పోస్ట్‌లు

వీ-డియో లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

షావుకారులో బహుదూరపు బాటసారి పయనం

నేనింతవరకూ షావుకారు సినిమా చూడలేదు. ఇప్పుడే యూట్యూబులో ఆ సినిమా క్లిప్పింగులు చూస్తూ... జైలు సన్నివేశానికి (రామారావు, నారాయణపాత్రధారి జైల్లో కలిసే సన్నివేశానికి) నేపథ్యంగా 'బహుదూరపు బాటసారీ' హార్మోనియం మీద [@ 4:30 ] విని ఆశ్చర్యానందాలు పొందాను. ఘంటసాల ఈ పాట సాహిత్యమూ, స్వరాలూ రెండూ కూర్చి పాడిన ప్రైవేటు రికార్డింగ్ మాత్రమే విన్నానిన్నాళ్లూ. బహుశా స్వరాలు కూర్చడం అయిన తరువాతే సాహిత్యం కూర్చివుంటాడనుకుంటా.

కవితల విద్యామంత్రి కపిల్

అలవోకగా కవితలు చెప్పగల విద్యామంత్రి మన కేంద్రప్రభుత్వంలో కొలువుదీరి వున్నాడంటే దేశానికిది శుభసూచికగా కనిపిస్తోంది. అదిన్నీ, పొంగిన ఆ కవితలను ఆయన తన జేబువాణి/చరం/సెల్‌ఫోను/మొబైల్‌లో సంక్షిప్తసమాచార(ఎస్సెమ్మెస్)పరిభాషలో రాసుకుంటారట. మంత్రి నోట మంచి భవితకు బాటలు పరచబోతున్నాయనిపించే మాటలు వినవస్తున్నాయి. పదోతరగతి పబ్లిక్ పరీక్షల గోల ఇక ఉండబోదనే మాట వింటున్నానుగానీ, మన విద్యావిధానాన్ని సవరించబోవడంలో మంత్రిగారి దార్శనికత మరియు శ్రద్ధ ఏపాటివో ఈ వీడియో చూశాక కొంత అవగతమయింది. అన్నింటికంటే నన్ను సంతోషపెట్టిన విషయం - పని చేసే మంత్రి ఒకరుండటం. పనిని ఇష్టంగా చేసే మనిషి కావడం. అందులోనూ కవితలు చెప్పగలగడం. మంత్రిగారి పనులకు మంచి అభినందనలే వస్తున్నట్టున్నాయి! ఈ వ్యవహారాన్ని మీరు దగ్గరగా గమనిస్తున్నారా? మాతృభాష ప్రాముఖ్యాన్ని మంత్రిగారు నొక్కిచెబుతున్నారు. బాగుంది. హిందీ కూడా నేర్చుకొమ్మంటున్నారు. ఇది మాత్రం ఇబ్బందిగా వుంది. దీన్ని ఐచ్ఛికం చేస్తే బాగుండును. ఆంగ్లం ఎలాగూ అవసరమే. రాజ్యాంగం అనుతించదుగనుక దేశానికంతటికీ ఒకే విద్యాబోర్డు సాధ్యం కాదంటున్నారు - భిన్నత్వం భారతదేశానికి చాలా ముఖ్యమైనదంటూనే. భాషల వ...

శాసనసభలో ...

ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడొచ్చన్నమాట! ;-)

ప్రపంచపు ప్రకృతేమిటన్నది ...

మన చుట్టూ వున్న ప్రపంచపు ప్రకృతేమిటన్నది తెలుసుకొనే ప్రయత్నం ప్రతి మనిషీ నిరంతరం చేస్తుంటాడనుకుంటా. కొన్ని సందేహాలుంటాయి. కొన్ని మానసికమైన అవరోధాలుంటాయి. కొన్ని శూన్యతలుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ కొన్ని స్వీయ అనుభవాలవల్లా కొందరి మాటలవల్లా ఇవి తొలగుతూవుంటాయి లేదా మారుతూ వుంటాయి. అలాంటి ఒక అనుభవం జయప్రకాశ్ నారాయణ్ మాటలు వింటూవుంటే కలిగింది. ఆయన మాటల్లో నాకు ముఖ్యమైనవనిపించిన కొన్నింటిని వింటూ టైపించాను. వాలుఅక్షరాల(Italics)లో వున్నవి నా అభిప్రాయాలు. 1. దేశం బాగుండాలంటే మనం మహాత్మాగాంధీలం కావాలనుకుంటాం. అక్కర్లేదు. We are ordinary mortals. (దేశము బాగు లాంటి మాటలు వినగానే నా భుజాలమీద ఏదో పెద్ద బరువున్నట్లు మొహంమారకపోతే నేను చంద్రమండలంమీదో అంతరిక్షంలోనో వున్నట్టనిపిస్తుంది తప్ప భూమ్మీదున్నట్టనిపించదు) 2. ఎన్టీయార్ గొప్ప nobility ఉన్న మనిషి. ఆయనలో అవతలిమనిషిలో కాస్త మంచితనం ఉందనుకుంటే ఆదరించే వ్యక్తిత్వమున్నది, అవతలిమనిషిలో ఆత్మగౌరవముంటే దాన్ని గుర్తించే వ్యక్తిత్వమున్నది. (ఎన్టీయర్ వ్యక్తిత్వం గురించి ఈ మాటలు చెప్పినవాళ్లను నేను చూడలేదు - ఆయనతో వ్యక్తిగత పరిచయమున్నవారితో సహా) 3. ఆంగ్ సా...

ఇటీవల నేను చూచిన చిత్రములు

అరుంధతి - గత ఆదివారం చూసిన సినిమా. ఈమధ్య వచ్చిన రొడ్డకొట్టుడు సినిమాలకు ఇది భిన్నమైనది. ఈ సినిమాలో నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. పతలా దబరాను పెద్ద నొక్కుపడేలా బలమైన గరిటెతో వాయిస్తే వచ్చే శబ్దాన్ని ఒకసన్నివేశంలో వినిపిస్తారు కోటి. 'ఇప్పుడు మీరు భయపడాలన్నమాట' అని సబ్ టైటిల్ వేసివుంటే ప్రయోజనం వుండేదేమో. స్టీలు పాత్రల సంగతి వదిలేసి, సినిమాపాత్రల విషయానికొస్తే రొ'టీన్' పాత్రల్లో ఎప్పుడూ కనిపించే అనుష్కకు ఇదో వెరయిటీ. ఇందులో విలను వీరోయినును ఎలా అనుభవించి చంపాలనుకుంటాడో మాటిమాటికీ ఆమెతో చెప్పీ చెప్పీ చెప్పీ చివరికి అనుభవించకుండానే చచ్చిపోతాడు. ఒక అందమైన గుడ్డి నాట్యాచారిణిని పొడుగాటి కత్తితో రెండుపోట్లు పొడిచి, రక్తంలో ఆమె విలవిలలాడుతుండగా విలను ఏకాగ్రచిత్తంతో తనపనేదో తాను చేసుకుంటూ -సుఖపడుతూ పోతున్నావు, పోతూ సుఖపెడుతున్నావు, నీవెంత ధన్యవోకదా- అనే కవితాత్మకమైన డైలాగు చెప్పే దృశ్యం ఈ సినిమాలో హైలైట్. మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రం. గ్రాఫిక్సూ అవీ బాగున్నాయి. సినిమా చివరివరకూ మెదలకుండా చూశాను. ఖర్మ. స్లమ్ డాగ్ మిలియనీర్ - నేనీ సినిమాకు ...

వినాశ కాలే ...

ప్రస్తుతం టెక్సాస్ గుండా ఒక హరికేన్ ప్రయాణిస్తూవుంది. ఈ తెల్లవారుజామున తీరాన్ని దాటిందట. ఈదురు గాలుల వలన పెద్ద ప్రమాదం లేకపోయినా హ్యూస్టన్ మహానగర పరిసరాల్లోని కొన్ని కౌంటీలకు దీని ప్రభావం వల్ల వరదలొచ్చే అవకాశం వుంది కనుక జాగరూకులై వుండండి అని రేడియో, టీవీ, ఇంటర్నెట్టు, బయటర్నెట్టుల్లో నిన్నంతా ఒకటే హోరు. మా కచేరీకి సెలవు ప్రకటించే అవకాశం వుండవచ్చని ఒక అధికారిక వేగు కూడా అందింది. అధికారిక వేగులకు మామూలుగా పట్టే చెత్తబుట్ట యోగం దీనికీ పడుతుందనే అంచనాలతో దాన్నే ఉద్యోగులంతా ఫార్వర్డు చేసుకుని రసీదులు కూడా అందుకున్నారు. నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు మా వాహనమోహన్ నాకు ఫోన్ చేసి, 'రేపటి కోసం తిండీ నీళ్లూ సిద్దం చేస్కున్నావా' అన్నాడు. "మరీ అంత 'యమ'ర్జన్సీ అంటావా?" అన్నాను. "ఏమో ఎవరు చూశారు! మంచినీళ్లు, చిరుతిళ్లు మాత్రం కొని దగ్గరపెట్టుకో. కావాలంటే నేనే కొంటా నీకోసం. ఇప్పటికే వాల్‌మార్టు, ఫియెస్టాల్లో మంచినీళ్ల బాటిళ్లు, కేన్లు మాయమయ్యాయి. గ్యాస్ స్టేషన్లలో చిన్నచిన్న క్యూలు తయారైనాయి. ఈ రాత్రికి బాగా వాన పడుతుందంటున్నారు. రెండ్రోజుల పాటు కరంటు పోయినట్లు వూహించు,...

... చినమాయను పెనుమాయ ...

మా ఇంటికి ఫోను చేసి మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో పక్షుల అరుపులు వినబడుతూ వుంటాయి. పిట్ట యెంతదైనా కూత మాత్రం ఫోన్లో ఘనంగా వినబడుతూ వుంటుంది. మామిడి చెట్ల మింద వాలే చిలకలు, కోకిలలు, పుల్లాచెదలు, గోరింకలు, కాకులు, చిన్నచిన్న గువ్వల శబ్దాలు ఎంత బలంగా వినిపిస్తుంటాయంటే ఒకోసారి 'యినబళ్ల్యా!' అనాల్సుంటుంది. పదోతరగతి దాకా ప ల్లె ల లోనే చదువుకోవడంతో చెట్లు, పుట్టలు, పిట్టలు మనకు కొత్త కాదుగానీ ఆ తరువాత దూరం పెరిగిపోయింది. ఇదిగో ఈ కిందున్న వీడియోలో కనిపించే నలభై ఎకరాల చెఱువు చుట్టూ కూడా రెండు బారల పొద్దెక్కే దాకా రకరకాల పక్షుల శబ్దాలు వినపడుతూ వుంటాయ్. వీలు కుదిరినప్పుడల్లా పొద్దున్నే బయల్దేరి నూరు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ చెఱువును చేరి చుట్టూ ఒక సారి నడవడం నాకొక అలవాటుగా తయారవుతూ వుంది. ఇది ఆరోసారి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ వారాంతంలో వెళ్లిపోదామనిపిస్తుంది. పెద్దగా జన సంచారం వుండకపోవడం ఒక కారణం. ఉదయమే అక్కడకి చేరుకుంటే పక్షులు, నీటి జీవాలు చేసే శబ్దాలతో భలే సందడిగా వుంటుందీ ప్రాంతం. స్థూలంగా చూస్తే పెద్దగా ఏమీ కనిపించదు. గమనించే కొద్దీ చిన్నచిన్న విషయాలే విశేషాలుగా కనిపిస్తుంటాయి. ఇం...

ఆడదాని ఫార్ములా!

-- డాక్టర్రాజు : -) వేమనయోగి కూడా చెప్పలేని వేదాంత సారం!

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

వెంకట్ సిద్ధారెడ్డి బ్లాగులో జరిగిన చిన్నపాటి చర్చకు నా అభిప్రాయాన్ని వీలైనంత బలంగా చెప్పే ప్రయత్నం ఈ టపా. అంతే కాకుండా, ఈ వీడియో చివరలో మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓలేటివారి స్వరకల్పన... దివ్యం! అనగా దివినుంచి జాలువారినది అని తాత్పర్యం. నేనొక ఇరవైమార్లు విని, అందరూ మళ్లీమళ్లీ విని ఆనందించాలనే సదుద్దేశంతో యూట్యూబుకు చేర్చాను. [ఇది ముమ్మాటికీ కాపీహక్కుల ఉల్లంఘనే. మాటీవీ వాళ్లు నామీదకు యుద్ధానికి రారని ఆశిస్తున్నాను. :)]

1978 - 1979

చిత్రం: ధర్మయుద్ధం (1979) ఇసై: జ్ఞాని గానం: జానకి, మలేసియా వాసుదేవన్