పోస్ట్‌లు

ట్రావెలాగుడు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

... చినమాయను పెనుమాయ ...

మా ఇంటికి ఫోను చేసి మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో పక్షుల అరుపులు వినబడుతూ వుంటాయి. పిట్ట యెంతదైనా కూత మాత్రం ఫోన్లో ఘనంగా వినబడుతూ వుంటుంది. మామిడి చెట్ల మింద వాలే చిలకలు, కోకిలలు, పుల్లాచెదలు, గోరింకలు, కాకులు, చిన్నచిన్న గువ్వల శబ్దాలు ఎంత బలంగా వినిపిస్తుంటాయంటే ఒకోసారి 'యినబళ్ల్యా!' అనాల్సుంటుంది. పదోతరగతి దాకా ప ల్లె ల లోనే చదువుకోవడంతో చెట్లు, పుట్టలు, పిట్టలు మనకు కొత్త కాదుగానీ ఆ తరువాత దూరం పెరిగిపోయింది. ఇదిగో ఈ కిందున్న వీడియోలో కనిపించే నలభై ఎకరాల చెఱువు చుట్టూ కూడా రెండు బారల పొద్దెక్కే దాకా రకరకాల పక్షుల శబ్దాలు వినపడుతూ వుంటాయ్. వీలు కుదిరినప్పుడల్లా పొద్దున్నే బయల్దేరి నూరు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ చెఱువును చేరి చుట్టూ ఒక సారి నడవడం నాకొక అలవాటుగా తయారవుతూ వుంది. ఇది ఆరోసారి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ వారాంతంలో వెళ్లిపోదామనిపిస్తుంది. పెద్దగా జన సంచారం వుండకపోవడం ఒక కారణం. ఉదయమే అక్కడకి చేరుకుంటే పక్షులు, నీటి జీవాలు చేసే శబ్దాలతో భలే సందడిగా వుంటుందీ ప్రాంతం. స్థూలంగా చూస్తే పెద్దగా ఏమీ కనిపించదు. గమనించే కొద్దీ చిన్నచిన్న విషయాలే విశేషాలుగా కనిపిస్తుంటాయి. ఇం...

ఒక ట్రావెలాగుడు - చివరి టపా

చిత్రం
తట్టాబుట్టా సర్దుకొంటుండగా , ఒక రేంజరు మమ్మల్ని చూసి, "సర్దుకొని వెళ్తున్నారా?" అన్నాడు. మేం ఔననగానే, "ఎక్సలెంట్ డెసిషన్! డ్రైవ్ సేఫ్" అని సాగనంపాడు. తిరుగు ప్రయాణంలో కొన్ని దృశ్యాలు - 385 జాతీయ రహదారి I-10 మొత్తానికి ప్రధాన రహదారిమీదకు వచ్చి పడ్డాం. పొద్దున్నుంచీ ఏమీ తినకపోవడంతో ఒకటే నకనక. మంచి భోజనం చెయ్యాలని సరైన భోజనశాల కోసం ప్రయత్నిస్తే ఏ కారణం చేతనో అన్నీ మూతబడి వున్నాయి. బహుశా మంచువల్ల కావచ్చు. "బర్గర్ కింగ్" - అని ఒకే ఒకటి కనిపించింది. (పోకిరి సినిమా గుర్తుకువచ్చిందా?) ఇది చెత్త తిండి, వద్దనుకుని టౌను మొత్తం ఒక చుట్టు చుట్టినా ఏమీ కనబడలేదు. "బర్గర్ కింగ్" పక్కనే "డైరీ క్వీన్". అదీ అలాంటిదే. ఆకలికి తాళలేక అయిష్టంగానే అందులో చొరబడ్డాం. కాసింత చెత్త తిన్నాక నాకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. మిగతా ముగ్గురూ ఇంకా ముఖాలు వేళ్లాడేసుకునే వున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్లను నవ్వించాలి. మిత్రులాగా, "బర్గరుకింగూ, డైరీక్వీనూ" పక్కపక్కనే వుండటం కేవలం యాదృచ్ఛికమేనంటారా? ఆని కన్ను గీటాను. చిరునవ్వులు మెరిశాయి. పైగా రాజ్యం క్లిస్ట పరిస...

ఒక ట్రావెలాగుడు - ఎనిమిదవ టపా

చిత్రం
వర్షం కొద్దిగా తగ్గింది . రేంజరు బండిని మెల్లగా నడుపుతున్నాడు. సన్నని తుంపర్లు ట్రక్కు యొక్క విండ్‌షీల్డు (గాలి డాలు!? ) మీద పడి, గడ్డకట్టాలా వద్దా అని నిర్ణయించుకొనేలోగా వైపర్లు వాటిని విసురుగా తోసేస్తున్నాయి. పక్కనున్న ముసలి ఆఫీసరు చెబుతున్నాడు - "నేను వచ్చేటప్పుడు ఇంకా మెల్లగా వస్తున్నాను, 20-25mph లో, ఒక కారు చాలా వేగంగా నన్ను దాటి సర్రున వెళ్లిపోయింది. తరువాతి మలుపులో అది రోడ్డుపక్కకు జారిపోయి కనబడింది. ఆ కారు నడిపేవానికి తగిన శాస్తే జరిగింది. అలా జరుగుతుందని నేనూహించాను." ఈ మాటలు చెప్పడానికి ఆయనకు ఐదునిముషాలు పట్టింది. కారణం - ట్రక్కులోని వాకీటాకీ మాటిమాటికీ ఏదోవొకటి టాకుతుండటమే . వాటిని జాగ్రత్తగా వింటూ కొన్నింటికి సమాధానం చెబుతూ వస్తున్నాడు రేంజరు. ముసలి ఆఫీసరు మాటకు ఎవ్వరి నుంచీ స్పందన రాలేదు. రేంజరు తన వ్యక్తిగత మొబైల్ ఫోనులో సిగ్నలుందేమోనని మాటిమాటికీ చూసుకొంటున్నాడు. అడక్కుండానే చెప్పాడు - "నా భార్యతో మాట్లాడాలి. ఈరోజు ఇంటికెళ్లేసరికి తెల్లవారుఝాము అవుతుందని చెప్పాలి. హైకర్లందరూ సురక్షితంగానే గమ్యాలకు చేరుకున్నారట. ఛాపర్ల అవసరం రాలేదు." ఒక చోటికి చేరగానే...

ఒక ట్రావెలాగుడు - ఏడవ టపా

" మీకిష్టమైనంత సేపు " అంటే మరో మూడుగంటలే. మేం తొడుక్కున్న పాదరక్షల్లోకి (Shoes) మంచునీళ్లు చేరడంతో పాదాల్లో వేళ్లను కొరికేస్తున్నట్టున్న చలి. ముందుగా ఒక కాఫీ కొనుక్కుని తాగాం. మా గొడవలో పడి గమనించలేదుగానీ ఆ అంగడిలో వున్న జనాలందరూ ఆదుర్దాగానే వున్నారు. కొండలెక్కడానికి వెళ్లి మంచులో చిక్కి తిరిగిరాని తమ సహచరుల గురించి కొందరు ఆందోళన పడుతున్నారు. కొందరు రష్యనులు మాత్రం తమ తోటివారు తిరిగిరానందుకు ఏదో రాక్షసానందాన్ని అనుభవిస్తున్నట్టున్నారు. అప్పటికే చీకటి పడిపోతోంది. మరికొంత సేపట్లో ఆ అంగడి మూతబడుతుంది. మేం ఆలోచించాం. మా మిగతా ఇద్దరు మిత్రులూ ప్రస్తుతం ఎక్కడున్నారో, యే పరిస్థితిలో వున్నారో తెలీదు గనుక వారికోసం ఎదురుచూడటం అవివేకం. ముందుగా మేము స్థిమితపడిన తరువాత మిగతా విషయాలు ఆలోచించవచ్చునని, కొద్ది దూరంలోనే ఒక పూటకూళ్ల ఇల్లు వుందికదా, అక్కడికి వెళ్దామనుకున్నాం. అంగట్లో వున్న ముసలావిడను వివరాలడిగాం. అందులో తలదాచుకోవాలంటే ప్రస్తుతానికి కష్టమే కానీ ప్రయత్నించమని గదినమోదుకేంద్రానికి దారి చూపింది. అంగట్లోనుండి బైటపడి ఒక్క పరుగులో అక్కడికి చేరాలని తలుపు తెరిచాను. బయటనుండి చల్‌ల్లని గాలి...

ఒక ట్రావెలాగుడు - ఆరవ టపా

చిత్రం
ఇద్దరూ అందంగా వున్నారు . మా ఆశాదీప్ కంటే బలంగా వున్నారు. ఉన్నట్టుండి గాలి వీచింది. కొమ్మలపైనుంచి నీటి చినుకులు టపటపా రాలాయి. వాళ్లిద్దరూ ఒకేసారి కెవ్వుమన్నారు. మామూలు కన్నా కొంచెం ఎక్కువ కెవ్వు అది. తరువాత బిగ్గరగా గిగిల్ గిగిల్ అని ఆంగ్లంలో నవ్వారు. ఆ నవ్వులో పలకరింపు కూడా కలిసి వుంది. చిన్న పలకరింపు తరువాత అడిగాం, సౌత్‌రిమ్ నుంచా ఎమొరీపీక్ నుంచా? అని. "ఎమొరీ నుంచి. మీరు రిమ్ముకా, పీక్‌కు వెళ్తున్నారా?" "ఎమొరీకే." "మీరేదైనా అడవి జీవాన్ని చూశారా?" అడిగారు. "దుప్పి తప్ప ఇంకేమీ కనబడలేదు. మీకేమైనా..?" "మాకూ అంతే. అంతకుమించి కనబడకపోవడమే మంచిదేమో. హిహీ." "హహ్హ, మాకూ ఇప్పుడే అర్థమౌతోంది మేము సరిగా సంసిద్ధం కాకుండా వచ్చామని." "జాగ్రత్తగా వెళ్లిరండి" "థాంక్యూ" ఇప్పటివరకూ దారిలో కనబడిన ప్రతివాళ్లూ "జాగ్రత్త" అనే మాటనే మాడుతున్నారు. క్షేమంగా వెళ్లిరండి అంటే సందేహించాల్సిన పని లేదు గానీ జాగ్రత్త అనేటప్పటికి మళ్లీమళ్లీ అనిపిస్తోంది - మనమేమైనా మూర్ఖంగా ముందుకుపోతున్నామా అని. ఇంకో సంగతేమిటంటే అందరూ ఎదురొచ్చేవాళ...

ఒక ట్రావెలాగుడు - ఐదవ టపా

చిత్రం
ఈ మారు పెద్దావిడ చెప్పింది - "వద్దు. వద్దు. నన్నడిగితే వద్దంటాను." చూశావా అన్నట్టుగా చూశారు మిత్రులిద్దరూ. పక్కకు పిలిచి చెప్పాను, ఇందాక ఆ పెద్దాయన ఏమన్నాడో. అంతలో ఆశాదీపం నాదగ్గరకొచ్చి "మనం మాత్రం వెళ్తున్నాం, ఏమంటావు", అన్నాడు. 'అదిరా మొనగాడు' అనిపించింది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ మాత్రం రిస్కున్న పని చేయడంలో వున్న మజా కోసమే నేను ఇంత దూరం రావడం. వెంటనే వాహనంలోకి వెళ్లి వీపుమూట ను సిద్ధం చేసుకుని బయల్దేరాం. నా అత్యుత్సాహాన్ని గమనించిన పితామహ అన్నాడు - "పంతం పట్టినట్టు అలాగే ముందుకు వెళ్ళకండి. వెనక్కి మళ్లవలసివస్తే వెనక్కు మళ్లండి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి." అనే మాటలతో మనసు దోచాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకొన్నాను. సరేనన్నాను. సాయంత్రం మూడున్నర-నాలుగు గంటలకల్లా మేము బయలుదేరుతున్న ప్రాంతానికి తిరిగి రావాలనీ, ఆలోగా ఇతర ప్రాంతాలను చూడటానికి వాళ్లిద్దరూ వాహనంలో వెళ్లి, మాకోసం తిరిగి రావాలనీ నిర్ణయం జరిగింది. 'కడసారిది వీడ్కోలు - కన్నీటితొ మా చేవ్రాలు' టైపులో మాకు ఒళ్లు జలదరించే వీడ్కోలు అందింది. మాది మూర్ఖత్వమా అని మళ్లీ ఒకసారి అనిపించిం...

