పోస్ట్‌లు

జులై, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవడబ్బా సొమ్మాని ... రామాచంద్రా!

ఇప్పుడే మాటీవీలో సత్యభామ అనే కొత్తసినిమా ప్రచారంలో భాగంగా సంగీత దర్శకుడు చక్రితో ప్రేక్షకుల ఫోనింగుకార్యక్రమం చూస్తున్నాను. ఒకాయన ఫోనుచేశాడు. మీకేపాట బాగానచ్చింది అనడిగితే "హెల్లో మేడం పాట సార్" అన్నాడు. "థాంక్సండీ" అని ఊరుకున్నాడు చక్రి. భక్తరామదాసు (అనబడు కంచెర్ల గోపన్న) పాడిన ముక్క ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆ ముక్క పాడుకుంటూ ఈ టపా రాస్తున్నాను. ఎందుకంటే ఆ పాటను లేతమనసులు సినిమాకోసం యమ్మెస్‌విశ్వనాధన్ స్వరపరచగా పీబీశ్రీనివాస్, పిఠాపురం, బృందం పాడారు. ఎవరిదైనా వాడుకొన్నాక వాళ్లకు కృతజ్ఞులమై ఉండటం ఒకపద్ధతి. అది మనదేనన్నట్టుగా ప్రవర్తించడం ఇంకోపద్ధతి.

"థ" బాబూ "థ" స్వామీ "థ" నాయనా!!!

అయ్యా అది థ . కథ . కధ కాదు. కధ చదివాను, కధలు రాస్తాను, కధారచయిత, కధ బాగుంది .... ఎవరినోట ఈ తప్పు పలకకూడదో ఆ నోళ్లనుంచే ఇలాంటి మాటలు విన్నప్పుడు పుట్టి పేరుకుపోయిన అసహనాన్ని ఈ టపాలో వెళ్లగక్కుతున్నాను. ఇది క ధ కాదు. క థ .

మనసు మురిసి పాట పాడే!

ఈ పాటను మొన్నీమధ్యే తొలిసారిగా విన్నాను. అప్పటినుండి దాదాపు వందసార్లు విన్నాను. పాట ప్రారంభంలో "ఏమైందీ..." అంటూ ఉదిత్‌నారాయణ్ పలికే పద్ధతి మొదట్లో నచ్చలేదు. "చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల!?" అనాల్సిన చోట "పోయెనేల!?" అనడం, "ఏ శిల్పి చెక్కెనీ శిల్పం!?" అనవలసిందికాబోలు "ఏ శిల్పి చెక్కనీ శిల్పం" అన్నట్లుగా పలకడం కూడా కలుక్కుమంది. కానీ ఈ పాటను అంత సులభంగా వదిలేయబుద్ధి కాలేదు. కారణాలు ఏమిటనేది ఎక్కువ ఆలోచించనవసరం లేకుండానే అర్థమైంది - ఈ పాటలోని పదాల శబ్ద సౌందర్యం ఒకటి, అంతే గొప్పగా ఉన్న బాణీ (ట్యూను) రెండవది, ఇందులో వాడిన వాద్యాలూ కోరస్సుల మంత్రశక్తి మూడవది, శాస్త్రోక్తంగా తాళానికి లెక్కాచారంగా ఒక్కోపదాన్నీ పట్టిపట్టి పలికిన ఉదిత్‌నారాయణ్ గాత్రం నాలుగవది. ఈ నాలుగో విషయం జీర్ణం కావడానికి నాకు కాస్త సమయం పట్టింది. జీర్ణమయ్యాక అతని గొప్పదనం అర్థమైంది. మూడవ విషయం నిజంగానే మంత్రశక్తి కలది. వేణువు-వాయులీనము, చిరుగంటలు-గజ్జెలు, తబలా-డ్రమ్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగానూ, కలివిడిగానూ వినవస్తాయి - "చూడు నా ప్రతిభ" అంటూ. రెండవ విషయం - ఈ పా...

మేడమ్మ ప్రెసిడెంటు

పొద్దున్నే ఆంధ్రజ్యోతి చూడగానే "మేడమ్ ప్రెసిడెంట్" అని ప్రతిభా పాటిల్ నవ్వుతున్న ఫోటోవేసి, "రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి ప్రతిభా పాటిల్ విజయం సాధించారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలిమహిళగా ప్రతిభా పాటిల్ ఖ్యాతి గడించారు" అని రాశారు. పదనివి చేపట్టి ఖ్యాతిగడించడం కాదు, ఖ్యాతి గడించడంకోసం ఆవిడ ఆ పదవిని కోరుకున్నారని నాకనిపించింది. కనీసం ఎనభైశాతం ప్రజలు/యువత కోరిన అబ్దుల్‌కలాంగారికి పోటిగా ఎవరైనా నిలబడటమెందుకు? పైగా, ఆమె విజయం దేశప్రజల నైతిక విజయమని స్టేటుమెంటొకటి. నా దృష్టికి ఆమె నవ్వులో న్యూనత కనిపిస్తోంది. ఏదేమైనా, ఎవరు మన రాష్ట్రపతి మరియు సైనికత్రిదళాధిపతి అయికూర్చున్నా, వారిని మనం గౌరవించాలి. జై హింద్!

నీకో మంచి పోరీనిచ్చి పెండ్లిజెయ్యా...

రాత్రి పదకొండయ్యింది. నిద్ర వచ్చేటట్టుగా ఉంది. అంతలో యూట్యూబులో ఈ వీడియో కంటబడింది. పిచ్చ నవ్వొచ్చింది. సిద్ధార్థ్ లాగా గొంతులో బాధను భలే పలికించాడు మన హీరో.

అదీ ఆనందమంటే!

ఇట్లా పాడుకుంటూ దానికి నేనే వాద్యసహకారం కూర్చుతూ ఆనందించే రోజు ఎప్పుడో మరి! ఏదో ఒక్క వాయిద్యమైనా కనీసం ఈ మాత్రం నేర్చుకోకుండా చచ్చిపోకూడదు. తాళ్ సినిమా వచ్చిందనికూడా తెలీదు నాకప్పుడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నా మిత్రుని ఇంటికెళ్తే "ఒక మంచి పాటుంది, విను" అని అతడే అమర్చిన పెద్ద స్పీకర్లలో వినిపించిన పాట ఇది. విశేషమేమిటంటే విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న నాకు ఈ పాట పూర్తయే సరికి ప్రశాంతత కలిగింది. ఆ తరువాత ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. ఇలాంటి ఎన్నో పాటలు ఈనాటికీ అందిస్తున్న ఆ సంగీత ప్రభంజనానికి (ఇసై పుయల్‌) ఎన్నెన్నోమార్లు కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. గత నెలలో ఆతని దర్శనభాగ్యం కలిగింది. మూడుగంటలపాటు ఎనిమిది వేల మంది ప్రేక్షకశ్రోతలను ఉర్రూతలూపిన ఆ కార్యక్రమం ఒక మరపురాని అనుభూతి. పాటలు విని ఎంతగా ఆనందిస్తాడో ఛాయాగ్రహణాన్నీ అంతగానే అభిమానించే నా మిత్రుడు తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ .