సుషుప్తి - విముక్తి
ధృవపు ఎలుగుబంటి గురించి చదువుకున్నవిషయాల్లో నాకు గుర్తున్నది - సుదీర్ఘమైన - దాని 'సుషుప్తావస్థ'. ధృవపు ఎలుగుబంటి ఒకవిధమైన నిద్రాణావస్థలో గడపవలసివచ్చే తీవ్రమైన చలికాలం మాదిరిగా నాక్కూడా ఒకవిధమైన నిశ్శబ్దంలో గడపవలసివచ్చే కాలం ఒకటున్నట్టుంది.
తీవ్రమైనచలిలో బయట తిరిగితే ఒంట్లోని కొవ్వునిలువలు త్వరగా కరిగిపోయి, ధృవాల్లో ఆ తరువాత ఆహారం దొరక్క ఎలుగుబంటికి కష్టకాలం దాపురిస్తుంది. అందుకే అది నిద్రపోతుంది. నిశ్శబ్దావస్థలో వుండవలసినప్పుడు మాటల్లో పస వుండదు, మాట్లాడితే ప్రమాదం జరిగే అవకాశమే ఎక్కువ కనుక అంతర్ముఖుడిగా వుండడమే శ్రేయస్కరం.
చలికాలాన్ని తట్టుకొనేందుకు వలసిన కొవ్వును శరీరంలో నిలువచేయడానికి తగినంత తిండిని ముందుగానే కష్టపడి సంపాదించి ఆరగించి, సుషుప్తికి సిద్ధమౌతుంది ఎలుగుబంటి. నిశ్శబ్దావస్థ నుండి బయటకు రావడానికి ఆలోచనల్లో స్థిరత్వం కోసం కష్టపడవలసి వస్తుంది నాలాంటివాడికి.
కాసిన్ని సూర్యకిరణాలు పరచుకొంటే చాలు నిద్రలేస్తుంది ధృవపుఎలుగు - Introvert గా కనిపించే Extrovert. ఆలోచనల్లో కాసింత ముసురుకమ్మితే చాలు నిశ్శబ్దంలోకి జారుకుంటాడు నాలాంటివాడు - Extrovert గా కనిపించే ఇంట్రొవర్తులపు గానుగెద్దు. ఆలోచనల ముసురును, మనోనేత్రపు గంతను తొలగించుకోవడానికి ఎంతకాలం పట్టినా నిశ్శబ్దంగా వుండటమే శ్రేయస్కరమేమో!

కామెంట్‌లు
ఆలోచనలు ఎక్కువైతే, బుర్ర ఖజానాలో ఖాళీలు నిండుకుని
బట్టతల బయట పడుతుందేమో నన్న భయంతో ఎప్పటికప్పుడు
విదిలిస్తూ ఉంటాను. అలా దాచుకోవడం నావల్ల కాదు బాబూ !!
తెలుసుకున్నాను. కృతజ్ఞతలు.
మీ టపా చదువుతుంటే, నా అభిప్రాయాలాను చదువుకున్నట్లనిపించింది.
నేనూ నిశ్శబ్ధావస్థలోనే ఉన్నాను కొద్ది నెలలుగా.
ఎప్పుడు మళ్ళీ జ్ఞానోదయం అవుతుందో తెలియదు.
ఆత్రేయ .. నిండుకుంది అంటే అర్ధం ఖాళీ అయింది అని. మీ ఉద్దేశం ఖాళీలు నిండి అని అనుకుంటా.
మితృలతో వన విహారాలూ, గాన కచేరీలూ, దూరవాణిలో ముచ్చట్లూ బాగానే నడుస్తున్నాయని వినికిడి. మీ నిదుర మబ్బులను తొలగించే మెరుపు తీగ వచ్చే వరకూ మేమిలా వెయిటింగూ..
మీకు నా శుభాకాంక్షలు!
నవీనన్నా, చాన్నాళ్లక్కనిపిస్తున్నావు! పునఃస్వాగతం. :)
తెరెసా, భైవరభట్ల, ప్రవీణ్, రవిగార్లూ ... నెనర్లు. మీరేమో 'ఆహా మాకు తెలుసులే' అనేస్తున్నారు. ఈ టపాతో మెరుపుతీగకే కళ్లుబైర్లుకమ్మాయంట. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.