ఎవడబ్బా సొమ్మాని ... రామాచంద్రా!

ఇప్పుడే మాటీవీలో సత్యభామ అనే కొత్తసినిమా ప్రచారంలో భాగంగా సంగీత దర్శకుడు చక్రితో ప్రేక్షకుల ఫోనింగుకార్యక్రమం చూస్తున్నాను. ఒకాయన ఫోనుచేశాడు. మీకేపాట బాగానచ్చింది అనడిగితే "హెల్లో మేడం పాట సార్" అన్నాడు. "థాంక్సండీ" అని ఊరుకున్నాడు చక్రి. భక్తరామదాసు (అనబడు కంచెర్ల గోపన్న) పాడిన ముక్క ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆ ముక్క పాడుకుంటూ ఈ టపా రాస్తున్నాను. ఎందుకంటే ఆ పాటను లేతమనసులు సినిమాకోసం యమ్మెస్‌విశ్వనాధన్ స్వరపరచగా పీబీశ్రీనివాస్, పిఠాపురం, బృందం పాడారు. ఎవరిదైనా వాడుకొన్నాక వాళ్లకు కృతజ్ఞులమై ఉండటం ఒకపద్ధతి. అది మనదేనన్నట్టుగా ప్రవర్తించడం ఇంకోపద్ధతి.

కామెంట్‌లు

కొత్త పాళీ చెప్పారు…
అర్ధం కాలే. ఆ "హల్లో మేడం" పాట సదరు చక్రిగారిది కాదా?
రానారె చెప్పారు…
మరేంలేదు గురువుగారు, అది విశ్వనాథన్ గారి ట్యూన్. దాన్ని చక్రి వాడుకొన్నాడు. రీమిక్స్ చేశాడు. ఎవరైనా ఆ పాట బాగుందండీ అన్నపుడు "అది నాగొప్ప కాదు" అని చెప్పివుంటే బాగుండేదని ...
CH Gowri Kumar చెప్పారు…
మీరు రామదాసు కీర్తన పూర్తిగా విన్నారా (మన సినిమాలోనిది కాదు)? అసలు కీర్తనలో అర్ధం చాలా వేరుగా ఉన్నది. ఎవడబ్బ.... తరువాత, "అబ్బ అని తిట్టితిననై ఆయాస పడబోకు. దెబ్బలకు ఓర్వలేక "అబ్బ" అని అన్నాను" అని ఉన్నది. కానీ సినిమాలో వక్రీకరించి చూపించారు.
రానారె చెప్పారు…
ఐతే ఏంటి? మీరేం చెప్పదలచుకున్నారు?
అజ్ఞాత చెప్పారు…
హిందీలో ఒక వెధవున్నాడు అను మల్లిక్ అని, కాపీ తప్ప ఒరిజినాలిటీ లేనివాడు. నిర్లజ్జగా కాపీ చేసినవన్నీ, ఇన్స్పైర్ అయి కంపోజ్ చేసా అంటూ ఉంటాడు. ఇదో టైపు.
కొత్త పాళీ చెప్పారు…
మన సినీ ప్రపంచంలో (ఆ మాటకొస్తే రచనా ప్రపంచంలో కూడా)ఇన్స్పిరేషన్ అనేది కాపీకి పర్యాయపదం వికటకవిగారూ! మీకింకా తెలీకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము