పోస్ట్‌లు

హృదయభాను లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం

వేదాల్లో సైన్సును వెతకండిగానీ సైన్సులో వేదాలను వెతక్కండన్నాడొక పెద్దాయన. అది చేతకానప్పుడు ఇదైనా చెయ్యాలిగదా? ఇప్పుడు నేను చెయ్యబోతున్నది ఆలాంటిదే. 2009 ఫిబ్రవరిలో కొత్తపాళీగారి బ్లాగులో "స్థితప్రజ్ఞత" అనే టపా వచ్చింది. అందులో ముఖ్యమైనదిగా నాకు తోచిన వాక్యం - "క్రమశిక్షణతో కూడిన ఒక వైరాగ్యాన్ని పెంపొందించుకో గలిగితే తదనుగుణంగా మన అంతశ్శక్తిని నిక్షేపించుకుని, దాచుకుని, అంతిమంగా కీలకమైన లక్ష్యసాధనకి వినియోగించుకోవచ్చు." 2010 ఫిబ్రవరి వచ్చాక చూసుకుంటే, గడచిన యేడాది కాలంలో క్రమశిక్షణ లేదు. వైరాగ్యం లేదు. ఇవి రెండూ లేకపోవడంవల్ల అంతశ్శక్తీ లేదు. కనీసం, అంతిమంగా కీలకమైన లక్ష్యం యేమిటో తెలుసునా అంటే అదీతెలీదు. క్రమశిక్షణా అంతశ్శక్తీ ఎంతోకొంత తిరిగి సాధించినా, లక్ష్యం ఏమిటో తెలీడంలేదు. నా లక్ష్యం ఏమిటో మీకేమైనా తెలుసా? అని ఎవరినయినా అడిగితే బాగుండదేమో. ఇంతకూ, మీకు అంతిమంగా కీలకమైన లక్ష్యం ఏమిటి? A. నాకు తెలీదు B. ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు C. అక్కర్లేదు నా కిలాగే బాగుంది D. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా E. ప్రతిరోజూ క్రమశిక్షణనూ, అంతశ్శక్తినీ సాధించడమే F. సృష్టికార్యంలో ఆ ప...

సత్యాసత్యాలు

కృష్ణా...! సత్యా...! ఎప్పుడూ యిలాగే నీతో మాట్లాడుతూ వుండాలనుంది ఆహాఁ! నీకూ అలాగే అనిపిస్తోందా? బానే వుంటుంది.. కానీ.. కానీ? ఈరోజు కుచేలుడొస్తున్నాడు, స్టేషనుకెళ్లి వాణ్ణి రిసీవ్ చేసుకోవాలి అంటే నాతో మాట్లాడటం కుదరదా కృష్ణా? వాణ్ణి స్టేషనుకు అంకితమివ్వడం యేంబాగుంటుంది సత్యా పాపం బీదవాడు కుచేలుడొచ్చి నీదగ్గరుండిపోతే నాతో మాట్లాడలేవేమో కదా? (మనసులో) ఎందుకుమాట్లాడలేనూ అని బుకాయిస్తే నమ్మదు. (బయటకు) వీలైనప్పుడల్లా మాట్లాడతాను వీలు కుదరకపోతే లైటా? (మనసులో) అంతేకదా మరి! (బయటకు) వీలు కుదరకపోయినా మాట్లాడతాను. ఎలా మాట్లాడతావు? (మనసులో) వీలుకాకపోతే ఎలా మాట్లాడతాడు యెవడైనా? నా బొంద@$#%* (బయటకు) అదంతా నీకెందుకు నేను మాట్లాడతాను! సరే కృష్ణా, స్టేషనుకు క్షేమంగా వెళ్లిరా! (యేడవలేక నవ్వే మొగంతో) అలాగే సత్యా *** కొంత కాలం తరువాత *** (కృష్ణుడు మొబైల్ ఫోన్ తీసి 16 మిస్డ్ కాల్స్ చూశాడు. 15 సత్య నుంచే.) హలో సత్యా .. ఇప్పటికి వీలు కుదిరిందా కృష్ణా లేదు సత్యా, కుదరకే చేశాను పరాచికాలా? ఎన్నిసార్లు కాల్ చేశానో చూసుకున్నావా? వీలు కుదరినప్పుడు చేద్దామనుకున్నాను. కానీ కుదిరేలా కనబడలేదు. మరిప్పుడెలా చేశావు? కష్టమను...

మినీ మీనాక్షి

గత ఆరు వారాల్లో ఐదుసార్లు వెళ్లాను దేవళానికి. ఇప్పుడు మనం కలసిమెలసి తిరగడానికి దొరికిన సావాసగాళ్లు భక్తులయిరి. దేవళాలకు పోకూడదని నియమమేదీ లేదుగానీ, గత ఆరు వారాలు మినహాయిస్తే అంతకు ముందు ఐదేళ్లలోనూ మొత్తం కలిపితే ఐదుసార్లకు మించి దేవళానికి వెళ్లివుండనేమో. గుళ్లో ఆహ్లాదకరంగా గాలి వీస్తూ వుంటుంది. జనం ఎక్కువగా వుండరు. ఆ మెట్ల మీద కూర్చుని వుంటే హాయిగా వుంటుంది. దేవుళ్లవిగ్రహాల ముందు నిలబడే సమయం కంటే ఆ ఆవరణంలో మెట్లమీదే నేను ఎక్కువ సమయం గడిపాను. ఈ ఐదుసార్లలో రెండోసారి దేవళానికి పోయినప్పుడు చిన్న తమాషా జరిగింది. వెళ్లగానే కాళ్లూచేతులూ కడుక్కొని, ముందుగా వినాయకుని విగ్రహం ముందు నిముషం పాటు నిలబడి చేతులు కట్టుకుని కండ్లు మూసుకున్నాను. ఒక గంటసేపు మంచి నిద్రపట్టినప్పుడు కలిగే హాయి కలిగింది. మళ్లీ రెండుసార్లు వెళ్లినప్పుడు అక్కడే నిలబడితే అలాగే అనిపిస్తుందేమోనని చూశాను. అనిపించలేదు. ఐదోసారి జనం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నేనసలు దేవుళ్లవిగ్రహాలజోలికే పోలేదు. పాలరాతి రాధాకృష్ణులకు పక్కగా ఒకమూల మెట్లమీదే కూర్చుండిపోయాను మావాళ్ల దర్శనాలు, దండాలు, దక్షిణలు, ప్రదక్షిణలు పూర్తయిందాక. విగ్రహాలకు ఇనుపకడ...

పులి

ఇంకో ఇరవైనిముషాల్లో... ఇంకో పది నిముషాల్లో హెలికాప్టర్ దిగిన చోటికి చేరుకుంటున్నాం అన్నారు. గంట గడిచింది. అసలు సమాచారం చెప్పడం లేదు. బహుశా భద్రతాకారణాలేమో, ఈ పాటికి హైదరాబాదు చేర్చేసి వుంటారు అనుకున్నాను. నేరుగా రాజశేఖరరెడ్డి నోటెమ్మటే, ఏమి జరిగిందో కుశాలగా వినొచ్చుననుకున్నాను. తరువాత అంతా తల్లకిందులు. వార్త వినగానే కళ్లెమ్మట నీళ్లు. అత్యంత ఆత్మీయుల మరణం కూడా నాతో ఇంత సులభంగా కన్నీళ్లు పెట్టించలేదు. నా బాధను సరిగ్గా అర్థం చేసుకోగల మనుషులతో వెంటనే మాట్లాడాలని తొందర కలగలేదు. మరిప్పుడెందుకు? నా అంచనా తప్పినందుకేనా? నా సన్నిహితుడేమీ కాడే? పత్రికల్లో సెజ్ నిర్వాసితుల కథనాలు చూసి చూసి కడుపు మండినవాణ్ణే నేను, హెలికాప్టర్ దొరికిందనగానే సంబరమెందుకు? అవినీతి, అధికార దుర్వినియోగం అనే మాటలను పత్రికలలో ప్రతిరోజూ చూస్తూనే వున్నానే, రాజశేఖరరెడ్డి మాట్లాడితే చూద్దామని అంతగా ఎదురు చూడటం ఎందుకు? ఇంక మాట్లాడడని తెలియగానే కండ్లు చెమర్చడమెందుకు? ఇరవైయ్యేళ్ల నాటి సంగతి. ఆ దినము, వీరబల్లె వీధుల్లో తలెత్తి ఎక్కడజూసినా తెల్లటి గుడ్డల మీద నీలంరంగు చేతిరాతలు. ఆ రాతల్లో నాకు బాగా గుర్తున్నవి: "స్వాగతం సుస్వ...

