పోస్ట్‌లు

వర్తమానం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మినీ మీనాక్షి

గత ఆరు వారాల్లో ఐదుసార్లు వెళ్లాను దేవళానికి. ఇప్పుడు మనం కలసిమెలసి తిరగడానికి దొరికిన సావాసగాళ్లు భక్తులయిరి. దేవళాలకు పోకూడదని నియమమేదీ లేదుగానీ, గత ఆరు వారాలు మినహాయిస్తే అంతకు ముందు ఐదేళ్లలోనూ మొత్తం కలిపితే ఐదుసార్లకు మించి దేవళానికి వెళ్లివుండనేమో. గుళ్లో ఆహ్లాదకరంగా గాలి వీస్తూ వుంటుంది. జనం ఎక్కువగా వుండరు. ఆ మెట్ల మీద కూర్చుని వుంటే హాయిగా వుంటుంది. దేవుళ్లవిగ్రహాల ముందు నిలబడే సమయం కంటే ఆ ఆవరణంలో మెట్లమీదే నేను ఎక్కువ సమయం గడిపాను. ఈ ఐదుసార్లలో రెండోసారి దేవళానికి పోయినప్పుడు చిన్న తమాషా జరిగింది. వెళ్లగానే కాళ్లూచేతులూ కడుక్కొని, ముందుగా వినాయకుని విగ్రహం ముందు నిముషం పాటు నిలబడి చేతులు కట్టుకుని కండ్లు మూసుకున్నాను. ఒక గంటసేపు మంచి నిద్రపట్టినప్పుడు కలిగే హాయి కలిగింది. మళ్లీ రెండుసార్లు వెళ్లినప్పుడు అక్కడే నిలబడితే అలాగే అనిపిస్తుందేమోనని చూశాను. అనిపించలేదు. ఐదోసారి జనం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నేనసలు దేవుళ్లవిగ్రహాలజోలికే పోలేదు. పాలరాతి రాధాకృష్ణులకు పక్కగా ఒకమూల మెట్లమీదే కూర్చుండిపోయాను మావాళ్ల దర్శనాలు, దండాలు, దక్షిణలు, ప్రదక్షిణలు పూర్తయిందాక. విగ్రహాలకు ఇనుపకడ...

కవితల విద్యామంత్రి కపిల్

అలవోకగా కవితలు చెప్పగల విద్యామంత్రి మన కేంద్రప్రభుత్వంలో కొలువుదీరి వున్నాడంటే దేశానికిది శుభసూచికగా కనిపిస్తోంది. అదిన్నీ, పొంగిన ఆ కవితలను ఆయన తన జేబువాణి/చరం/సెల్‌ఫోను/మొబైల్‌లో సంక్షిప్తసమాచార(ఎస్సెమ్మెస్)పరిభాషలో రాసుకుంటారట. మంత్రి నోట మంచి భవితకు బాటలు పరచబోతున్నాయనిపించే మాటలు వినవస్తున్నాయి. పదోతరగతి పబ్లిక్ పరీక్షల గోల ఇక ఉండబోదనే మాట వింటున్నానుగానీ, మన విద్యావిధానాన్ని సవరించబోవడంలో మంత్రిగారి దార్శనికత మరియు శ్రద్ధ ఏపాటివో ఈ వీడియో చూశాక కొంత అవగతమయింది. అన్నింటికంటే నన్ను సంతోషపెట్టిన విషయం - పని చేసే మంత్రి ఒకరుండటం. పనిని ఇష్టంగా చేసే మనిషి కావడం. అందులోనూ కవితలు చెప్పగలగడం. మంత్రిగారి పనులకు మంచి అభినందనలే వస్తున్నట్టున్నాయి! ఈ వ్యవహారాన్ని మీరు దగ్గరగా గమనిస్తున్నారా? మాతృభాష ప్రాముఖ్యాన్ని మంత్రిగారు నొక్కిచెబుతున్నారు. బాగుంది. హిందీ కూడా నేర్చుకొమ్మంటున్నారు. ఇది మాత్రం ఇబ్బందిగా వుంది. దీన్ని ఐచ్ఛికం చేస్తే బాగుండును. ఆంగ్లం ఎలాగూ అవసరమే. రాజ్యాంగం అనుతించదుగనుక దేశానికంతటికీ ఒకే విద్యాబోర్డు సాధ్యం కాదంటున్నారు - భిన్నత్వం భారతదేశానికి చాలా ముఖ్యమైనదంటూనే. భాషల వ...

శాసనసభలో ...

ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడొచ్చన్నమాట! ;-)

ప్రపంచపు ప్రకృతేమిటన్నది ...

మన చుట్టూ వున్న ప్రపంచపు ప్రకృతేమిటన్నది తెలుసుకొనే ప్రయత్నం ప్రతి మనిషీ నిరంతరం చేస్తుంటాడనుకుంటా. కొన్ని సందేహాలుంటాయి. కొన్ని మానసికమైన అవరోధాలుంటాయి. కొన్ని శూన్యతలుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ కొన్ని స్వీయ అనుభవాలవల్లా కొందరి మాటలవల్లా ఇవి తొలగుతూవుంటాయి లేదా మారుతూ వుంటాయి. అలాంటి ఒక అనుభవం జయప్రకాశ్ నారాయణ్ మాటలు వింటూవుంటే కలిగింది. ఆయన మాటల్లో నాకు ముఖ్యమైనవనిపించిన కొన్నింటిని వింటూ టైపించాను. వాలుఅక్షరాల(Italics)లో వున్నవి నా అభిప్రాయాలు. 1. దేశం బాగుండాలంటే మనం మహాత్మాగాంధీలం కావాలనుకుంటాం. అక్కర్లేదు. We are ordinary mortals. (దేశము బాగు లాంటి మాటలు వినగానే నా భుజాలమీద ఏదో పెద్ద బరువున్నట్లు మొహంమారకపోతే నేను చంద్రమండలంమీదో అంతరిక్షంలోనో వున్నట్టనిపిస్తుంది తప్ప భూమ్మీదున్నట్టనిపించదు) 2. ఎన్టీయార్ గొప్ప nobility ఉన్న మనిషి. ఆయనలో అవతలిమనిషిలో కాస్త మంచితనం ఉందనుకుంటే ఆదరించే వ్యక్తిత్వమున్నది, అవతలిమనిషిలో ఆత్మగౌరవముంటే దాన్ని గుర్తించే వ్యక్తిత్వమున్నది. (ఎన్టీయర్ వ్యక్తిత్వం గురించి ఈ మాటలు చెప్పినవాళ్లను నేను చూడలేదు - ఆయనతో వ్యక్తిగత పరిచయమున్నవారితో సహా) 3. ఆంగ్ సా...

మన కులానికే మన ఓట్లు

చదువుకునే రోజుల్లో ఓటు వెయ్యాలనే ఆలోచనే నాకెప్పుడూ కలగలేదు. అందరూ వ్యాపారులేగానీ ప్రజానాయకులెవరూ లేరనే అభిప్రాయం నాది. అందుకే ఓటరు జాబితాలో నాపేరు కూడా నమోదు చేసుకోలేదు. నేనెప్పుడూ చదువులపేరుతో ఊరిబయటే ఉంటాననుకున్నారో, వాళ్లకే ఓటేస్తానన్న భరోసా లేదనుకున్నారో, నాలాంటివాళ్లు ఓట్లేయడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదనుకున్నారోగానీ మావూళ్లోని ఏ పార్టీవాళ్లూ పట్టుబట్టి నాపేరును ఆ జాబితాలోకి ఎక్కించలేదు. నాకీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల వార్తలను చాలా దగ్గరగా చూస్తున్నాను. ఇప్పుడు ఓటు వేద్దామనిపిస్తూ వుంది. లోక్‌సత్తాకు. ఎన్నికల సంఘం చెప్పిన నియమావళిని పాటిస్తూ రాజ్యాంగంపట్ల మనకుండవలసిన గౌరవాన్నీ క్రమశిక్షణనూ చాటుతూ, నేటి రాజకీయగంజాయివనంలో తులసిమొక్కలా నిలిచిందన్న ఒకే ఒక్క కారణం చాలు లోక్‌సత్తాకు ఓటు వేయడానికి. ఈ కారణం మాత్రమే చాలు. లోక్‌సత్తాకు ఓటు వేస్తే మీ ఓటు వృధా అవుతుందని కొందరంటున్నారు. ఇంతకంటే పాపపు ప్రేలాపన ఇంకొకటి లేదు. గెలిచే అభ్యర్థి ఎవరో వాళ్లే మనకు చెప్పేసి, ఆ అభ్యర్థికి ఓటు వేస్తేనే అది సద్వినియోగం అవుతుందన్నట్లు ప్రచారం చేస్తున్నారు వీళ్లు. ఎన్నికలంటే ...

సోడా కేకూ సినిమా మరియు ...

బస్టాండులో వికారం సోడా గ్యాస్ తాగడానికి చేతిలో ఐదు రూపాయలు ... బేకరీముందు సైకిలాపి హనీ కేక్ కొనుక్కోడానికి జేబులో పది రూపాయలు ... లక్ష్మీరంగాలో కొత్తసినిమా బాలేదంటలే అనుకోకపోతే టికెట్టుకు ఇరవై రూపాయలు ... సోడా తాగనోడు కేకు తిననివాడు సినిమా చూడనోడు కడపలో ఎవడూ లేడు! డిగ్రీ చదివేరోజుల్లో ఇవీ నా బృహత్తరమైన ఆలోచనలు. కడపలో బతికే ప్రతి మనిషికీ రోజూ ఓ ముప్పైఐదురూపాయలు వాటంతట అవే వచ్చి జేబులో పడితే బాగుండునని ఆనాటి నా బలమైన కోరిక. కాబట్టి ఈమధ్యే చంద్రబాబునాయుడుగారు ప్రటించిన నగదు పంపణీ పథకాన్ని మెచ్చి, నా పవిత్రమైన(!) ఓటును వేసి గెలిపించేద్దామని కాదు నా ఉద్దేశం. వయ్యస్రాశ్శేఖర్రెడ్డిగారి జనా'కర్షక' పథకాలను మెచ్చి ఓట్లేస్తే ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్నికల సంఘం నిబంధనలొచ్చినా కూడా ఆ అభివృద్ధి ఆగకుండా అలా జరుగుతూనే ఉందో చూస్తున్నాం కదా! ఇంకా కొత్తగా కొన్ని పథకాలు వినవస్తున్నాయి - వందకే వంటసరుకులనీ ఇలాగ. ఊహూఁ ఇవన్నీ లాభం లేదు. "రోజుకు జేబుకు ముప్ఫైఐదురూపాయల పథకం" రావాలి, దేశం బాగుపడాలి. అంతవరకూ మీరూ ఇలాంటి పథకాలకు మీ పవిత్రమైన(?) ఓటు వేయకండి. ప్రజలను బిచ్చగాళ్లను చేయడానికే ఇలాంటి...

క్రియాసిద్ధిః సత్వే భవతి!

తాము ఆశించినట్టుగానే అందరూ బతకాలనుకునే తత్వం ప్రతిమనిషిలోనూ కొంత వుంటుందేమో. జంతువుల్లో కూడా ఈ తత్వం కలిగినవి కొన్ని వుంటాయి. మిగతా జంతువులు తమకు బెదురుతాయోలేదో చూద్దామని ఎప్పుడూ ప్రయత్నిస్తూనేవుంటాయి. కొంచెం బెదురు కనబడిందా వాటి ఆనందానికి హద్దులుండవు. వాటి శక్తి ఎన్నోరెట్లు పెరుగుతుంది. అడవిమొత్తం కలయదిరుగుతూ మొత్తం పెత్తనం మాదేనంటాయి. గుంటనక్కల్లాంటి కొన్ని జంతువులు వాటివెనకే తిరుగుతూవుంటాయి. కాకపోతే కొన్ని జంతువుల్లోనూ, కొంతమంది మనుషుల్లోనూ ఈ స్వభావం కొంచెం ఎక్కువగా వుంటుంది. ఎదుటివారిలో జంకు కనబడేవరకూ నానారకాల ప్రయత్నాలూ చేస్తూనే వుంటారు. జంకినట్టూ చీకాకుపడినట్టూ కనబడితే వాటికి పండగే. తమ సంఖ్య ఎక్కువగా వుందని చూపే ప్రయత్నం వాటిలో ఒకటి. నేనీమధ్య దాదాపుగా బ్లాగులేవీ చదవడంలేదు. ఎవరో బెదిరిస్తే ఒకరిద్దరు బ్లాగులు మానేశారని/మూసేశారని తెలిసింది. మానేసి/మూసేసి వీళ్లెవరిని బెదిరిద్దామనుకున్నారో?! రెండు బ్లాగువికెట్లు పడటం కొంతమందికి ఉత్సాహాన్నిచ్చినట్టుంది. ఇప్పుడే కదా బౌలర్లకు భయపడిపోకుండా నిలకడగా ఆడాల్సింది! జట్టు కొద్దిగా కష్టాల్లో పడింది. నేను నాటౌట్ అని క్రీజులో నిబడితే కాదనే అంపైరెవర...

ఇటీవల నేను చూచిన చిత్రములు

అరుంధతి - గత ఆదివారం చూసిన సినిమా. ఈమధ్య వచ్చిన రొడ్డకొట్టుడు సినిమాలకు ఇది భిన్నమైనది. ఈ సినిమాలో నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. పతలా దబరాను పెద్ద నొక్కుపడేలా బలమైన గరిటెతో వాయిస్తే వచ్చే శబ్దాన్ని ఒకసన్నివేశంలో వినిపిస్తారు కోటి. 'ఇప్పుడు మీరు భయపడాలన్నమాట' అని సబ్ టైటిల్ వేసివుంటే ప్రయోజనం వుండేదేమో. స్టీలు పాత్రల సంగతి వదిలేసి, సినిమాపాత్రల విషయానికొస్తే రొ'టీన్' పాత్రల్లో ఎప్పుడూ కనిపించే అనుష్కకు ఇదో వెరయిటీ. ఇందులో విలను వీరోయినును ఎలా అనుభవించి చంపాలనుకుంటాడో మాటిమాటికీ ఆమెతో చెప్పీ చెప్పీ చెప్పీ చివరికి అనుభవించకుండానే చచ్చిపోతాడు. ఒక అందమైన గుడ్డి నాట్యాచారిణిని పొడుగాటి కత్తితో రెండుపోట్లు పొడిచి, రక్తంలో ఆమె విలవిలలాడుతుండగా విలను ఏకాగ్రచిత్తంతో తనపనేదో తాను చేసుకుంటూ -సుఖపడుతూ పోతున్నావు, పోతూ సుఖపెడుతున్నావు, నీవెంత ధన్యవోకదా- అనే కవితాత్మకమైన డైలాగు చెప్పే దృశ్యం ఈ సినిమాలో హైలైట్. మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రం. గ్రాఫిక్సూ అవీ బాగున్నాయి. సినిమా చివరివరకూ మెదలకుండా చూశాను. ఖర్మ. స్లమ్ డాగ్ మిలియనీర్ - నేనీ సినిమాకు ...

పొద్దుపోని యవ్వారం - 8

అధ్యక్షా! ... అనగానే నీకేం గుర్తుకొస్తుంది? శాసనసభలో రాజశేఖరరెడ్డి బొంగురుగొంతు. నాకూ ఆ వాచకమూ ఆకారమే మనసుకొస్తుంది నీకేనేమిటి, తెలుగువాళ్లకెవరికైనా అంతే! శాసనసభ్యులందరూ అధ్యక్షా అని ప్రశ్నలు వేస్తూవుంటారు కదా అధ్యక్షుడున్నదే తడికరాయబారానికి కదా! అంతేనా? సస్పెన్షన్లు, వాయిదాలు, వగయిరాలు కూడా చేస్తూవుంటాడనుకో. మరి, అధ్యక్షుడు ప్రశ్నలు వేయడా? వెయ్యడు. వేసినా లాభంలేదని తెలుసుగనక. ఎందుకనగా? ఎందుకేమిటి? అధ్యక్షుడు ప్రశ్నలువేస్తే అవేమౌతాయో తెలుసా? ఏమౌతాయి?! అధ్‌యక్షప్రశ్నలు. ...?! సమాధానం చెప్పే ధర్మరాజేడీ, అందునా ఆంధ్రదేశపు శాసనసభలో ???

~~ కలకాలమొకటిగా ~~

ఆ దారి ఎర్రమన్ను, కంకరలతో తయారయింది. ఇరువైపులా సర్కారుతుమ్మచెట్లు దట్టంగా పెరిగివున్నాయి. నలుగురు మిత్రులం ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. రాత్రి వర్షంపడి వెలసినట్టుంది. దారిమధ్యలో వున్న గుంతల్లో నీళ్లు నిలచివున్నాయి. పొద్దింకా పొడిచినట్టులేదు. వాతావరణం చల్లగా వుంది. ఆ దారి ఒక మలుపుతిరిగాక మాకు కొద్దిగా ముందు ఒక పన్నెండు-పదమూడేండ్ల పాప మెల్లగా నడుస్తోంది. పాత పావడా, పొడుగాటిజాకెట్టూ వేసుకుని, మొన్నెప్పుడో అల్లుకున్నజడతో మురికిగా కనిపిస్తోంది. మా నలుగురినీ గమనించినట్టే వుంది. నడుస్తూ మేము ఆ పాపకు దగ్గరగా చేరుతున్నాం. నేను పాపనే గమనిస్తున్నాను. అప్పుడా పాప తన తలమీదుగా దేన్నో వెనుకకు విసిరింది. అది గాలిలో వుండగానే నాకు తెలిసిపోయింది - గ్రెనేడ్‌. అది నేలను తాకగానే మా ముఖాలు మాడిపోతాయి, పాపతోసహా అందరి శరీరాలూ ఛిద్రమౌతాయనే ఊహ కలిగి, నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను. గ్రెనేడ్ కిందపడింది. పడి దొర్లుతోంది. కూజామూతిలాంటి దాని మూతినుండి నల్లమందు, మినమినా మెరుస్తున్న లోహపురవ్వలు ఒలికి ఎర్రటి మట్టిపై పడుతున్నాయి. దానికి ఇటువైపు మేము, అటువైపు పాప. పాప ఇటు తిరిగింది. గ్రెనేడ్ మా మధ్యలో నిశ్చలంగా వుంది. బొమ...

కాళ్లకూరు పాలరైతుల సత్యాగ్రహం

మిత్రులారా, మన దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయాల్లో అవినీతిని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అసహనంతో రాజకీయనాయకులను తిట్టుకోవడం, లేదా -సమాజంలో మార్పు రావాలి- అనుకోవడం వరకూ తరచుగా జరుగుతూ వుంటుంది. ఆ తరువాత పెద్దగా జరిగేదేమీ ఉండదు. దీనికి -ఇవన్నీ పట్టించుకుంటే నా జీవితం నడవాలి కదా- మొదలుకొని ఎన్నో కారణాలు చెబుతాం. నామాటకు వస్తే నాకు ఓటువేసే వయసు వచ్చి పదేళ్లయినా ఓటరుజాబితాలో ఇంతవరకూ నా పేరు నమోదు కాలేదు. అయినా నేనూ, నాబోటివాళ్లూ రాజకీయాల గురించి అసంతృప్తిని వెళ్లగక్కే హక్కు మాకున్నట్లుగా నిస్సిగ్గుగా మాట్లాడుతూనే వుంటాం. ఎందుకు? నాకు తోచిన కారణాలు ఇవీ: చిన్నప్పటి నుంచీ మార్కులు, రాంకులూ, ఆపైన ఒక ఉద్యోగమో వ్యాపారమో సేద్యమో, వ్యక్తిగతంగా మన కాళ్లపై మనం నిలబడటం తప్ప - మనం ఈ సమాజంలో పౌరులం, మనమంతా కలిసికట్టుగా వుండి కొన్ని పనులు చెయ్యగలం, ఈ పనులవల్ల మనకు కలిగే బలం ఇదీ, సమాజంలో భాగస్వాములం కావడంవల్ల మనకు కొన్ని చిన్నచిన్న బాధ్యతలుంటాయి, వాటిని నెరవేర్చడాన్ని చిన్నప్పటినుంచే అలవాటు చేసుకోవాలి అనే భావనను కలిగించిన సంఘటనలుకానీ బోధనలుకానీ మన బళ్లనూ ఇళ్లలోనూ (కావలసినంతగా) లభించకపోవడంవల్ల. అందర్న...

యథా ప్రజా తథా రాజా!

మొన్నటినుంచి వార్తలు చూసి చూసి మెదడు అలసిపోయింది. బాంబుపేలుళ్లు, కాల్పులూ చిన్నప్పటినుంచి వింటూనే వున్నాను చూస్తూనే వున్నాను. కాకపోతే ఈసారి చాలా తేడా కనిపిస్తోంది. నాకేమనిపిస్తోందంటే ... బారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కిచిడీ పార్టీ ఎవరు అధికారంలో వున్నా ... దేశప్రజల్లో అశేషంగా వున్న అజ్ఞానాన్ని పొదిగి వృద్ధిచేసేవాళ్లే. నగరాల్లో ఏరియాలను పంచుకొని దందా సాగించే మాఫియాలకూ, పరిపాలనా కాలాన్ని పంచుకొని దందా సాగిస్తున్న పార్టీలకూ తేడా ఏమీ లేదు. ఈ రెండు పరిస్థితుల్లోనూ సామాన్యునికి అభద్రతే. మొన్నీమధ్యే ముంబయ్ రైలుపేలుళ్ల బీభత్సం జరిగిన వెంటనే నిముషాల్లో యథాతథ పరిస్థితి నెలకొంది, స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అన్నారు. సంతోషమే. స్పిరిట్ సరే, మంచిదే, వుండాల్సిందే. ఇష్టారాజ్యంగా బాంబులు ఎట్లా తయారౌతున్నాయి, ఎక్కడబడితే అక్కడికి ఎలా చేరుతున్నాయి, పేలుతున్నాయి అనే మాటకంటే స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అనే మాటే ఎక్కువగా వినిపించింది. కారణం మనకు బాంబు పేలుళ్లు కొత్తకాదు. తాజాగా జరిపిన దాడితో ఉగ్రవాదులు 'కొంచెం కొత్తగా ఆలోచించండ్రా' అనే సందేశాన్ని మన జనానికి చేరవేయడంలో మొదటి అడుగు వేసినట్టున్నారు. ఎప్పటిలాగే ...

పొద్దుపోని యవ్వారం - 6

"హరికేన్ గురించి నీకేమైనా తెలుసా?" "అట్లాంటిక్, తూర్పుపసిఫిక్ మహాసముద్రాల్లో పుట్టిపెరిగే వినాశకరమైన సుడిగాలి-వా న " " అట్లాంటిక్ ఇట్లాంటిక్ లాంటి జవాబు ఎవరినడిగినా చెబుతారు " "మరి ఎట్లాంటిక్ జవాబులు కావాలి నీకు?" "దాన్ని హరికేన్ అని ఎందుకంటారో తెలుసా?" "ఏదో ఒకటి అనాలి కదా" "ఎందుకురా పెళ్లి చేస్కున్నావంటే - రాసిపెట్టుంది, చేస్కున్నానన్నాడంట వెనకటికెవడో. " "నీకు తెలిస్తే నువ్వే చెప్పరాదా!" "ఆంగ్లమున. అట్లాంటిక, పసిఫిక తీరములందు పాపం పెరిగినపుడు శ్రీమహావిష్ణువు ఝళిపించే బెత్తమే హరికేన్. ఆంగ్లభాషనందూ ఎస్పన్యోలు నందూ హరి హరియే. బెత్తమనగా కేన్. ఆంగ్లమున." "మోకాటికీ బట్టతలకూ ముడిబెట్టినట్టుంది " "దైవలీల అలాగే వుంటుంది. తెలుగులో బెత్తం అని పలకడం చేతగాక bastón అని పలుకుతాడు ఎస్పన్యోలు శాన్యోరు. caña అని కూడా అంటాడు. " "మోకాటికీ బట్టతలకూ కాదు, కాటికీ నీబొందకూ ముడిబెడితే బాగుండును దైవలీల " "...!!?" ****************************** మానవుడు నిస్సహాయుడై చూస్తుండిపోయేలా ఒక ...

నిన్న లేని అందమేదో ...

ఇంటి నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అడవి. అందులో ఒక చెఱువు. మొన్నటి ఆదివారం తెల్లవారుఝామున అక్కడికి చేరుకున్నాను. అడవిలో మంచి నీటి సౌకర్యంగల ప్రదేశం ఎలా వుండాలో అలాగే వుందాప్రాంతం. అక్కడ నడుస్తూండగా కనబడిన దృశ్యాలివి. భూతాపం పెరుగుతూపోతే మరికొన్నాళ్లకు ఇలాంటి దృశ్యాలు కళ్లబడకుండా పోతాయేమో! జాగరూకతతో మెలగాలనే స్పృహ ప్రపంచ మానవాళికీ దాని గమనాన్ని నిర్దేశిస్తున్న శక్తులకూ కలుగుగాక.

సంబరపడాల్సినంతేం లేదిక్కడ!

"... మనం సంబరపడాల్సినంత పనేంలేదు అని చెప్పడానికున్న మరో కారణం -- ఇక్కడ రాజకీయ వ్యవస్థలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ మనం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు. అయినప్పటికీ మనం స్థిరంగా ఉండగలిగామంటే అదంతా రాజ్యాంగం చలవే." --- పూర్తి పాఠం ఈనాడులో రామచంద్ర గుహ . " ... మునుపెన్నడూ లేని ఈ రాజకీయ దగ్గరితనాన్ని పాకిస్తాన్‌తో పోల్చి చూసుకోవాలి. పాకిస్తాన్, అక్కడి ప్రజలతో అమెరికా నెరపిన మైత్రితో బేరీజు వేసుకోవాలి. ఆదేశంలో అల్లా, ఆర్మీ రెండింటికీ అమెరికా బాగానే సాయం చేసింది. పాక్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేయడంపై అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయుధాలు సోవియట్‌ను ఎదుర్కోవడానికి అని పైకి ప్రచారం చేసినప్పటికీ అవి తమపైకి ఎక్కుపెట్టడానికే అని భారత్ విశ్వసించింది. డబ్బు రూపేణా అందిన సాయంతో అక్కడి సైన్యం స్థిరాస్తిపైన, కర్మాగారాలపైన, హోటళ్లపైన పట్టు బిగించింది. జనరల్ జియా ఉల్‌హక్ హయాంలో ముల్లాలు వేలాది మదర్సాలను తెరిచి యువతను మతమౌఢ్యులుగా మార్చారు. అమెరికా గమనిస్తుండగానే ఇదంతా జరిగింది. అప్పుడు చేసిన సాయం వల్ల పాకిస్తాన్‌ సమాజంపై అమెరికా పట్టు సాధించింది. భారత్‌లో మతపరమైన అతివాదం అల్లాకు...

కిమ్ కర్తవ్యమ్

ముఖ్యమంత్రి: "పాకిస్థాను, బంగ్లాదేశులలో మనకు నిఘావ్యవస్థలేదు. ఈ వైఫల్యం పోలీసుయంత్రాంగానిది కాదు." -- నేరం నాది కాదు, ఆకలిది. ప్రధానమంత్రి: "తీవ్రవాద బాధితులకోసం శాశ్వత సహాయ నిధిని ఏర్పాటు చేస్తా." -- ఏంజేస్తున్నావే కోడలా? ఉలగబోసి మల్లా ఎత్తుకుంటాండా అత్తమ్మా. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల అధికారి: "రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి." -- మొక్కై వంగనిది మానై వంగునా!? "ఈ ఘోరకలికి ముఖ్యమంత్రిగా నేను నైతికబాధ్యత వహిస్తున్నాను." -- 'నీతి' బీరకాయలో 'నైతికం' "సంయమనం పాటించినందుకు ముఖ్యమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు." -- సర్కసులో మచ్చికైనందుకు అడవిజీవాలకు రింగుమాస్టారి ఆనందం ప్రతిపక్షం: "వైయ్యెస్, గద్దె దిగిపో!" -- తాత పోతే బొంత నాది ప్రజారక్షణ విపత్కరమైన పరిస్థితిలో పడినప్పుడు రక్షకుల వ్యవహారశైలి ఇది. తప్పించుకోజూడటం ప్రభుత పలాయనవాదానికి చిహ్నమైతే, దాన్ని ఆపి, నిలబెట్టి ప్రజాక్షేమం దిశగా మార్గదర్శనం చేయవలసిన ప్రతిపక్షం వహిస్తున్న పాత్ర 'గోతికాడ నక్క'. అందరూ అందరినీ వేలెత్తి చూపుతున్నారు - నాతో సహా. న్యూ...