ఉద్ధరేత్ ఆత్మనాత్మానమ్: దైవం ఉన్నా లేకపోయినా మనిషికి ఒరిగేదేంలేదు పోయేదీలేదు
"థ" బాబూ "థ" స్వామీ "థ" నాయనా!!!
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
అయ్యా అది థ. కథ. కధ కాదు. కధ చదివాను, కధలు రాస్తాను, కధారచయిత, కధ బాగుంది .... ఎవరినోట ఈ తప్పు పలకకూడదో ఆ నోళ్లనుంచే ఇలాంటి మాటలు విన్నప్పుడు పుట్టి పేరుకుపోయిన అసహనాన్ని ఈ టపాలో వెళ్లగక్కుతున్నాను. ఇది కధకాదు. కథ.
థాన్క్యూ కేసరిగారూ. సరిగానే రాశారు సుగాత్రీ. అతిథి సినిమా ప్రమోషన్ షోలలో టీవీల్లో కొత్త నటి ముంబాయి నుంచీ వచ్చిన అమృతారావ్ అతి'థి' అని శుద్ధంగా పలుకుతుండగా తెలుగువాళ్లైన మన యాంకర్లు మాత్రం కుక్కతోక వంకర్లు పోగొట్టుకోలేక అతి'ధి' అంటున్నారు.
అనగనగా ఒక పల్లె. పల్లె మొగసాల ఒక పెద్ద చింత మాను. మాని పక్కగా పల్లె లోపలికి బండ్లబాట. ఆ మాని మొదలు చాటున ఒక కుక్కపిల్ల. ఎండి రాలిన చింతాకు దుగ్గు మీద పడుకొని బాట వెంబడి వచ్చీపోయే జనాలనూ ఎద్దులబండ్లనూ చూస్తూ, ఎండకు తావటిస్తోంది. ఉన్నట్టుంది కాళ్లతో దుగ్గును పక్కకు తోసి, ఒక ఎముకను నోట గరచుకుని మళ్లీ పడుకుంది. ముందరికాళ్లను ముందుకు చాపుకొని, మోర ఆ కాళ్లమధ్యలో పెట్టుకొని, నోట ఆరంగుళాల ఎముకను అడ్డంగా కరచుకొని విశ్రాంతిగా చప్పరిస్తూంది లేదా చప్పరిస్తోంది. **** **** **** **** **** **** **** **** **** చప్పరిస్తూ+ఉంది=చప్పరిస్తూంది - సవర్ణదీర్ఘసంధి చప్పరిస్తా+ఉంది=చప్పరిస్తోంది - గుణసంధి ఇప్పుడు రామాయణంలో ఈ పిడకల వేట చేయవలసిన అవసరం ఏమిటని మీకు అనిపిస్తూండవచ్చు. అక్కడికే వస్తున్నా. "చప్పరిస్తూ ఉంది" అని చెప్పడానికి 'చప్పరిస్తూంది' లేదా 'చప్పరిస్తోంది' అని కాక, 'చప్పరిస్తుంది' అని మనలో కొందరు రాస్తున్నారు. '...స్తూంది' లేదా '...స్తోంది' అన్నది వర్తమానాన్ని (ప్రస్తుతం జరుగుతున్నదాన్ని) తెలియజేసేదైతే, '...స్తుంది' అన్నది భవిష్యత్ కాల ...
భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూణ కో దండకళా రప్రచండ భుజతాండవ కీర్తికి రామ మూర్తికిన్ రెండవ సాటి దైవమిక లే డనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ము లజాండము నిండ మత్త వేదండమునెక్కిచాటెదను దాశరథీ కరుణా పయోనిధీ! చిన్నప్పుడు మా నాయన నేర్పిన పద్యం ఇది. అర్థంతో సహా నేర్పారు కాబట్టి ఇంకా గుర్తుంది. పద్యం నాలుగు పాదాలూ రాశానుగానీ, పాదాలను ఎక్కడబడితే అక్కడ అమ్మతోడుకూడాలేకుండా అడ్డంగా నరికేసినట్లున్నాను. ఇలా కాదుగాని ఒక మహాప్రయత్నం చేసి ఛందోబధ్దంగా నాలుగు పాదాలు ఒకేపొడవులో వుండేట్టుగా నిలబెట్టాలని మొదలుబెట్టాను. మనం చిన్నప్పుడు అంటే తొమ్మిది, పదవ తరగతుల్లో చదువుకుని మరచిపోతామేమో నని కొంచెం బెంగపడిన ఛందస్సు పునరావలోకనం. పద్యంలో ఒక తప్పున్నా ఛందస్సు చెడిపోతుంది కదా. నాకు తెలిసి ఈ పద్యం నేను తప్పులు లేకుండా రాసినానని గట్టి నమ్మకం. ముందుగా - "యమాతారాజభానసలగం" అనుకొన్నాను. ఎక్కడో విన్న వాసన తగులుతోందా? లేక ఏమిటిది కపాలమాంత్రికుని మహామంత్రం లాగ వుందే అంటారా? తెలుగు వర్ణమాల నేర్చుకోవడంలో ఓనమాలు ఏమిటో (ఈ కాలంలో అఆఇఈ ఏమిటో), తెలుగు ఛందస్సు నేర్చుకోవడంలో "యమాతారాజభానసలగం" అల...
నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति". క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది. పూర్తి శ్లోకం ఇదీ: విజేతవ్యా లంకా చరణతరణీయా జల...
కామెంట్లు
ఇలాంటిదే ఇంకొకటి: "అర్థం" (=meaning) బదులు "అర్ధం" (=సగం/half) అని పలకడం, రాయడం.
ఇలాంటిదే ఇంకొకటి: "అర్థం" (=మేనింగ్) బదులు "అర్ధం" (=సగం/హల్ఫ్) అని పలకడం, రాయడం.
చిన్న సవరణ: "అర్దం" (సగం/హాఫ్).. దీన్ని "అర్థ" అని అంటారు అంటె సగం అన్నమాట.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.