన్నోమార్లు కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. గత నెలలో ఆతని దర్శనభాగ్యం కలిగింది. మూడుగంటలపాటు ఎనిమిది వేల మంది ప్రేక్షకశ్రోతలను ఉర్రూతలూపిన ఆ కార్యక్రమం ఒక మరపురాని అనుభూతి. పాటలు విని ఎంతగా ఆనందిస్తాడో ఛాయాగ్రహణాన్నీ అంతగానే అభిమానించే నా మిత్రుడు తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ .