పోస్ట్‌లు

నీడలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తోలుతిత్తి ఇది

చిత్రం
తోలుతిత్తి ఇది సెప్టెంబరు అక్టోబరు నెలలలో నేనుంటున్న ఇంటి చుట్టుపక్కల చెట్ల మొదళ్ల బెరళ్లకు ఇలాంటివి చాలా కనిపించాయి. ఈ తోలుతిత్తి వీపుభాగం మధ్యలో పడిన చీలిక నుంచి పురుగు బయటకు వెళ్లిపోయిందని చూడగానే తెలుస్తుంది. ఈ పురుగు ఏమిటో ఎవరికైనా తెలుసా? ఇంటికొచ్చేవాళ్లను భయపెడదామని ఒకటి తెచ్చి ద్వారబంధనానికి (దాలమందరానికి) తగిలించాను. కానీ ఎవరూ భయపడినట్టుగా నాతో చెప్పలేదింతవరకూ.

... చినమాయను పెనుమాయ ...

మా ఇంటికి ఫోను చేసి మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో పక్షుల అరుపులు వినబడుతూ వుంటాయి. పిట్ట యెంతదైనా కూత మాత్రం ఫోన్లో ఘనంగా వినబడుతూ వుంటుంది. మామిడి చెట్ల మింద వాలే చిలకలు, కోకిలలు, పుల్లాచెదలు, గోరింకలు, కాకులు, చిన్నచిన్న గువ్వల శబ్దాలు ఎంత బలంగా వినిపిస్తుంటాయంటే ఒకోసారి 'యినబళ్ల్యా!' అనాల్సుంటుంది. పదోతరగతి దాకా ప ల్లె ల లోనే చదువుకోవడంతో చెట్లు, పుట్టలు, పిట్టలు మనకు కొత్త కాదుగానీ ఆ తరువాత దూరం పెరిగిపోయింది. ఇదిగో ఈ కిందున్న వీడియోలో కనిపించే నలభై ఎకరాల చెఱువు చుట్టూ కూడా రెండు బారల పొద్దెక్కే దాకా రకరకాల పక్షుల శబ్దాలు వినపడుతూ వుంటాయ్. వీలు కుదిరినప్పుడల్లా పొద్దున్నే బయల్దేరి నూరు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ చెఱువును చేరి చుట్టూ ఒక సారి నడవడం నాకొక అలవాటుగా తయారవుతూ వుంది. ఇది ఆరోసారి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ వారాంతంలో వెళ్లిపోదామనిపిస్తుంది. పెద్దగా జన సంచారం వుండకపోవడం ఒక కారణం. ఉదయమే అక్కడకి చేరుకుంటే పక్షులు, నీటి జీవాలు చేసే శబ్దాలతో భలే సందడిగా వుంటుందీ ప్రాంతం. స్థూలంగా చూస్తే పెద్దగా ఏమీ కనిపించదు. గమనించే కొద్దీ చిన్నచిన్న విషయాలే విశేషాలుగా కనిపిస్తుంటాయి. ఇం...

నిన్న లేని అందమేదో ...

ఇంటి నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అడవి. అందులో ఒక చెఱువు. మొన్నటి ఆదివారం తెల్లవారుఝామున అక్కడికి చేరుకున్నాను. అడవిలో మంచి నీటి సౌకర్యంగల ప్రదేశం ఎలా వుండాలో అలాగే వుందాప్రాంతం. అక్కడ నడుస్తూండగా కనబడిన దృశ్యాలివి. భూతాపం పెరుగుతూపోతే మరికొన్నాళ్లకు ఇలాంటి దృశ్యాలు కళ్లబడకుండా పోతాయేమో! జాగరూకతతో మెలగాలనే స్పృహ ప్రపంచ మానవాళికీ దాని గమనాన్ని నిర్దేశిస్తున్న శక్తులకూ కలుగుగాక.

పట్టువదలని విక్రమార్కుడు

చిత్రం
ఎక్కడికో తిరిగి వెళ్తున్నట్టుందే ... !? ఏమిటో భుజానవేసుకొని నడుస్తున్నాడు. అలసిపోడూ!?

టెక్సాస్‌కు వసంతాగమనం

చిత్రం
టెక్సాస్ బ్లూ బొనెట్‌లుగా పిలువబడే ఈ అడవిపూలు టెక్సాస్‌లో ఈ నెలంతా రోడ్లకిరువైపులా సర్వసాధారణంగా కనిపిస్తాయి. జూలై నుండి వడగాడ్పులూ, మండే ఎండలు, డిసెంబరు నుండి వణికించే చలి వలన ఎడారిని తలపించిన ఈ ప్రాంతంలోకి ఫిబ్రవరిలో వర్షాలుపడగానే ఈ పూలు వసంతాన్ని ఆహ్వానించి మాయమౌతాయి.

ఆ చందమామలో ఆనంద సీమలో ...

చిత్రం
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే... వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా... వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా... మంచి ఫోటో తీసి చాన్నాళ్లైపోయనని కెమెరా తీసుకొని గడచిన శనివారం ఇంటి నుండి బయటికొచ్చాను. ఇంటి బయట చుట్టూ చూస్తుంటే నీలాకాశంలో చందమామ కనబడి 'రావోయి రామనాధా...' అన్నాడు. సాయంత్రం నాలుగుగంటల సమయంలో పొడుగాటి చెట్లమీద పొడి ఎండ పడుతుండగా చంద్రునిమీదికి కెమెరా సంధించాను. చంద్రుని చూసి భావుకత పొంగి మంచి పాటల స్వరాల్లోకి ఒదగుతుందంటే ఒదగదూ మరి!!