తొక్క ఒలిచిన ఉత్సాహము

'తొక్క ఒలిచిన ఉత్సాహము' అనేది ముంబాయిలో తయారయ్యే వ్యాపార ప్రకటనల్లోని ఒకానొక తెలుగు పలుకుబడి. ఇంతకూ ఈ టపా కూడా ఒక వ్యాపారప్రకటనే. కాకపోతే అపేక్ష ధనం కాకపోవడమే ఇక్కడ తేడా. గతంలో మీరు చూసి ఉండకపోతే, మా ప్రాయోజిత కార్యక్రమం ఇదుగో ఇక్కడ ప్రదర్శింపబడుతోంది.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
ఏంటి, తొక్క ఒలిచిన ఉత్సాహమా? ఇదేమిటండి రానారె గారూ అదేదో తోలు ఒలిచిన చర్మంలా. దీన్ని వాడే సందర్భమేమిటండీ? ఒక సందేహం. పలుకుబడి లేదా నుడికారపు స్థాయి చేరుకొనటానికి ముందు కొంత జన బాహుళ్యంలోకి పోవాలికదా ఈ మాటలు. పై మాట ఆ దశను దాటిందా? నాకెప్పుడూ విన్న గుర్తే లేదు.

మీ ప్రాయోజితాన్ని ఇప్పుడే చదివాను మొదటి దానితో సహా. బాగా వ్రాసారు.
రానారె చెప్పారు…
వికటకవిగారూ, 'తొక్క ఒలిచిన ఉల్లాసము' (నేను పొరబాటున 'ఉత్సాహము' అని రాశాను) అంటే ఏమిటో అక్కడి వ్యాఖ్యల్లోనే ఉంది! :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం