ఒక ట్రావెలాగుడు - మూడవ టపా
చీకటి పడుతుండగా గుర్తొచ్చింది ఆరోజు మధ్యాహ్నం మేమేమీ తినలేదని. కడుపులకు ఇంత ద్రోహం చేశామని తెలిశాక అందరం సామూహికంగా పశ్చాత్తాపం చెంది, మాంఛి గాఠ్ఠి భోజనం దట్టించాలనుకున్నాం. ముందుగా వేడివేడిగా ఒక సూపు తాగాం. మా వాహనమోహనపితామహగారు వెంటనే బండ్లోంచి టమోటాలు, ఉల్లిపాయలూ, మిరపకాయలూ తీసి గబగబా తరిగేసి, గడగడా వణుకుతూ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి లాగా 'నాయినాహ్.. ఈ చలికి ఇక్కడే వుంటే..ఎంతోసేపు బతకన్నాయనాహ్, నే బోతున్నా..., నాయినాహ్' అంటూ బండెక్కాడు. హోరుమని గాలి.
గ్యాస్ స్టవ్ వెలిగించి మిగతా ఇద్దరూ గాలి చొరకుండా అడ్డునిలువగా, నేను ఒక గిన్నెలో కాస్త మంచినూనె పోసి, పితామహా తరిగిన ముక్కలన్నీ ఒక్కసారిగా దాంట్లో పడేసి ఉప్పు వేసి చాలాసేపు ఉడికించి వేడివేడి టమోటాబజ్జీ చేశాను. అదేవూపులో టోటిల్లాలనబడే చపాతీలను వేడిచేస్తూండగా ఒక్కొక్కరూ ఐదైదు తినేశారు. చివరగా నేను. నాకోసం పితామహా వడ్డించాడు. వేడివేడి టోటిల్లాల్లోకి టమోటా బజ్జీని చూడగానే నాకు నోరూరింది. కానీ చాలా చల్లగా అయిపోయిందది. అంతే కాదు, తియ్యగా కూడా అయిపోయింది. ఏమయ్యా సంగతి అని ఆరాతీస్తే, మా యువరాజులుంగారు ఉప్పు డబ్బాలో చక్కెర దట్టించి తీసుకొచ్చారని వేగులవారి సమాచారం. అందుకే బజ్జీ అంతా అలాగే మిగిలిపోయింది. అందరూ ఊరగాయతో తినేశారు. చివరగా నేను తిన్నానన్నానే, అది మొదటి ఆవృతమన్నమాట. తిన్నాక జనాలకు మళ్లీ ఓపికవచ్చింది. మళ్లీ కొన్ని టోటిల్లాలు పెనముపై వేగాయి. మేం తింటున్నంతసేపూ ఏమాత్రం తిండిముక్క కిందపడకుండా జాగ్రత్తపడ్డాం. కారణం ఏమిటంటే అక్కడి అడవిపందులు (జావెలీనా) ఆ వాసన పసిగట్టి గుంపుగా వచ్చి ఒక్కసారిగా దాడిచేస్తాయని అక్కడి సందర్శనకేంద్రంలో చెప్పారు, అంతకంటే ముఖ్యంగా మా పితామహా కు ఆ అనుభవం కూడా వుంది. మా వంట సరంజామా అంతా వాసనరాకుండా సంచిలో మూటగట్టి పక్కనేవున్న పెద్ద ఇనుప డబ్బాలో పెట్టాం. ఆ డబ్బా మీద 'ఎలుగుబంటి నుండి వస్తువులకు రక్షణ కల్పించగల పెట్టె' అని వ్రాసి వుంది. తినగానే నిద్దుర తన్నుకొచ్చేసింది. గతరాత్రి ప్రయాణంలో వుండి సరిగా నిద్ప పోలేదు. ఆలస్యం చెయ్యకుండా నిద్రసంచీల్లో దూరి గుడారాల్లోపడ్డాం. పడగానే ఎంత నిద్రొచ్చిందంటే... అంత నిద్రొచ్చింది. చపాతీ/టోటిల్లా కలిగించిన వేడితో చలిని అధిగమించగలిగాం.