సాయం సమయం సెక్సు

'తెలుగుతో పాటు ఇంగ్లీషు చందమామ కూడా చదవండ్రా, మీ ఇంగ్లీషు మెరుగవుతుంద'ని ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల (ముక్కావారిపల్లె) లో మా ఆంగ్ల గురువు చెప్పారు - సెలవులకు ముందు. ఆమె సలహాను మరిచిపోకుండా రాజంపేటలో బస్సు మారేముందు చందమామలు కొన్నాను. తెలుగు చందమామను బస్సులో చదివితే వాళ్లూవీళ్లూ అడుగుతారని సంచిలో దాచిపెట్టి, ఇంగ్లీషు చందమామను హస్తభూషణంగా అలంకరించుకొని, రాయచోటి బస్సులో కూర్చున్నాను - దానిజోలికీ దాన్నిచదివే నా జోలికీ ఎవరూ రారని. ఆ ఇంగ్లీషులో కథ చదవడం చాలా కష్టంగా వుంది. బొమ్మలన్నా ఒకసారి చూద్దామని పేజీలు తిప్పుతూ, ఒక బొమ్మను చూసి ఆగిపోయాను. ఆ బొమ్మ వెనుక కమామీషు ఏమిటో కనుక్కుందామనే బలమైన కుతూహలం కలిగింది. ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద రాతిని దొర్లించాలని శ్రమపడుతుంటాడు, ఆ రాయి కదలదు. ఇదంతా ఆ పిల్లవాని తండ్రి చూస్తూవుంటాడు. ఇదీ ఆ బొమ్మ. దాని పక్కన నాలుగే నాలుగు ఇంగ్లీషు ముక్కలున్నాయి. "నిజంగా నువ్వు నీ బలాన్నంతా ఉపయోగిస్తే, ఆ రాయి కదులుతుంది" "నాకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను" "లేదే! నీ పక్కనున్న మనిషి సాయాన్ని నువ్వు అడగనేలేదే! సమయం వృధా చేస్తున్నావు." ...

ఇటీవలి కాలంలో నాకు నచ్చిన కథ

అరగంట ముందు ఒక కథ చదివాను ఆంధ్రజ్యోతి[ఆదివారం అనుబంధం]లో. మీరు ముందు కథను చదివిరండి . కిందున్న రెండుముక్కలూ చదవాలనిపిస్తే ఆ తరువాతెప్పుడైనా చదవొచ్చు. ఒక్కసారి చదివిన వెంటనే నాకే మనిపించిందంటే: అందమైన మాండలికంలో సరళంగా సాగిన కథ. చిరకాలం గుర్తుండే కథ. స్వయంగా బతకగల నేర్పు, స్వేచ్చగా బతకాలనే ధీమా కలిగివుండటమే మనిషికి మొట్టమొదటి సంప్రదాయం కావాలి. అప్పుడే సాంగ్యాలూ, పండగలూ, పర్దాలూ మనిషికి సంతోషాన్నిస్తాయి. ఆ నేర్పూ ఆ ధీమా లేకపోతే సంప్రదాయాలే సంకెళ్లవుతాయి. ఈ కథలోని జేజికి ఆ ధీమా వుంది. ఆమె సొంతంగా బతగ్గలిగింది. అంత ధీమా ఆమె కొడుకుకు లేకపోయింది. ఇక మనవరాలికి ఎలా వస్తుంది?! తమకాళ్లమీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించడమే కదా తల్లిదండ్రులు పిల్లలకివ్వగలిగిన బహుమతి?! మళ్లీ చదివితే మరిన్ని పార్శాలు కనిపిస్తాయా కథలో. ఔనంటారా?

ప్రపంచపు ప్రకృతేమిటన్నది ...

మన చుట్టూ వున్న ప్రపంచపు ప్రకృతేమిటన్నది తెలుసుకొనే ప్రయత్నం ప్రతి మనిషీ నిరంతరం చేస్తుంటాడనుకుంటా. కొన్ని సందేహాలుంటాయి. కొన్ని మానసికమైన అవరోధాలుంటాయి. కొన్ని శూన్యతలుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ కొన్ని స్వీయ అనుభవాలవల్లా కొందరి మాటలవల్లా ఇవి తొలగుతూవుంటాయి లేదా మారుతూ వుంటాయి. అలాంటి ఒక అనుభవం జయప్రకాశ్ నారాయణ్ మాటలు వింటూవుంటే కలిగింది. ఆయన మాటల్లో నాకు ముఖ్యమైనవనిపించిన కొన్నింటిని వింటూ టైపించాను. వాలుఅక్షరాల(Italics)లో వున్నవి నా అభిప్రాయాలు. 1. దేశం బాగుండాలంటే మనం మహాత్మాగాంధీలం కావాలనుకుంటాం. అక్కర్లేదు. We are ordinary mortals. (దేశము బాగు లాంటి మాటలు వినగానే నా భుజాలమీద ఏదో పెద్ద బరువున్నట్లు మొహంమారకపోతే నేను చంద్రమండలంమీదో అంతరిక్షంలోనో వున్నట్టనిపిస్తుంది తప్ప భూమ్మీదున్నట్టనిపించదు) 2. ఎన్టీయార్ గొప్ప nobility ఉన్న మనిషి. ఆయనలో అవతలిమనిషిలో కాస్త మంచితనం ఉందనుకుంటే ఆదరించే వ్యక్తిత్వమున్నది, అవతలిమనిషిలో ఆత్మగౌరవముంటే దాన్ని గుర్తించే వ్యక్తిత్వమున్నది. (ఎన్టీయర్ వ్యక్తిత్వం గురించి ఈ మాటలు చెప్పినవాళ్లను నేను చూడలేదు - ఆయనతో వ్యక్తిగత పరిచయమున్నవారితో సహా) 3. ఆంగ్ సా...

మన కులానికే మన ఓట్లు

చదువుకునే రోజుల్లో ఓటు వెయ్యాలనే ఆలోచనే నాకెప్పుడూ కలగలేదు. అందరూ వ్యాపారులేగానీ ప్రజానాయకులెవరూ లేరనే అభిప్రాయం నాది. అందుకే ఓటరు జాబితాలో నాపేరు కూడా నమోదు చేసుకోలేదు. నేనెప్పుడూ చదువులపేరుతో ఊరిబయటే ఉంటాననుకున్నారో, వాళ్లకే ఓటేస్తానన్న భరోసా లేదనుకున్నారో, నాలాంటివాళ్లు ఓట్లేయడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదనుకున్నారోగానీ మావూళ్లోని ఏ పార్టీవాళ్లూ పట్టుబట్టి నాపేరును ఆ జాబితాలోకి ఎక్కించలేదు. నాకీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల వార్తలను చాలా దగ్గరగా చూస్తున్నాను. ఇప్పుడు ఓటు వేద్దామనిపిస్తూ వుంది. లోక్‌సత్తాకు. ఎన్నికల సంఘం చెప్పిన నియమావళిని పాటిస్తూ రాజ్యాంగంపట్ల మనకుండవలసిన గౌరవాన్నీ క్రమశిక్షణనూ చాటుతూ, నేటి రాజకీయగంజాయివనంలో తులసిమొక్కలా నిలిచిందన్న ఒకే ఒక్క కారణం చాలు లోక్‌సత్తాకు ఓటు వేయడానికి. ఈ కారణం మాత్రమే చాలు. లోక్‌సత్తాకు ఓటు వేస్తే మీ ఓటు వృధా అవుతుందని కొందరంటున్నారు. ఇంతకంటే పాపపు ప్రేలాపన ఇంకొకటి లేదు. గెలిచే అభ్యర్థి ఎవరో వాళ్లే మనకు చెప్పేసి, ఆ అభ్యర్థికి ఓటు వేస్తేనే అది సద్వినియోగం అవుతుందన్నట్లు ప్రచారం చేస్తున్నారు వీళ్లు. ఎన్నికలంటే ...

సోడా కేకూ సినిమా మరియు ...

బస్టాండులో వికారం సోడా గ్యాస్ తాగడానికి చేతిలో ఐదు రూపాయలు ... బేకరీముందు సైకిలాపి హనీ కేక్ కొనుక్కోడానికి జేబులో పది రూపాయలు ... లక్ష్మీరంగాలో కొత్తసినిమా బాలేదంటలే అనుకోకపోతే టికెట్టుకు ఇరవై రూపాయలు ... సోడా తాగనోడు కేకు తిననివాడు సినిమా చూడనోడు కడపలో ఎవడూ లేడు! డిగ్రీ చదివేరోజుల్లో ఇవీ నా బృహత్తరమైన ఆలోచనలు. కడపలో బతికే ప్రతి మనిషికీ రోజూ ఓ ముప్పైఐదురూపాయలు వాటంతట అవే వచ్చి జేబులో పడితే బాగుండునని ఆనాటి నా బలమైన కోరిక. కాబట్టి ఈమధ్యే చంద్రబాబునాయుడుగారు ప్రటించిన నగదు పంపణీ పథకాన్ని మెచ్చి, నా పవిత్రమైన(!) ఓటును వేసి గెలిపించేద్దామని కాదు నా ఉద్దేశం. వయ్యస్రాశ్శేఖర్రెడ్డిగారి జనా'కర్షక' పథకాలను మెచ్చి ఓట్లేస్తే ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్నికల సంఘం నిబంధనలొచ్చినా కూడా ఆ అభివృద్ధి ఆగకుండా అలా జరుగుతూనే ఉందో చూస్తున్నాం కదా! ఇంకా కొత్తగా కొన్ని పథకాలు వినవస్తున్నాయి - వందకే వంటసరుకులనీ ఇలాగ. ఊహూఁ ఇవన్నీ లాభం లేదు. "రోజుకు జేబుకు ముప్ఫైఐదురూపాయల పథకం" రావాలి, దేశం బాగుపడాలి. అంతవరకూ మీరూ ఇలాంటి పథకాలకు మీ పవిత్రమైన(?) ఓటు వేయకండి. ప్రజలను బిచ్చగాళ్లను చేయడానికే ఇలాంటి...

క్రియాసిద్ధిః సత్వే భవతి!

తాము ఆశించినట్టుగానే అందరూ బతకాలనుకునే తత్వం ప్రతిమనిషిలోనూ కొంత వుంటుందేమో. జంతువుల్లో కూడా ఈ తత్వం కలిగినవి కొన్ని వుంటాయి. మిగతా జంతువులు తమకు బెదురుతాయోలేదో చూద్దామని ఎప్పుడూ ప్రయత్నిస్తూనేవుంటాయి. కొంచెం బెదురు కనబడిందా వాటి ఆనందానికి హద్దులుండవు. వాటి శక్తి ఎన్నోరెట్లు పెరుగుతుంది. అడవిమొత్తం కలయదిరుగుతూ మొత్తం పెత్తనం మాదేనంటాయి. గుంటనక్కల్లాంటి కొన్ని జంతువులు వాటివెనకే తిరుగుతూవుంటాయి. కాకపోతే కొన్ని జంతువుల్లోనూ, కొంతమంది మనుషుల్లోనూ ఈ స్వభావం కొంచెం ఎక్కువగా వుంటుంది. ఎదుటివారిలో జంకు కనబడేవరకూ నానారకాల ప్రయత్నాలూ చేస్తూనే వుంటారు. జంకినట్టూ చీకాకుపడినట్టూ కనబడితే వాటికి పండగే. తమ సంఖ్య ఎక్కువగా వుందని చూపే ప్రయత్నం వాటిలో ఒకటి. నేనీమధ్య దాదాపుగా బ్లాగులేవీ చదవడంలేదు. ఎవరో బెదిరిస్తే ఒకరిద్దరు బ్లాగులు మానేశారని/మూసేశారని తెలిసింది. మానేసి/మూసేసి వీళ్లెవరిని బెదిరిద్దామనుకున్నారో?! రెండు బ్లాగువికెట్లు పడటం కొంతమందికి ఉత్సాహాన్నిచ్చినట్టుంది. ఇప్పుడే కదా బౌలర్లకు భయపడిపోకుండా నిలకడగా ఆడాల్సింది! జట్టు కొద్దిగా కష్టాల్లో పడింది. నేను నాటౌట్ అని క్రీజులో నిబడితే కాదనే అంపైరెవర...

~~ కలకాలమొకటిగా ~~

ఆ దారి ఎర్రమన్ను, కంకరలతో తయారయింది. ఇరువైపులా సర్కారుతుమ్మచెట్లు దట్టంగా పెరిగివున్నాయి. నలుగురు మిత్రులం ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. రాత్రి వర్షంపడి వెలసినట్టుంది. దారిమధ్యలో వున్న గుంతల్లో నీళ్లు నిలచివున్నాయి. పొద్దింకా పొడిచినట్టులేదు. వాతావరణం చల్లగా వుంది. ఆ దారి ఒక మలుపుతిరిగాక మాకు కొద్దిగా ముందు ఒక పన్నెండు-పదమూడేండ్ల పాప మెల్లగా నడుస్తోంది. పాత పావడా, పొడుగాటిజాకెట్టూ వేసుకుని, మొన్నెప్పుడో అల్లుకున్నజడతో మురికిగా కనిపిస్తోంది. మా నలుగురినీ గమనించినట్టే వుంది. నడుస్తూ మేము ఆ పాపకు దగ్గరగా చేరుతున్నాం. నేను పాపనే గమనిస్తున్నాను. అప్పుడా పాప తన తలమీదుగా దేన్నో వెనుకకు విసిరింది. అది గాలిలో వుండగానే నాకు తెలిసిపోయింది - గ్రెనేడ్‌. అది నేలను తాకగానే మా ముఖాలు మాడిపోతాయి, పాపతోసహా అందరి శరీరాలూ ఛిద్రమౌతాయనే ఊహ కలిగి, నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను. గ్రెనేడ్ కిందపడింది. పడి దొర్లుతోంది. కూజామూతిలాంటి దాని మూతినుండి నల్లమందు, మినమినా మెరుస్తున్న లోహపురవ్వలు ఒలికి ఎర్రటి మట్టిపై పడుతున్నాయి. దానికి ఇటువైపు మేము, అటువైపు పాప. పాప ఇటు తిరిగింది. గ్రెనేడ్ మా మధ్యలో నిశ్చలంగా వుంది. బొమ...

సుషుప్తి - విముక్తి

ధృవపు ఎలుగుబంటి గురించి చదువుకున్నవిషయాల్లో నాకు గుర్తున్నది - సుదీర్ఘమైన - దాని 'సుషుప్తావస్థ'. ధృవపు ఎలుగుబంటి ఒకవిధమైన నిద్రాణావస్థలో గడపవలసివచ్చే తీవ్రమైన చలికాలం మాదిరిగా నాక్కూడా ఒకవిధమైన నిశ్శబ్దంలో గడపవలసివచ్చే కాలం ఒకటున్నట్టుంది. తీవ్రమైనచలిలో బయట తిరిగితే ఒంట్లోని కొవ్వునిలువలు త్వరగా కరిగిపోయి, ధృవాల్లో ఆ తరువాత ఆహారం దొరక్క ఎలుగుబంటికి కష్టకాలం దాపురిస్తుంది. అందుకే అది నిద్రపోతుంది. నిశ్శబ్దావస్థలో వుండవలసినప్పుడు మాటల్లో పస వుండదు, మాట్లాడితే ప్రమాదం జరిగే అవకాశమే ఎక్కువ కనుక అంతర్ముఖుడిగా వుండడమే శ్రేయస్కరం. చలికాలాన్ని తట్టుకొనేందుకు వలసిన కొవ్వును శరీరంలో నిలువచేయడానికి తగినంత తిండిని ముందుగానే కష్టపడి సంపాదించి ఆరగించి, సుషుప్తికి సిద్ధమౌతుంది ఎలుగుబంటి. నిశ్శబ్దావస్థ నుండి బయటకు రావడానికి ఆలోచనల్లో స్థిరత్వం కోసం కష్టపడవలసి వస్తుంది నాలాంటివాడికి. కాసిన్ని సూర్యకిరణాలు పరచుకొంటే చాలు నిద్రలేస్తుంది ధృవపుఎలుగు - Introvert గా కనిపించే Extrovert. ఆలోచనల్లో కాసింత ముసురుకమ్మితే చాలు నిశ్శబ్దంలోకి జారుకుంటాడు నాలాంటివాడు - Extrovert గా కనిపించే ఇంట్రొవర్తులపు గాన...

యథా ప్రజా తథా రాజా!

మొన్నటినుంచి వార్తలు చూసి చూసి మెదడు అలసిపోయింది. బాంబుపేలుళ్లు, కాల్పులూ చిన్నప్పటినుంచి వింటూనే వున్నాను చూస్తూనే వున్నాను. కాకపోతే ఈసారి చాలా తేడా కనిపిస్తోంది. నాకేమనిపిస్తోందంటే ... బారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కిచిడీ పార్టీ ఎవరు అధికారంలో వున్నా ... దేశప్రజల్లో అశేషంగా వున్న అజ్ఞానాన్ని పొదిగి వృద్ధిచేసేవాళ్లే. నగరాల్లో ఏరియాలను పంచుకొని దందా సాగించే మాఫియాలకూ, పరిపాలనా కాలాన్ని పంచుకొని దందా సాగిస్తున్న పార్టీలకూ తేడా ఏమీ లేదు. ఈ రెండు పరిస్థితుల్లోనూ సామాన్యునికి అభద్రతే. మొన్నీమధ్యే ముంబయ్ రైలుపేలుళ్ల బీభత్సం జరిగిన వెంటనే నిముషాల్లో యథాతథ పరిస్థితి నెలకొంది, స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అన్నారు. సంతోషమే. స్పిరిట్ సరే, మంచిదే, వుండాల్సిందే. ఇష్టారాజ్యంగా బాంబులు ఎట్లా తయారౌతున్నాయి, ఎక్కడబడితే అక్కడికి ఎలా చేరుతున్నాయి, పేలుతున్నాయి అనే మాటకంటే స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అనే మాటే ఎక్కువగా వినిపించింది. కారణం మనకు బాంబు పేలుళ్లు కొత్తకాదు. తాజాగా జరిపిన దాడితో ఉగ్రవాదులు 'కొంచెం కొత్తగా ఆలోచించండ్రా' అనే సందేశాన్ని మన జనానికి చేరవేయడంలో మొదటి అడుగు వేసినట్టున్నారు. ఎప్పటిలాగే ...

బాలు - H

బాలు - ABCDEFG గురించి విన్నాం. కానీ నేను చెప్పబోయేది బాలు - H గురించి. చాలా యేళ్లకు ముందు ఒకసారి మా మామిడితోటలో కాయలు కోయిస్తున్నాం. కోసేవాళ్లు ఎవరంటే మా తోటకు తూర్పున వున్న ఈడిగపల్లె యువజనులు. పరాచికాలకు పెట్టింది పేరు ఆ పల్లె. ఆ పల్లెలో ప్రతి మనిషికీ కనీసం ఒకటైనా అడ్డపేరుంటుంది. ప్రతి పేరు వెనుకా ఒక కథ. కొన్ని పేర్లలో ఎంత సృజనాత్మకత వుంటుందంటే గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకోవాల్సిందే. సరే, విషయానికొస్తే - ఆ రోజు ఒకాయన చెట్టెక్కి గట్టిగా పాట పాడుతున్నాడు. చెట్టు పైనుంచి కోసి కింద వేసే కాయలకు దెబ్బతగలకుండా సంచిపట్టతో పట్టుకుంటూ కింద నిలబడి వున్న మనిషి, వీధి నాటకం శైలిలో అన్నాడు, "అహో ధర్మనందనా! ఎవరిదా కోగిల గానము? భరించనలవి గాకండా వుండాదీ!" దానికి సమాధానంగా ఆ చెట్టుమిందనున్న మనిషి - "నీ @క్an #$@&a, మామిడి కాయలతో కొట్టి సంపుతా. కోగిలేంది వాయ్? ఘంటసాల అను, ల్యాపోతే యస్పీబాలసుబ్బరమణ్ణెం అను" అంటూ ఒక మంచి కాయను నేలకేసి కొట్టేసినాడు. అది అన్యాయంగా పిచ్చలైపోయింది. "ఒరే బాలసుబ్బరమణ్ణెమా, యా పొద్దన్నా అద్దంలో నీ మొగం జూసుకున్న్యా(వా)?" "నా మొగానికేమిలే గ...

లఘు కవితలు - సర్వలఘు కందము

కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ... కం. మిడిమిడి తెలివిడి తెగబడి వడివడి పరుగిడు కవితల పడిపడి చదువన్ దడదడ మని జడి కురిసెను గడగడ వణికెను భువనము ఘటములు పగిలెన్!! ... ఇదీ నా పద్ధతి. గతంలో ఇలాంటిదే ఒక తవిక కూడా తయారు చేశాను. భాషందం బ్రతు కందం అంటున్న రాకేశుని బ్లాగులో కాస్త నవీనమైన పద్ధతిలో కందపద్యాన్ని గురించిన మంచి పరిచయమొకటి చూశాను. బమ్మెర పోతన్న గారి భాగవతంలోని ఒక సర్వలఘుకందాన్ని గురించి రాకేశ్ మాట్లాడుతూ, "మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం" అన్నారు. 'అందరూ చనిపోయే ముందు' అంటే 'కలియుగాంతంలో' అని కాదని విజ్ఞ...

వినాశ కాలే ...

ప్రస్తుతం టెక్సాస్ గుండా ఒక హరికేన్ ప్రయాణిస్తూవుంది. ఈ తెల్లవారుజామున తీరాన్ని దాటిందట. ఈదురు గాలుల వలన పెద్ద ప్రమాదం లేకపోయినా హ్యూస్టన్ మహానగర పరిసరాల్లోని కొన్ని కౌంటీలకు దీని ప్రభావం వల్ల వరదలొచ్చే అవకాశం వుంది కనుక జాగరూకులై వుండండి అని రేడియో, టీవీ, ఇంటర్నెట్టు, బయటర్నెట్టుల్లో నిన్నంతా ఒకటే హోరు. మా కచేరీకి సెలవు ప్రకటించే అవకాశం వుండవచ్చని ఒక అధికారిక వేగు కూడా అందింది. అధికారిక వేగులకు మామూలుగా పట్టే చెత్తబుట్ట యోగం దీనికీ పడుతుందనే అంచనాలతో దాన్నే ఉద్యోగులంతా ఫార్వర్డు చేసుకుని రసీదులు కూడా అందుకున్నారు. నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు మా వాహనమోహన్ నాకు ఫోన్ చేసి, 'రేపటి కోసం తిండీ నీళ్లూ సిద్దం చేస్కున్నావా' అన్నాడు. "మరీ అంత 'యమ'ర్జన్సీ అంటావా?" అన్నాను. "ఏమో ఎవరు చూశారు! మంచినీళ్లు, చిరుతిళ్లు మాత్రం కొని దగ్గరపెట్టుకో. కావాలంటే నేనే కొంటా నీకోసం. ఇప్పటికే వాల్‌మార్టు, ఫియెస్టాల్లో మంచినీళ్ల బాటిళ్లు, కేన్లు మాయమయ్యాయి. గ్యాస్ స్టేషన్లలో చిన్నచిన్న క్యూలు తయారైనాయి. ఈ రాత్రికి బాగా వాన పడుతుందంటున్నారు. రెండ్రోజుల పాటు కరంటు పోయినట్లు వూహించు,...