ఒక ట్రావెలాగుడు - నాల్గవ టపా

చిత్రం
ఆ కథలో ఒక రాజభక్తుడిని రాజద్రోహిగా పొరపాటుబడి శిక్ష విధిస్తారు ప్రభువులు. ఒక దబ్బనపు మొనపైన ఒక ఘడియ సేపు వెల్లకిలా పడుకోబెట్ట వలసిందిగా శిక్ష. అప్పుడు పక్కనే వున్న మంత్రి కలగజేసుకొని ప్రభువులతో - మహారాజా, ఈ రాజద్రోహిని ఒకటి కాదు పదివేల దబ్బనాల మీద పడుకోబెట్టాలి, అంటాడు తెలివిగా. రాజు అలాగే నంటాడు. పదివేల దబ్బనాలు నిలువుగా నాటించి వాటిపైన పడుకోబెట్టించి రక్షించుకొంటాడు. ఇందులోని సెన్సు, సైన్సు మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనిపిస్తే భీష్మపితామహుణ్ణి అడగాలి ఈ ఛాయాచిత్రానికి 'కంపశయ్య' అనే పేరెలావుందో. ఆయన కూడా 'అచ్చు' ఇలాంటి దాని పైనే శయనించాడట కదా. ఆ సాయంత్రానికి ఛీసోస్ బేసిన్‌ చేరుకున్నాం. ఆరోజు పెద్దగా ఏమీ చెయ్యకుండానే సాయంత్రమైపోయిందని నాకు నిరాశగా అనిపించింది. అసలు ఉదయాన అందరూ తయారై తెమిలేటప్పటికే మధ్యాహ్నమైనట్లయింది. అయితే అక్కడొక అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడబోతున్న సంగతి నాకు తెలియదు. ప్రకృతి ఛీసోస్ పర్వతాలతో ఒక చిత్రమైన కిటికీ లాంటి ఏర్పాటు చేసినట్లుంది. ఆ కిటికీలో నుండి సూర్యకిరణాలు ఏటవాలుగా ప్రసరిస్తూ ఒకో పర్వతాన్ని నిముషానికొక రంగులో వెలిగిస్తూ దాదా...

ఒక ట్రావెలాగుడు - మూడవ టపా

చిత్రం
చీకటి పడుతుండగా గుర్తొచ్చింది ఆరోజు మధ్యాహ్నం మేమేమీ తినలేదని. కడుపులకు ఇంత ద్రోహం చేశామని తెలిశాక అందరం సామూహికంగా పశ్చాత్తాపం చెంది, మాంఛి గాఠ్ఠి భోజనం దట్టించాలనుకున్నాం. ముందుగా వేడివేడిగా ఒక సూపు తాగాం. మా వాహనమోహనపితామహగారు వెంటనే బండ్లోంచి టమోటాలు, ఉల్లిపాయలూ, మిరపకాయలూ తీసి గబగబా తరిగేసి, గడగడా వణుకుతూ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి లాగా 'నాయినాహ్.. ఈ చలికి ఇక్కడే వుంటే..ఎంతోసేపు బతకన్నాయనాహ్, నే బోతున్నా..., నాయినాహ్' అంటూ బండెక్కాడు. హోరుమని గాలి. గ్యాస్‌ స్టవ్ వెలిగించి మిగతా ఇద్దరూ గాలి చొరకుండా అడ్డునిలువగా, నేను ఒక గిన్నెలో కాస్త మంచినూనె పోసి, పితామహా తరిగిన ముక్కలన్నీ ఒక్కసారిగా దాంట్లో పడేసి ఉప్పు వేసి చాలాసేపు ఉడికించి వేడివేడి టమోటాబజ్జీ చేశాను. అదేవూపులో టోటిల్లాలనబడే చపాతీలను వేడిచేస్తూండగా ఒక్కొక్కరూ ఐదైదు తినేశారు. చివరగా నేను. నాకోసం పితామహా వడ్డించాడు. వేడివేడి టోటిల్లాల్లోకి టమోటా బజ్జీని చూడగానే నాకు నోరూరింది. కానీ చాలా చల్లగా అయిపోయిందది. అంతే కాదు, తియ్యగా కూడా అయిపోయింది. ఏమయ్యా సంగతి అని ఆరాతీస్తే, మా యువరాజులుంగారు ఉప్పు డబ్బాలో చక్కెర దట్టించి తీ...

ఒక ట్రావెలాగుడు - రెండవ టపా

చిత్రం
దాంతో వారి జీవితాలు దుర్భరమయ్యాయట. వాళ్లమ్మే వస్తువులను కొనడం చట్టరీత్యా నేరమని అమెరికా ప్రభుత్వం ప్రకటించడంతో సందర్శకులు చొరవగా కొనలేకపోతున్నారు. అయినా ఇప్పటికీ పెద్దగా నీళ్లు పారని కొన్నికొన్ని చోట్ల నడిచి నదిని దాటి వస్తుంటారు మెక్సికన్లు. వచ్చి అక్కడున్న సందర్శకులతో 'ధర్మం చేస్తే పుణ్యఁవొస్తది - కర్మ నశిస్తది బాబూ' అంటూ చేయిజాచి అడుగుతారు. రాగి తీగతో తయారు చేసిన తేలు, మండ్రగబ్బ, కుర్చీ, తాబేలు, పీత లాంటి బొమ్మలను ఇలాంటివాటిని సరిహద్దు ఈవల చెట్లకింద పెట్టి ఒక హుండీపెట్టి "తమ దయ-మా ప్రాప్తం" అనే భావం కలిగించేలాగ వాళ్లకొచ్చిన ఆంగ్లంలో ఏదో రాసిపెట్టి వెళ్లిపోతారు. నదికి ఆవలి ఒడ్డున ఒక మెక్సికో యువకుడు మోకాళ్లమీద కూర్చొని వెదురుటోపీ పెట్టుకొని ఆ టోపీపై ఒక చేయి పెట్టి కిందికి చూస్తూ నిలబడివున్నాడు. మేమక్కడున్నంత సేపూ వాడు కదలనే లేదు. అదే భంగిమలో వున్నాడు. దారిద్ర్యంలో మనిషి మనఃస్థితి ఎలా వుంటుందో నాకు కొంత తెలుసు. ఆ గ్రామస్తులను తలచుకుంటే మా సంగతులు చాలానే మనసుకొచ్చినాయ్. మా పల్లెల్లో బిడ్డలను సరిగా చదివించనూ లేక, చేసే సేద్యమూ గిట్టుబాటు కాక, ఈ ఎడారిలో చలికాలానికీ ఎండకా...

ఒక ట్రావెలాగుడు - మొదటి టపా

చిత్రం
అంత వరకూ "ఎడారి" అనే పదం వినబడగానే యేండ్ల తరబడి వానల్లేక ఎండిపోయిన ఇసుక పర్ర కనుచూపు మేర పరచుకొని వున్న దృశ్యం మనసులోకి వచ్చేది. ఇంటర్మీడియట్‌లో వుండగా రంగీలా సినిమా వచ్చింది. మా బ్యాచ్ మొత్తం ఒక ఆదివారం టౌన్లోకి వెళ్లాం. పోస్టర్లు, కటౌట్లు చూశాం. అది తెలుగు సినిమా కాదని తెలిసింది. అప్పుడు నాకు హిందీ రాదు. ఇప్పుడొచ్చునా అనేది అప్రస్తుతం. ఆ చిత్ర దర్శకుడు తెలుగువాడని తెలిసింది. "కళారాధనకు భాష ఒక అడ్డుగోడ కాకూడదని" అక్కడికక్కడే పోస్టర్ల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం జరిగిపోయింది. మాలో చానామందికి హిందీ రాకపోయినా సరే థియేటరుకు వెళ్లి చూశాం. ఎక్కడున్నాం? ఆఁ... ఎడారి. ఎడారి అనగానే "తేరీ.... ఎయ్ సీ అదా పే... తో ఫిదా హమ్ హై ..." పాటలో చూసిన ప్రాంతాలు మనసులోకి వచ్చేవి (మెలకువలో మాత్రమే కాదు). ఇంటర్మీడియట్‌లో వుండగానే బోటనీ అనబడు వృక్షశాస్త్రములో ఎడారి మొక్కల గురించి చదువుకొన్నాం. వీటిలో సైకస్ చెట్టు ఒకటి. కానీ అక్కడ చదివినవాటిలో నాగజెముడు , బ్రహ్మజెముడు , తంగేడు , తుమ్మ , ఈత, తాటి ఇట్లా చాలా వరకూ చెట్లను వీరబల్లె చుట్టుపక్కలలోనే చూసివుండటం చేత "పాపం ఎడారి మొక్క...