పోస్ట్‌లు

నుడికారము లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పొద్దుపోని యవ్వారం - 11

ఇంతకూ ఏమంటారు కొత్తపాళీగారు? ఈ వారాంతం తీరిక లేదంట! ఏమంట? శతజయంత్యుత్సవాలంట. ఉత్సవా-లు? ఎన్నేమిటీ? మూడు. ముగ్గురికి. వాళ్లు పుట్టి నూరేండ్లు నిండబోతున్నాయంట. ఎవరయ్యా ఆ త్రిమూర్తులు? కొడవటిగంటి కుటుంబరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, త్రిపురనేని గోపీచందు. వీళ్లకా? హహ్హహ్హహ్హ..!! ఎందుకు నవ్వుతావు? నేను పుట్టిన దశాబ్దం మొదట్లోనే మొదటి ఇద్దరికీ నిండిపోయాయన్నారు నూరేండ్లూ. అంతకు రెండు దశాబ్దాలముందే గోపీచందుకు నిండిపోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ నూరేండ్లు నిండబోతున్నాయంటూ పండగలు చేస్తున్నారంటే యేమనుకోవాలి? ???? కొ.కు. 1980లో, శ్రీశ్రీ 1983లో, గోపీ 1962లో మహాప్రస్థానం చేశారు. స్వర్గంలో కొత్తకొత్త కథలూ కవితలూ వినిపించడానికి. అసలు స్వర్గమూ అదీ అంటే హేతువాదులూ వీర నాస్తికులు వీళ్లొప్పుకోరేమో కూడా. మరీ విపరీతం మనిషివి నువ్వు. కొ.కు. 1909లోనూ, శ్రీశ్రీ - గోపీచందు లు 1910లోనూ పుట్టారు తెలుసా? ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్పరచయితలూ మహాకవులూ వీళ్లు. ఐతే ఏమంటావు? మూడు మాటలు. 1. నీకు నుడికారం బాగా తలకెక్కిందని. 2. మహాకవులకు మరణం లేదనీ, వయసుతో నిమిత్తంలేదనీ. 3. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - వీళ్ల రాతలు చదవవోయ్ ...

పొద్దుపోని యవ్వారం - 10

" అలో " " ... " " నిన్నే " " ప్చ్.. " " ఏమయిందలా వున్నావ్ " " పోయింది " " ..?? ఏం పోయింది? " " ఏదైతే పోకూడదో అదే పోయింది " " అంత ముఖ్యమైన వస్తువు ఏందబ్బా! పోతే మళ్లీ కొనొచ్చుగదా? " " వస్తువు కాదు " " మరి? మనిషా? మనసా? " " కాదు! కాదు!! " " ఇంకేముంది నువ్వు పోగొట్టుకోవడానికి? " " పురుషలక్షణం. " " వోవ్..! వోవ్..!!! ఏం జరిగిందేమిటి?ఏదైనా తగిలిందా?ఎవరితోనైనా ఎక్కడైనా గొడవా? " " ఇంకెక్కడ! అఫీసులోనే. గొడవేం లేదు. మర్యాదగా పిలిచి, మెత్తగా మాట్లాడి, చెప్పి మరీ తీసేశారు. " " మ్...?!! వాళ్లు తీసేసింది నీ ఉద్యోగమేనా? " " ఔను. " " వార్నీ! చంపేశావు గదా ! ఓసోస్... " " ఉద్యోగం పురుష లక్షణం అన్నారు తెలుసా! అదే పోయింతరువాత... " " మగవానికి ఉండాల్సిన సవాలక్ష దరిద్రపు లక్షణాల్లో ఉద్యోగం ఒకటి. అంతే. అంతకు మించి ఊహించుకోకు. " " ... "

ఇటీవలి కాలంలో నాకు నచ్చిన కథ

అరగంట ముందు ఒక కథ చదివాను ఆంధ్రజ్యోతి[ఆదివారం అనుబంధం]లో. మీరు ముందు కథను చదివిరండి . కిందున్న రెండుముక్కలూ చదవాలనిపిస్తే ఆ తరువాతెప్పుడైనా చదవొచ్చు. ఒక్కసారి చదివిన వెంటనే నాకే మనిపించిందంటే: అందమైన మాండలికంలో సరళంగా సాగిన కథ. చిరకాలం గుర్తుండే కథ. స్వయంగా బతకగల నేర్పు, స్వేచ్చగా బతకాలనే ధీమా కలిగివుండటమే మనిషికి మొట్టమొదటి సంప్రదాయం కావాలి. అప్పుడే సాంగ్యాలూ, పండగలూ, పర్దాలూ మనిషికి సంతోషాన్నిస్తాయి. ఆ నేర్పూ ఆ ధీమా లేకపోతే సంప్రదాయాలే సంకెళ్లవుతాయి. ఈ కథలోని జేజికి ఆ ధీమా వుంది. ఆమె సొంతంగా బతగ్గలిగింది. అంత ధీమా ఆమె కొడుకుకు లేకపోయింది. ఇక మనవరాలికి ఎలా వస్తుంది?! తమకాళ్లమీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించడమే కదా తల్లిదండ్రులు పిల్లలకివ్వగలిగిన బహుమతి?! మళ్లీ చదివితే మరిన్ని పార్శాలు కనిపిస్తాయా కథలో. ఔనంటారా?

కినుకును యొక్క లోన్లోపలను

చిట్టచివరికి చిట్టచివరికు చిట్టచివరకు చిట్టచివరకి వీటిలో రెండోది ఎవరూ వాడరనుకుంటా. అది తప్ప మిగిలిన మూడూ వాడుకలో చూస్తున్నాను. ఐతే నాలుగోది నేను వాడను. ఎందుకంటే నాకది ఎలా అనిపిస్తుందంటే, ఒక ఉదాహరణతో చెబుతాను. ఒక చిన్న పిల్లవాడు మరొకడిని బెదిరిస్తున్నాడు. ఏమని? "అమ్మకు చెబుతా వుండు!" అని. వీడు తెలుగుహిందువుల పిల్లోడు అనిచెప్పవచ్చు. ఇంకొక చిన్నపిల్లోడు మరోకడిని బెదిరిస్తున్నాడు. ఏమని? "అమ్మకి చెబుతా వుండు!" అని. వీడు తెలుగుసాయిబుల పిల్లోడు అనిపిస్తుంది. "అమ్మా కీ చెప్తా" అన్నట్టుంటుందిది. మావూళ్లో సాయిబులు ఎవరో కొందరు తప్పితే మంచి తెలుగు మాట్లాడతారు. మంచి తెలుగంటే నాకు మంచి అనిపించిన తెలుగు. నేను చిన్నప్పటినుంచీ విన్న తెలుగు. బ్లాగులు చదవడం మొదలుపెట్టిన తరువాత అకారానికి, ఉకారానికీ పక్కన ఈ "కి"కారమును ముస్లిమేతర తెలుగులు కూడా వాడటం ఎక్కువగా చూస్తున్నాను. చదివినప్పుడల్లా నాకు ఇబ్బందిగా వుంటుంది. "ప్రియమైన అమ్మానాన్నలకు" అని రాస్తాం మావైపు వాళ్లం. "ప్రియమైన అమ్మాన్నాన్నలకి" అని రాసేవాళ్లున్నారు. వీళ్లు మావైపువాళ్లు కానివాళ్లు. ...

టింగురంగని సందేహాలు

ముల్లు : " ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు - ఎక్కడో గుచ్చావు చాపముల్లు " అన్ని వర్గాలనూ కదిలించిన పాట. "సుప్రీం హీరో మఱియు మెగాస్టార్ అయిన మిమ్మల్ని... నిన్నగాకమొన్న చిత్రసీమలో అడుగుపెట్టిన నగ్మా 'బే' అనడమేమిటి? ఇతర హీరోల అభిమానుల ముందు తలెత్తుకోలేకున్నాను." అని ఒక అభిమాని తన రక్తంతో లిఖించి చిరంజీవికి పంపించాడని 'ఇండియా టుడే'లో చదివాను ఆ కాలంలో. "ఏం పాటలో ఏం ఖర్మో, రాబోయే కాలంలో ఇంకా ఏమేం వినాల్సొస్తుందో!" -- మరో వర్గం "ఏం పాట!! నా సామిరంగా... ఏమి స్టెప్పులూ...!!!" -- ఇంకో వర్గం నాకు మాత్రం ఇవేవీ పెద్దగా పట్టలేదు. ఈ పాటలో 'స్‌సోడాకొట్టు అలా అలా విస్కీకొట్టు ఇలా ఇలా' అనేటప్పుడు బాలు గొంతు తాగిన చిరంజీవి గొంతుమాదిరే వుంటుందికదా అనుకుంటే, చిత్ర కూడా తాగినట్టు పాడటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించేది. అప్పుడు మనం ఏడో తరగతి - ఎనిమిదో తరగతి ఆ మధ్యలో ఉన్నాం. సినిమాలు అందనంత దూరంలో ఉండేవి. పాటలు మాత్రం ఊర్లో వినబడుతూ ఉండేవి. కొన్నాళ్లకు రేడియోలో కూడా వచ్చాయి. చాపముల్లేమిటి చాపముల్లు? చేపముల్లు అంటే అర్థం చేసుకోవచ్చు. చేపముల్లయితే ఎవరో గుచ...