తెల్లారి ఆరుగంటలు కావస్తోందనగా మెలకువొచ్చింది. నిద్దరసంచీ బయట విపరీతమైన చలి. మంచి సూర్యోదయాన్ని చూద్దామనుకుంటే ఆకాశం మేఘావృతమయి వుంది. అక్కడి నుంచి మా వాళ్లను నిద్రలేపటానికి చాలా సమయం పట్టలేదు. కాఫీలు, టిఫినీల తయారీ, ... గుడారాలను తీసి బండిలో వేసి చివరకు ఆ ప్రాంతాన్ని వదిలి బయల్దేరాం.
అక్కడికి దగ్గరలోనే ఒక వేడి నీటి చెలమ వుందని తెలిసి దాన్ని చూడ్డానికి వెళ్లాం. అది కూడా రియో-గ్రాండ్ నదికి అంచునే వుంది. ఆ నది ఒక కొండ పక్కగా వెళ్తుంది. ప్రత్యేకత ఏమిటంటే నది ఆ కొండను ఒకేఒక ఉధృతిలో కోసినట్లుగా నిట్టనిలువుగా వుంది. కొండమొత్తం ఎన్నో లక్షల సంవత్సరాలుగా పేర్చబడిన రాతిసుద్ద లాగా పెళుసుగా వుంది. కొన్ని చోట్ల పెద్దపెద్ద పగుళ్లు కనబడి, చిన్న వాన పడితే చాలు కూలిపోవడానికి సిద్ధంగా వున్నట్లుంటాయి.
ఆక్కడికి వెళ్లే దారిలో ఆ కొండ పైభాగాన రాతి అంచుల కింద కొన్ని పక్షిగూళ్లు కనిపించాయి.
ఈ గూళ్లనూ పక్షులనూ నేను హ్యూస్టన్‌లోనూ చుట్టుపట్ల ఇతర నగరాల్లోనూ వంతెనల కింద గమనించాను. కొంత సేపు నడవగానే నది గలగల వినిపించింది. మొత్తానికి వేడినీటి చెలమను చూశాను. అందులో దిగాలనిపించలేదు. కారణం అది అప్పటికే బురద బురుదగా వుంది. అందులో చాలా మంది వున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్లాను. నది గలగల తప్ప ఇంకేమీ వినబడటం లేదు. ప్రశాంతమైన చలివాతావరణం. అలాంటిచోట్ల కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ వుండేవాళ్లతో వుండాలని నాకనిపించగదు. పైగా నిశ్శబ్దంగా ఒక్కడినే వెళ్తూ వుంటే ఏవైనా మంచి పక్షులు, జంతువులూ కనబడతాయేమోననేది ఇంకొక ఆశ. అక్కడొక గుట్టవుంది. గుట్ట కనిపిస్తే చాలు దాన్నెక్కి చుట్టూ చూద్దామనిపిస్తుంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం నిమేనని మీకు మరొక్కసారి అనిపిస్తోందా? గబగబా కొంత దూరం ఎక్కి అక్కడినుంచి క్లిక్కిన క్లిక్కు ఇది. అక్కడొక చిన్న పిట్ట ఘనమైత కూత కూస్తూ చిటక్ చిటక్‌మని ఎగురుతూ కనిపించింది. దాన్ని ఫోటో తీయాలని విశ్వప్రయత్నం చేశాను. పిట్ట చిన్నది కాబట్టి జూమ్ చేయాలి. పిట్ట క్షణమాత్రమైన కుదురుగా నిలబడటం లేదు. జూమ్‌ఇన్ చేసి కెమెరా వ్యూ ఫైండర్ కిటికీలో దాన్ని చూస్తూ అది నా దృష్టిని దాటిపోకుండా వెంబడించడం కుదరలేదు. ఇంకా దగ్గరికెళ్తే ఎగిరిపోతుందని భయం. పిట్ట చాలా వెరయిటీగా వుంది. దానిమీద పొద్దుటి ఎండ పడి రెక్కలూ మెడా తోకా ఒకోటి ఒకో రంగులో మెరుస్తున్నాయి. ఆ గుట్టమీది నాగజెముడు పొద చుట్టూ నేలమీదే టిఫినీల కోసం చూస్తోందది. కెమెరా ఆఫ్ చేసి, అది ఎగిరిపోయేంత సేపు దాన్ని చూసి తిరిగి వచ్చేశాను. అక్కడినుంచి చూస్తే గలగలా సెలయేరులాగా పారుతూ నది, నదికి ఇరువైపులా పచ్చగా వెదురులాంటి దట్టమైన పొదలు, పొదలకిరుపక్కలా ఎండి బీడువడిన వాతావరణం.
