ఇది మన ఆశ్రమంబు ...
రాఘవగారు (వాగ్విలాసము) నాకు పంపియుండిన ఒక ఉత్తరానికి నేనీరోజు ఉదయమే జవాబిచ్చాను. అది ఆయనకు సంతోషం కలిగించింది. నాకొక మంచి పద్యం బహుమానంగా ఇచ్చారు. సదమల దివ్యభాష... అని మొదలవుతుందాపద్యం. బహుమానం కనుక భద్రంగా దాచుకోవాలి. ఇక్కడ ఆ పద్యం చెప్పడం సందర్భంగా వుండదేమో. ప్రభాతం ఇంత ఆనందంగా మొదలవడంతో ఆయనకు కృతజ్ఞతగా ఒక టపా రాస్తానని అడిగాను. రాసుకోమన్నారు.
సదమల అనే ఆరంభం చూడగానే నా మనసులో, పుణ్యాత్ముడు ఘంటసాలగారు "ఇది మన ఆశ్రమంబు..." అంటూ వాల్మీకిమహర్షి ఆశ్రమానికి సీతమ్మను స్వాగతించే 'లవకుశ' పద్యం మెదిలింది. ఈపద్యం నాకెంతో ఇష్టం. వీరబల్లె హరిహరాదుల దేవళం మిట్టనుంచి లౌడుస్పీకర్లలో ఈ పద్యాన్ని ఎన్నిసార్లో వినివుంటాను. దీని అర్థం తెలీకపోవడానికి ఇందులో ఏముందిగనక?
ఇది మన ఆశ్రమంబు ఇచటనీవు వసింపుము లోకపావనీ
సదమలవృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్
ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించూ
నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువొందునమ్మరో
ఈ పద్యాన్ని నేనిక్కడ రాయడంలో తప్పులు జరిగివుండవచ్చు. తెలిసినవారు సరిదిద్దితే సంతోషిస్తాను. ఇంతకూ ఈ పద్యంలో నాకు అర్థంకాని మాట "సదమల వృత్తి". "మాలిన్యంలేని మనసుతో" అని అర్థం చేసుకోవచ్చా?

కామెంట్‌లు
సదమలము - మాలిన్యం లేని మనసు
వృత్తి - "తో"
కానీ వృత్తి అన్న పదానికి "తో" లేదా "చేత" ఎలా కుదురుతుందా అని కాస్త నిఘంటువు తిప్పితే(మీ పుణ్యాన), వృత్తి అంటే నడవడిక అన్న అర్ధం కూడా ఉన్నట్లు తెలిసింది. సమస్యా తీరింది.
నిర్మలమైన మనసుతో కూడిన నడవడికతో నీకు............... అని చదువుకుంటే సరిపోతుంది కదా.
ఈ పద్యము చంపక మాలలో ఉన్నది.చందస్సు ప్రకారము చూస్తే..
మొదటి పాదములో - "ఆశ్రమంబిచట" అని (చదివేటప్పుడు విడగొట్టి చదివనా వ్రాసేటప్పుడు కలిపి వ్రాయాలనుకుంటా)
మూడవ పదము చివరలో - "ప్రతిధ్వనించు నీ" ("చు" హ్రస్వము, "నీ" మూడవ పాదానికి సంబంధిచింది) అని అనుకుంటా.
"సదమలవృత్తి" - మీరు చెప్పింది సరైన అర్థమనే నేనూ అనుకుంటున్నాను.
సత్ + అమల వృత్తి = మాలిన్యము లేని మంచి ప్రవర్తన
వృత్తి - "తో" అన్నారు, అంటే వృత్తి అనే మాటకు తో అనే అర్థమున్నదా?
సత్యనారాయణగారూ, ఔనండి "నీ" మూడోపాదానికే చెందాలి. లేకుంటే ప్రాస సరిపోదు. రెండు పాదాలు సరిగా రాయఁగానే మూడోపాదం చివర్లో నన్ను ఘంటసాల బోల్తా కొట్టించేశాడు. రాస్తున్నప్పుడు ఘంటసాల గొంతు వినిపిస్తూవుంది. ఆయన పాడినట్టే రాసేశాను.
"ఆశ్రమంబిచట" అని సరిచేస్తే మిగతాపద్యమంతా ఛందోబద్ధంగా ఉన్నట్టేనా?
ఛందస్సు ప్రకారమే పాడితే భావానికి భంగమని ఘంటసాల మతం.
ఈమాటలో కొడవటిగంటిరోహిణీప్రసాదుగారి వ్యాసం చూడండి.
మనం వినని కుంతీకుమారి పద్యాలను పాడుకోవచ్చు.
అబ్బే, నేను మీరు రాసినదే ముందుగా విడకొట్టాను అంతే తప్ప వృత్తికి"తో" అర్ధం లేదు, అక్కడ ఆ అక్షరం కలుపుకోవలసిందే.
సత్యనారాయణ గారు చూపించిన మూఁడు సవరణలూ చేయండి రానారె. చంపకమాల ఛందస్సు తెలిసి కూడా మీరు చిన్నిచిన్ని తప్పులు చేయడం ఆశ్చర్యంగానుంది. ఆ మూఁడు చేసిన పదిపఁ గూడా యతి అంతబాగా సరిపోదు, కానీ సరిపెట్టుకుందాం.
పద్యాలు పాడేడప్పుడు ఛందోబద్ధంగా పాడకపోవడం తఱచూ జరుగుతూంటుందనుకుంట. చెల్లియొ చెల్లకో.. అని పాడడం బదులుగా చెల్లియో.. చెల్లకో.. అనే ఎక్కువ పాడుతుంటారు.
సదమల - అంటే నేను అన్నమయ్యపాటల్లో వినపడో అచ్చతెలుఁగు పదమేమో దీని మర్మమేమి అనుకుంటుండా. నల ఎక్కువగా తెలుఁగు పదాలే కనిపిస్తూంటాయిగా. ఇది సంస్కృత పదం అని అనిపించుంటే, వేంటనే జశ్త్వం ప్రయత్నించేవాడినేమో.
సదమలవృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్
ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ
పదములు సోకి మాయునికి పావనమై చెలువొందునమ్మరో
సత్యానారాయణగారూ, కృతజ్ఞతలు.
రాకేశ్వరా, పునఃస్వాగతం. మార్చాను. :-)
మీరు చెప్పిన చివరి రెండు మాటలూ సరిగా అర్థం కాలేదు.
రాకేశ్వరుడు చెప్పబోయినది... తనకి "నల" (గణాలలో) ఎక్కువ తెలుగు పదాలే కనిపించాయనిన్నీ, అందువల్ల సదమల అన్నది అచ్చ తెలుగు పదమని అనుకున్నాడనిన్నీ, అందువల్ల జశ్త్వసంధి జరిగి ఉండచ్చు అన్న ఆలోచన కూడా రాలేదనీ :)
'సదమలవృత్తి'కి మీరు చెప్పిన అర్థం చాలా బాగుంది. మొన్నొకరోజు(భారతదేశంలో సోమవారం వేకువపొద్దు)న టీవీ-1 ఛానల్లో ఒకాయన భాగవతంలో కృష్ణునిపుట్టుక, నంద-వసుదేవుల సంభాషణ, పూతన ఘట్టాలను కాస్త వివరిస్తూ, అక్కడక్కడా ఒకో పద్యాన్ని మానవ జీవితానికి కొంత అన్వయిస్తూ చెబుతూ పోతున్నాడు. బాగుంది. మీరు చూశారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.