పొద్దుపోని యవ్వారం - 5

"తిన్నడంటే తెలుసునా?" "తెలుగు భాషలోనేనా?" "ఆహాఁ! తెలుగులోనే" "తెలంగాణంలోనా కోస్తాంధ్రంలోనా సీమయాసలోనా?" "తెలంగాణంలో" "తిన్నడంటే పేఠ్ భర్ బిర్యానీ దట్టించిండన్నట్టు" "మరి, కోస్తాంధ్రంలో?" "తిన్నడంటే చక్కనివాడు, వంకరల్లేనివాడు" "రాయలసీమలో?" " సీమలో తిన్నడంటే భక్తకన్నప్ప" "తిన్నడంటే అన్నిచోట్లా ఒకే అర్థం రాదా?" "ప్రస్తుత పరిస్థితుల్లో రాదు" "పోనీ భక్తకన్నప్ప అంటే రాష్ట్రమంతటా ఒకటే అర్థం వస్తుందా?" "రాష్ట్రమంతటా ఒకటే అర్థం రావాలంటే భక్తకన్నప్ప అంటే సరిపోదు" "మరేమనాలి?" "అవిభక్త కన్నప్ప" " ... " "అవిభక్త కన్నప్ప అంటే కన్నడభాషలో కూడా అర్థం మారదు" "అవిభక్త కన్నప్పకు విభక్తులతో ఏమైనా పేచీ వున్నదా?" "పేచీ లేని భక్తుడు గనుకనే అవిభక్తుడయినాడు" "మరి మనమో!?" " ... "

పొద్దుపోని యవ్వారం - 4

"ఇది విన్నారా, మహారాజు ఈరోజు కవిగారిని సన్మానించారట" "ఊఁ" "కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నారట" "ఊఁ" "గండపెండేరం తొడిగారట" "ఊఁ" "మదగజం పైన ఎక్కించి రాచవీధుల్లో ఊరేగించారట" "కవులను ఎక్కించవలసిందే, ఏగించవలసిందే" "ఏఁ?" "వారంతట వారుగా ఏనుగుపైకి ఎక్కలేరు, ఊరేగలేరు. మావటీ కావలసిందే" "అదే, ఎందుకని?" "నిరంకుశాః కవయః అంటే ఏమిటనుకున్నావు?" "రంకు లేని వాడే కవి" "నీ మొహం. కవులకు రంకు అలంకారం" "మరేమిటి దానర్థం?" "నిరంకుశాః కవయః అంటే అంకుశం లేనివాడే అసలైన కవి" "అంకుశం ఉన్నవాడు?" "మావటిః"

మయాన అనగానేమయా?

ఎవరో పిలిస్తె వచ్చిందీ, ఎవరికోసమో పోతోందీ, మయాన మజిలీ యేసిందీ, మయాన మజిలీ యేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే (౨) పళ్ళు పదారూ రాలునులే .. పళ్ళు పదారూ రాలునులే మొన్నామధ్యొకసారి మాటీవీలో 'పాడాలని వుంది' కార్యక్రమంలో ఒక పాప ' గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ' అనే పాట పాడింది. నిర్వాహకుడు బాలసుబ్రహ్మణ్యంగారు ఆ పాట సాహిత్యాన్ని గురించి రెండుముక్కలు చెబుతూ ఈ నాలుగు పంక్తులనూ ఉటంకించి ఇక్కడ ఆత్రేయ 'మయాన' అనే పదాన్ని వేసినందుకు మురిసిపోయారు. మయాన అంటే ఏమిటో చూద్దామని బ్రౌణ్యము లో వెతికాను కానీ అక్కడ దొరకలేదు. 'మయాన' అంటే 'మధ్యలో' అని ఈ పాట సందర్భానుసారం నాకు అర్థమయింది. నేను పుట్టక ముందు నుంచీ ఈ పాటను వింటున్నానుగానీ, ఇది మూగమనసులు సినిమాలోనిదని నాకిప్పుడే గూగులమ్మ ద్వారా తెలిసింది. నేనింకా 'మూగమనసులు' చూడలేదు. మొన్న ఆదివారం చిన్న పని మీద రోడ్డునబడి చిరంజీవి పాటలు వింటూ వెళుతూ వుండగా 'మయాన' మళ్లీ తగిలింది. మెగాస్టార్ సగటు అభిమానులు చెప్పగలరా ఏ పాటలోనో? సగటు అభిమానులను ఎందుకు అడుగుతున్నానంటే వీరాభిమానులు చెప్పలేరని నా అనుమానం. సరే చ...

పొద్దుపోని యవ్వారం -3

" రామానాయుడికి తల్లిగారు లేరట కదా " "ఆయనే ముసలివాడయ్యాడు. తల్లిగారు పోయుంటారు !" " అసలుంటే కదా పోవడానికి. అందుకే ఆయనను నిర్మాత రామానాయుడంటారు " "అదెలాగా?" " నిర్ +మాత=నిర్మాత. మాత లేనివాడు గనుక నిర్మాత అయ్యాడు" " మరి... అరవింద్? " " బ్రహ్మదేవునికి నారదుడిలా రామలింగయ్యగారికి మానసపుత్రుడన్నమాట "

రానారె - ఓ ఇరవై ఉగాదుల తరువాత

చిత్రం