ఎవడబ్బా సొమ్మాని ... రామాచంద్రా!
ఇప్పుడే మాటీవీలో సత్యభామ అనే కొత్తసినిమా ప్రచారంలో భాగంగా సంగీత దర్శకుడు చక్రితో ప్రేక్షకుల ఫోనింగుకార్యక్రమం చూస్తున్నాను. ఒకాయన ఫోనుచేశాడు. మీకేపాట బాగానచ్చింది అనడిగితే "హెల్లో మేడం పాట సార్" అన్నాడు. "థాంక్సండీ" అని ఊరుకున్నాడు చక్రి. భక్తరామదాసు (అనబడు కంచెర్ల గోపన్న) పాడిన ముక్క ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆ ముక్క పాడుకుంటూ ఈ టపా రాస్తున్నాను. ఎందుకంటే ఆ పాటను లేతమనసులు సినిమాకోసం యమ్మెస్‌విశ్వనాధన్ స్వరపరచగా పీబీశ్రీనివాస్, పిఠాపురం, బృందం పాడారు. ఎవరిదైనా వాడుకొన్నాక వాళ్లకు కృతజ్ఞులమై ఉండటం ఒకపద్ధతి. అది మనదేనన్నట్టుగా ప్రవర్తించడం ఇంకోపద్ధతి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.