పోస్ట్‌లు

కథ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇటీవలి కాలంలో నాకు నచ్చిన కథ

అరగంట ముందు ఒక కథ చదివాను ఆంధ్రజ్యోతి[ఆదివారం అనుబంధం]లో. మీరు ముందు కథను చదివిరండి . కిందున్న రెండుముక్కలూ చదవాలనిపిస్తే ఆ తరువాతెప్పుడైనా చదవొచ్చు. ఒక్కసారి చదివిన వెంటనే నాకే మనిపించిందంటే: అందమైన మాండలికంలో సరళంగా సాగిన కథ. చిరకాలం గుర్తుండే కథ. స్వయంగా బతకగల నేర్పు, స్వేచ్చగా బతకాలనే ధీమా కలిగివుండటమే మనిషికి మొట్టమొదటి సంప్రదాయం కావాలి. అప్పుడే సాంగ్యాలూ, పండగలూ, పర్దాలూ మనిషికి సంతోషాన్నిస్తాయి. ఆ నేర్పూ ఆ ధీమా లేకపోతే సంప్రదాయాలే సంకెళ్లవుతాయి. ఈ కథలోని జేజికి ఆ ధీమా వుంది. ఆమె సొంతంగా బతగ్గలిగింది. అంత ధీమా ఆమె కొడుకుకు లేకపోయింది. ఇక మనవరాలికి ఎలా వస్తుంది?! తమకాళ్లమీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించడమే కదా తల్లిదండ్రులు పిల్లలకివ్వగలిగిన బహుమతి?! మళ్లీ చదివితే మరిన్ని పార్శాలు కనిపిస్తాయా కథలో. ఔనంటారా?

వరసబెట్టి ఒక తొంభై కథలు ...

తెలంగాణ కథలు ... వరసబెట్టి ఒక తొంభై కథలు ... నూరేండ్ల ముందటి మాడపాటిహనుమంతరావు కథతో మొదలు. పీ.వీ.నరసింహారావు అరవైయేండ్ల ముందు రాసిన కథొకటి. దొరల గడీలు, దొరసానుల గారడీలు, పటేండ్ల పరువులు, పనివాండ్ల పరుగులు, పనిమంతుల కథలు, పనికి'రాని'వాళ్ల పాట్లు, కులాల - కులవృత్తుల వృత్తాంతాలు, సాయబుల ఇండ్లల్లో సమాచారాలు, అన్నల గన్నుల కథలు, అన్నల గన్న అమ్మల కథలు, భూనిర్వాసితుల కథలు, భూస్వామ్యానికి బీటలు, రజాకార్ల నాటి రాజకీయాలు, కాలం తెచ్చే మార్పును పసిగట్టగలిగిన గట్టిపిండాల కథలు, మార్పుకు తట్టుకోలేక 'మనాది'తో మగ్గినవాళ్ల కథలు, తెలంగాణ నుడికారపు మజా ఏమిటో రుచిచూపించిన కథలు ... గడచిన నూరేండ్లలో తెలంగాణ ప్రాంతంలో జన జీవనంలో మార్పుల క్రమాన్ని కళ్లముందు నిలిపే కథలు ... ఈ కథలన్నీ చదివాక తెలంగాణ సమాజపు వందేళ్ల చారిత్రక చిత్రం సజీవంగా నా ముందు నిలబడినట్లనిపించింది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇది ఏ ఒక్కరిద్దరు చరిత్రకారులో రాసినవి కావు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి రంగాచార్య, చెరబండరాజు, మాదిరెడ్డి సులోచన, అప్సర్, కాలువ మల్లయ్య... ఇలా నాటి నుంచి నిన్నామొన్నటి వరకూ ఎందరో కథకులు ......

మహాపాపము - దైవకార్యము

యాభై అయిదు మాటల్లో కథ **** **** **** **** **** "తార్చడం మహాపాపం, మూర్ఖుడా!" " ........... " "దేవుడు తొలిసారి మనుషులను సృష్టించినప్పుడు పాపాత్ములున్నారా స్వామీ?" "లేరు" "ఒకానొక రోజు వాళ్లలో ఒకావిడకు ఎంతకూ తిండి దొరకలేదుట. పాపం, ఆకలికి తట్టుకోలేకపోయింది." "ఊఁ..." "వాళ్లలోనే అదృష్టవంతుడొకడు తిండి సంపాదించాడు. వాణ్ణడిగింది." "ఊఁ..." "వాడిచ్చాడు. ప్రతిఫలమడిగాడు. అయిష్టంగానే అంగీకరించింది." "ఊఁ..." "సృష్టించి, కడుపు మాడ్చి, చోద్యం చూసిన దేవుడే నాకు గురువు." "ఊ..." "మహాపాపమే... దైవకార్యమున్నూ." "ఊ...!?" "నా వాళ్లకు తిండి సంపాదించడానికి, నేను ఇతరులను ఉపయోగిస్తా." "ఊ..." "దేవుడెందుకు చేశాడో!" "...డో!?"

డెబ్బై ఆరేళ్ల బుడుగు

డెబ్బై ఆరేళ్ల బుడుగు తన బాల్యం గురించి చెప్పిన సంగతులు. బాపు-రమణ ద్వయంలోని ముళ్లపూడి వెంకటరమణ రచనల గురించి ఆలోచనకు రాగానే వెంటనే స్ఫురణకు వచ్చే "బుడుగు" ఆయన చిన్నప్పటి ముద్దుపేరు. ఆయన తన బాల్యమును గురించి ఆంధ్రజ్యోతి వారి కోరికమేరకు ఉగాది సంచికకు రాసిన ఇటీవలి రచన చదువుతూ ఉండగా ఒక వాక్యం నన్ను కట్టిపడేసింది. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, ఆస్తులను, ఆడంబరాలమూ కోల్పోయి, అమ్మ చేసే కష్టంతో వచ్చే చాలీచాలని సంపాదనతో చెన్నపట్నం(చెన్నై)లో మొండిగా బ్రతుకు బండిని లాగుతున్న రోజులను ఆయన ఇలా గుర్తుచేసుకుంటారు: "ఇద్దరం పొద్దున్నే ప్రెస్సుకి వెళ్లేవాళ్లం. పొద్దున్న ఏడునుంచి, సాయంత్రం ఏడుదాకా నిలబడి కంపోజింగ్ చేసేది మా అమ్మ. నేను తొమ్మిది గంటలకు స్కూలుకు వెళితే నాకు రెండు ఇడ్డెనలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది. సాయంత్రం నాలున్నరకి వెళితే ప్రెస్సు వాళ్లు ఏదేనా పెట్టేవాళ్లు. మేమిద్దరం తినేవాడిని." -- -- తల్లీకొడుకులిద్దరూ ప్రెస్సువాళ్లు పెట్టింది "తినేవాడు". అంత సేపు నిలబడి పనిచేసిన తల్లి, దొరికిన ఆ కాస్త తిండినీ తాను తిన్నట్టుగాచేసి బిడ్డకే పెట్టే పరిస్థితిని " మ...