వచ్చేటప్పుడు వేడినీటి చెలమలో నీళ్లెంత వేడిగా వుంటాయో చూద్దామనిపించింది. నీళ్లు పొగలు పోతున్నాయి. తొడుగు తీసి చేతిని ముంచాను. చలికాలంలో మన సేద్యపు బావుల్లో కూడా పొద్దున్నే నీళ్లు పొగలు పోతాయి. అవెంత వేడిగా వుంటాయో ఇవీ అంతే. కాకపోతే చెయ్యి బయటకు తీశాక మాత్రం చలిగాలికి కొంతసేపు స్పర్శ తెలీకుండా పోయింది.
అక్కడినుంచి, పాంథర్‌జంక్షన్ సందర్శకుల కేంద్రం మీదుగా బిగ్‌బెండ్ ప్రాంతపు మధ్యభాగానికి కాస్త పడమటనున్న ఛీసోస్ పర్వతాల సానువుల్లో బస కుదుర్చుకున్నాం. అక్కడనుండి పద్నాలుగు మైళ్ల ఉత్తరాన వున్న గ్రేప్‌వైన్ హిల్స్ చూద్దామని బయల్దేరాం. ఇక్కడికి చేరాలంటే వాహనంలో తార్రోడ్డుపై సగం, రాళ్లదారిలో సగం దూరం ప్రయాణించి, ఒక మైలుకు పైగా నడవాలి. ఈ నడక ప్రాంతానికి వచ్చేసరికి బండిపైన అరంగుళం దుమ్ము పేరుకుంది. అక్కడనుండి నడవాలనే సరికి అందరికీ ఆకలైంది. రెండు బ్రెడ్డుముక్కలమధ్య ఒక టమోటాముక్క, ఒక పచ్చి ఆకు, రెండు ఉల్లిపాయముక్కలు, కొంత హల్దీరాముడిమిశ్రమం వేసి దానికి 'బరగరశాకము' (veg-burger) అని నామకరణం చేసి తిని నీళ్లుతాగి బయల్దేరాం.
మధ్యాహ్నం మూడైంది. వెళ్లూ వుండే కొద్దీ మా దారికి ఇరుపక్కలా బండరాళ్లు పెరుగుతూ పోతున్నాయి. ఈ వాక్యం ఎలా వుందంటే 'ఈ దారి నిన్ను ఫలానా వూరికి తీసుకెళ్తుంది పో!' అన్నట్టు. అదన్నమాట. రాళ్లన్నీ దాదాపు నున్నగా కొంచెం గుండుగా వున్నాయ్. అలా వెళ్లే కొద్దీ ఒక చిన్న కొండ మాకెదురుగా వచ్చింది. ఈ వాక్యం కూడా 'మీ వూరొచ్చింది, ఇంక బస్సు దిగండి' అన్నట్టుంది కదా! దాని పైన ఇదుగో ఇది కనిపించింది.
ఇలాంటివి మనకు మామూలుగా కొండల్లో బాగానే కనిపిస్తుండవచ్చు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ శిలలన్నీ గ్రానైట్ శిలలు. గ్రానైటెక్కడిదంటే భూమిలోపలిపొరల్లో నుంచి కరిగి పొంగి కొంతదూరం పైకొచ్చిన మాగ్మా, అక్కడి సెడిమెంటెడ్ బండలలోకి చొచ్చుకొని వచ్చి గడ్డకట్టింది. ఇలా గడ్డకట్టిన రాతి ప్రదేశపు పైనున్న భూమి పొర కాలక్రమేణా కోతకు గురికాగా ఇవి బయటపడ్డాయనేది ఇక్కడి స్థలపురాణం. ఈ రకం బండల్లో వున్న చీలికలలో నీరు చేరి వాటి మూలలను రాలిపోయేలా చేయడంతో వీటి అంచులు గుండ్రంగా మారాయంటారు.
అక్కడి నుండి వచ్చేటప్పుడు గమనించాను, చాలా రకాల ఎడారిమొక్కలు. వాటిలో నాకు నచ్చిన దృశ్యం ఇదీ...
"కంపశయ్య" అని పేరుపెట్టాను దీనికి.
ఎందుకంటే, ఈ మొక్కను చూడగానే నేను ఏడో తరగతి చదివేటప్పుడు చదివిన ఒక సైన్సు కథ గుర్తొచ్చింది. ఆ కథలో ఒక రాజభక్తుడిని రాజద్రోహిగా పొరపాటుబడి ... (సశేషం)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.