మేడమ్మ ప్రెసిడెంటు
పొద్దున్నే ఆంధ్రజ్యోతి చూడగానే "మేడమ్ ప్రెసిడెంట్" అని ప్రతిభా పాటిల్ నవ్వుతున్న ఫోటోవేసి, "రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి ప్రతిభా పాటిల్ విజయం సాధించారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలిమహిళగా ప్రతిభా పాటిల్ ఖ్యాతి గడించారు" అని రాశారు. పదనివి చేపట్టి ఖ్యాతిగడించడం కాదు, ఖ్యాతి గడించడంకోసం ఆవిడ ఆ పదవిని కోరుకున్నారని నాకనిపించింది. కనీసం ఎనభైశాతం ప్రజలు/యువత కోరిన అబ్దుల్‌కలాంగారికి పోటిగా ఎవరైనా నిలబడటమెందుకు? పైగా, ఆమె విజయం దేశప్రజల నైతిక విజయమని స్టేటుమెంటొకటి. నా దృష్టికి ఆమె నవ్వులో న్యూనత కనిపిస్తోంది. ఏదేమైనా, ఎవరు మన రాష్ట్రపతి మరియు సైనికత్రిదళాధిపతి అయికూర్చున్నా, వారిని మనం గౌరవించాలి. జై హింద్!
కామెంట్‌లు
...వల్లూరి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.