చినచేపను పెదచేప

వెచ్చని నీటిలో చెచ్చెరలాడుతూ చేప పిల్లలు ఒంటి కాలిపై నిలబడి జపం చేసుకుంటూ ఓ తెల్లని కొంగ ముక్కును నీటిలో ముంచి కన్నీరు కారుస్తూ ఓ నీరాటం ఉక్కపోతగా ఓ ఉదయం సాగర తీరానికి సమీపంలో తదేకమై ఓ తటాకం ప్రియ సమాగమ మహాసంరంభాన విహ్వల నదీకన్యక విసిరేసిన తామస మా తటాకం మొసలి నీట మునిగింది కొంగ చెంగున లేచింది చేపల చెర్లాట చెదిరింది నిర్గుణ వాహిని విడిచిన జీవ చైతన్యపు నిరాలంబ తాపసిగా అదే తటాకం

ఇదోరకం నిరసన

1. UUUII 2. III 3. UIU IIIIUI UUUI 4. UI UU UI UI UI 5. IIUIUII III IUIUUI UUUI III III 6. UII UIUI IIUIIU IUUI UIU ఏమిటీ పిచ్చిగీతలు!???? పిచ్చాపాటీ మాట్లాడుకున్నంత సరదాగా .... ముత్యాలసరాలవంటి పల్లెపదాలను అల్లగలిగేందుకూ .... కూనలమ్మపదాలవంటి రసగుళికల్లోని మూలికలేమిటో తెలుసుకునేందుకూ .... వచనకవితా వనితలకు లయాత్మకమైన సొగసరి నడకలను నేర్పే మాత్రలను సంపాదించేందుకు .... తెలుగు ఛందస్సు మూలకాలను తేలికగా తెలుసునేందుకూ .... వెతుక్కుంటూ వచ్చిన అరుదైన అవకాశానికి జవాబులు ఈ పిచ్చిగీతలు.

ఒక సంగీత పారాయణం కథ

తిండికూడా తినకుండా తిరుగుబోతుభర్త కోసం సిద్ధాన్నంతో ఎదురుచూసే మహాయిల్లాలివలె, గదిలో గోడవారగా తన పీఠం మీద కూర్చొని నా స్పర్శ కోసం ఎదురు చూస్తూవుంటుంది నా కీబోర్డు. ఇల్లాలిపై యిష్టమున్నా బలహీనతలకు మాటిమాటికీ తల ఒగ్గుతూ యేదో మొక్కుబడిగా అప్పుడప్పుడూ ఆమె మొక్కులను ఆలకిస్తున్నట్లు నటించే నాధుడి న్యూనత నాది. ఎంత వైనంగా చేస్తున్నానో చెబితే మీకు మంచి కాలక్షేపంగా వుంటుందికానీ, మొత్తానికి నేను కీబోర్డుపై సంగీతం సాధనచేయడం మాత్రం మానలేదు. 'పాడిందె పాడరా పాచి పండ్ల దాసరీ' అన్న చందాన ప్రతి వారమూ సాగుతూ వున్న ఈ వైనములో మూడు వారాల క్రితం ఒక చిన్న మార్పు కలిగింది. నా సంగీతం గురువు 'మన స్కూలు స్ప్రింగ్ రిసైటల్‌లో పాల్గొంటావా' అని అడిగారు. పదిమంది ముందు చిన్నపాటి ప్రదర్శన అన్నమాట. కనీసం ఈ భయంతోనైనా కాస్త సాధన చేయొచ్చుని సరే నన్నాను. రిసైటల్‌లో నువ్వు పలికించవలసినవి యివీ అంటూ సిలబసు పుస్తకంలోని రెండు చిన్న పాఠాలపై వేలు చూపించారు మా గురువుగారు. అప్పటినుంచి క్రమం తప్పకుండా రోజుకు ఇరవై నిముషాలపాటు ఆ రెండు పాఠాలనూ సాధన చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకొన్నాను. కీబోర్డుపై వాటిని పలికిస్తూ 'ఫర...

ప్చ్...!

ఒక "విల్సన్ సుధాకర్" కవిత .