Thursday, September 27, 2007

ఇటీవలి జ్ఞానోదయాలు

1. అమెరికాలో ప్రజలంతా విజ్ఞతగలవారు, మానసికంగా ప్రపంచంలోనే వీరు అత్యంత విశాలహృదయులు, వ్యక్తి స్వేచ్ఛను గౌరవించేవారు అనుకున్నాను - ఇక్కడికొచ్చే ముందు. కానీ ఇక్కడ కూడా అనేక తరతమ భేదాలు. కులాల కుమ్ములాటలు, జాతుల మధ్య అంతరాలు, అమానుష ప్రవర్తనలు, అన్నింటినీ మించి మత ఛాందసవాదం ఇవన్నీ మన దేశంలో లాగే ఇక్కడా ఉన్నాయి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే - ఇక్కడి మత ఛాందసులు విద్యాధికులు. గురజాడ అన్నట్లు మనుషుల్లో రెండే కులాలు - మంచివాళ్లు, చెడ్డవాళ్లు. దేశాలు, మతాలు, ప్రాంతాలూ అన్నింటికీ ఈ మాట వర్తిస్తుంది.

2. 'ఈనాడు' అంతర్జాల సంచికలో (web edition) 'ఊ' అనే అక్షరం కనబడదు. వారి అచ్చుయంత్రంలోనో ఖతుల్లోనో ఎక్కడో ఇది జారిపోయింది.

3. ఇటీవలే ఇల్లుమారాను. కాస్తంత ఖర్చైనా భద్రత ఉంటుందని ఎగువ మధ్యతరగతి నివాసముండే ప్రాంతంలోనే ఉంటున్నాను. నేనుంటున్న ప్రాంతంలో బయట మనుషులెవ్వరూ తిరుగుతూ కనిపించరు. కానీ మన వస్తువులేమైనా బయట వదలి కాసేపు కళ్లుమూసుకుంటే అవి మళ్లీ కనబడవు. ఆఖరికి ఈతకొలను దాక తొడుక్కెళ్లడానికి కొన్న ఒక్క డాలరు విలువచేసే తొక్కలో హవాయి చెప్పులుకూడా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎంతో కొంత సంపాదించగలిగినవారికి కూడా చిల్లరదొంగతనాలకు పాల్పడే మనస్తత్వం ఉండటం గురించి ఆలోచిస్తే నవ్వు వచ్చింది.

4. పొట్టివారికి కీళ్లనొప్పులు, వెన్నునొప్పి తక్కువగా వస్తాయి అనునుకున్నాను మొన్నటిదాక. ఇటీవల నాకు తగిలిన కేసుల దృష్ట్యా ఈ అభిప్రాయం మార్చుకోవలసి వస్తున్నది. ఐనా, ఇదేమిటి, ఇది చాలా చిన్న సంగతి. స్థిరమైనవి, నిశ్చితమైనవి అని మనం అనుకునే అభిప్రాయాలను మార్చేసే అనుభవాల స్రవంతే కదా జీవితమంతా!

ఆకాశవాణి - జీవన స్రవంతి ఇంతటితో సమాప్తం కాదు.

10 comments:

నాగరాజా said...

బాగున్నాయి

బ్లాగేశ్వరుడు said...

10/10

రాకేశ్వర రావు said...

జ్ఞానం ఎక్కువైతై చాలా ప్రమాదం, కాబట్టి ఇలాంటి జ్ఞానోదయాలందు ఉదయిస్తున్న హృదయభాను నెత్తిమీద సుత్తితో కొట్టి క్రిందకి దించేయడం మేలు.
జ్ఞానం తస్మాత్ జాగ్రత్త అన్నారు అందుకే..
డామేజీ జరిగిన తురువాత నేను ముందే చెప్పలేదనవద్దు.

రానారె said...

అందరికీ నమస్కారమ్. నిజమే జ్ఞానం ఎక్కువయ్యేకొద్దీ కష్టాలే. 'అజ్ఞానీ సుఖసంభవః!' అన్నారటకదా! సరిగ్గా ఇలాగే అన్నారో లేక కాస్త మార్చారో సరిగా తెలీదు ;-)

teresa said...

డాలర్ చెప్పులు పోవడం గురించి నాకూ ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీకవసరం లేదనుకుని ఏ చారిటీ బిన్లోనో,గార్బేజిక్యానులోనో పడేశారేమో!

ప్రవీణ్ గార్లపాటి said...

ఇది సత్యం‌... ఇది నిత్యం....

netizen said...

బహౌశ ఈ, మీ టపా చదివినతరువాత ఈయన "ది హిందు"లో ఇది వ్రాసుంటారు.

ఈ రోజు పత్రికలో ఉంది.
ఇక్కడ వదవొచ్చు.

http://tinyurl.com/2hwfeh
వ్రాసినవారు: SUDHEER MARISETTI

రానారె said...

తెరెస‌గారు, - :) పావలావైనా, అర్ధరూపాయివైనా అవి నావి కదండి! కొత్తవి. దానం చేసినా, శుభ్రం చేసినా చేస్తే నేను చెయ్యాలి కదా!!

నెటిజన్‌గారు, - కాదేమోనండి. ఆయన రాసినది వేరే విషయం గురించి. నేను రాసింది వేరే కోణంలో. ఈ రెండింటికీ పోలికలుగానీ విభేదాలుగానీ లేవు. ఐతే, సుధీర్ గారి వ్యాసంతో నేను వందశాతం ఏకీభవిస్తున్నాను. మీరు?

netizen said...

మీరన్నది నిజమే!
was jesting..
:)
మీతో పాటే!

teresa said...

అవును.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.