ఇటీవలి జ్ఞానోదయాలు
1. అమెరికాలో ప్రజలంతా విజ్ఞతగలవారు, మానసికంగా ప్రపంచంలోనే వీరు అత్యంత విశాలహృదయులు, వ్యక్తి స్వేచ్ఛను గౌరవించేవారు అనుకున్నాను - ఇక్కడికొచ్చే ముందు. కానీ ఇక్కడ కూడా అనేక తరతమ భేదాలు. కులాల కుమ్ములాటలు, జాతుల మధ్య అంతరాలు, అమానుష ప్రవర్తనలు, అన్నింటినీ మించి మత ఛాందసవాదం ఇవన్నీ మన దేశంలో లాగే ఇక్కడా ఉన్నాయి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే - ఇక్కడి మత ఛాందసులు విద్యాధికులు . గురజాడ అన్నట్లు మనుషుల్లో రెండే కులాలు - మంచివాళ్లు, చెడ్డవాళ్లు. దేశాలు, మతాలు, ప్రాంతాలూ అన్నింటికీ ఈ మాట వర్తిస్తుంది. 2. 'ఈనాడు' అంతర్జాల సంచికలో ( web edition ) 'ఊ' అనే అక్షరం కనబడదు. వారి అచ్చుయంత్రంలోనో ఖతుల్లోనో ఎక్కడో ఇది జారిపోయింది. 3. ఇటీవలే ఇల్లుమారాను. కాస్తంత ఖర్చైనా భద్రత ఉంటుందని ఎగువ మధ్యతరగతి నివాసముండే ప్రాంతంలోనే ఉంటున్నాను. నేనుంటున్న ప్రాంతంలో బయట మనుషులెవ్వరూ తిరుగుతూ కనిపించరు. కానీ మన వస్తువులేమైనా బయట వదలి కాసేపు కళ్లుమూసుకుంటే అవి మళ్లీ కనబడవు. ఆఖరికి ఈతకొలను దాక తొడుక్కెళ్లడానికి కొన్న ఒక్క డాలరు విలువచేసే తొక్కలో హవాయి చెప్పులుకూడా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎంతో కొంత సంపాదిం...