అదీ ఆనందమంటే!


ఇట్లా పాడుకుంటూ దానికి నేనే వాద్యసహకారం కూర్చుతూ ఆనందించే రోజు ఎప్పుడో మరి! ఏదో ఒక్క వాయిద్యమైనా కనీసం ఈ మాత్రం నేర్చుకోకుండా చచ్చిపోకూడదు. తాళ్ సినిమా వచ్చిందనికూడా తెలీదు నాకప్పుడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నా మిత్రుని ఇంటికెళ్తే "ఒక మంచి పాటుంది, విను" అని అతడే అమర్చిన పెద్ద స్పీకర్లలో వినిపించిన పాట ఇది. విశేషమేమిటంటే విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న నాకు ఈ పాట పూర్తయే సరికి ప్రశాంతత కలిగింది. ఆ తరువాత ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. ఇలాంటి ఎన్నో పాటలు ఈనాటికీ అందిస్తున్న ఆ సంగీత ప్రభంజనానికి (ఇసై పుయల్‌) ఎన్నెన్నోమార్లు కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. గత నెలలో ఆతని దర్శనభాగ్యం కలిగింది. మూడుగంటలపాటు ఎనిమిది వేల మంది ప్రేక్షకశ్రోతలను ఉర్రూతలూపిన ఆ కార్యక్రమం ఒక మరపురాని అనుభూతి. పాటలు విని ఎంతగా ఆనందిస్తాడో ఛాయాగ్రహణాన్నీ అంతగానే అభిమానించే నా మిత్రుడు తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ.

కామెంట్‌లు

రాధిక చెప్పారు…
ఆ వీడియోలో వున్నది ఎవరు?ఆయన గాత్రం చాలా బాగుంది.
రానారె చెప్పారు…
నాకూ ఆ గొంతు నచ్చి బ్లాగు చేసేశానండి. మీరడిగాగే కాస్త గూగులించి ఆయనెవరో తెలుసుకున్నా. ఇది ఆయన సాలెగూడు: http://www.symphony-notes.com/aboutme.html
Unknown చెప్పారు…
వావ్...
పాడుతూ అంత చక్కగా వాయిస్తున్నాడు. గొంతు చాలా బాగుంది.
తాళ్ సినిమా పాటలు నాకిప్పటికీ ఎంతో ఫేవరెట్.
రాధిక చెప్పారు…
నేనింకా ఈయనే మీ ఫ్రెండ్ అనుకున్నాను.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం