పొద్దుపోని యవ్వారం - 9
దాశరథీ శతకం తెలుసా? శతకమొకటి వుందని తెలుసు ఎవర్రాశారో తెలుసా? కంచెర్ల గోపన్న పద్యాలేమైనా వచ్చునా? శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ అనే పద్యం వచ్చు ఇంకా? భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూ... ఆగక్కడ. గోపన్న కాళిందిలో కాలేశాడు !!!?? ఏమిటలా మిడిగుడ్లేసుకుని నన్ను చూస్తావు? ఆ పద్యాన్ని చూడు పద్యానికేఁ?! ఆ పద్యం ఎవరిగురించి? రామమూర్తిని గురించి కదా! రాముడు ముందా? భీముడు ముందా? త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కృష్ణునితోపాటే భీముడు ఎవరు ముందు? రాముడే. అయితే? అయితే గోపన్న ఏమన్నాడు? భండన భీముడు అన్నాడు. ఎవరిని? రాముణ్ణి! అంటే తప్పేముంది? తప్పా తప్పున్నరా?!! భీముణ్ణి రామునితో పోల్చితే... అందం, చందం, తల్లీ-బిడ్డా న్యాయం. నలుగురూ ఒప్పుకుంటారు. రామదాసు చేసిందేమిటి? ఎప్పుడో రామాయణంనాటి రాముణ్ణి మొన్నటి మహాభారతం భీమునితో పోల్చి, అవమానం చేసినాడుకదా! ఇదేమని అడిగినవాడు ఒక్కడూ లేకపోయినాడే!! నువ్వు బయల్దేరినావు కదా? అంటే, నీకిది తప్పుగా తోచలేదా? చూడు చిట్టితండ్రీ! భండనము అంటే యుద్ధమని తెలుసుకున్నావు, బాగుంది. భీముడంటే భారతంలో భీముడు కాదు నాయనా. భీ అనే సంస్కృతశబ్దానికి భయమనే అర్థముంది. భీమము ...
కామెంట్లు
ఈయన మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి లభించిన ఒక వజ్రం.
ఈయన స్వర్ణకమలం లొ ఒక పాట కి అర్థం ఎంత బాగా చెప్పారొ ఈ క్రింద నొక్కి చూడండి.
http://www.youtube.com/watch?v=Z7AvcXQEGI4
రాధికగారూ, ఆయన రాసే ఒకో మాట గురించి ఎంత వ్యాఖ్యానమైనా ఇవ్వగలరు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిలాగా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.