నిన్న లేని అందమేదో ...



ఇంటి నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అడవి. అందులో ఒక చెఱువు. మొన్నటి ఆదివారం తెల్లవారుఝామున అక్కడికి చేరుకున్నాను. అడవిలో మంచి నీటి సౌకర్యంగల ప్రదేశం ఎలా వుండాలో అలాగే వుందాప్రాంతం. అక్కడ నడుస్తూండగా కనబడిన దృశ్యాలివి. భూతాపం పెరుగుతూపోతే మరికొన్నాళ్లకు ఇలాంటి దృశ్యాలు కళ్లబడకుండా పోతాయేమో! జాగరూకతతో మెలగాలనే స్పృహ ప్రపంచ మానవాళికీ దాని గమనాన్ని నిర్దేశిస్తున్న శక్తులకూ కలుగుగాక.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
10/10
కొత్త పాళీ చెప్పారు…
స్లైడ్ షో నువ్వు తీసిన బొమ్మలా?

చాలా బావున్నై!
రానారె చెప్పారు…
ఔనండి. థాంక్యూ. ఆ తాబేలు ఒడ్డుకొచ్చి గుడ్లుపెడుతూ వుండింది. దాన్ని బెదరగొట్టకుండా కొంచెం దూరంనుంచీ లాగించాను.
Unknown చెప్పారు…
చాలా బాగున్నాయి బొమ్మలు, వీడియో...
అజ్ఞాత చెప్పారు…
బాగున్నాయి ప్రాణులు మరియు ఫోటోలు.
అజ్ఞాత చెప్పారు…
రానారె,
మీ ఈ రెండవ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా, మొదటి సారి ? ఎలా మిస్ చేసానబ్బా?

సరే,అద్భుతంగా ఉన్నయ్, ఫోటోలు.
అజ్ఞాత చెప్పారు…
ఏఁవిటి అంత దగ్గరగా మొసళ్ళు చూడోచ్చా? వాటి నోట్లో బడితే చెయ్యి తిరగాల్సిన రచయితేమయ్యుండేవాడు?

-- విహారి
Purnima చెప్పారు…
Nice work!! 8/10 :-)
teresa చెప్పారు…
Beautiful! Feels like I've just taken a pleasant stroll!
కొత్త పాళీ చెప్పారు…
@ రానారె .. "ఉండింది" ???
రానారె చెప్పారు…
@ప్రవీణ్, వికటకవి, తెరెస, పూర్ణిమ - థాంకులు.
@రవి - నాకూ కొన్ని పాత బ్లాగులు ఈమధ్యే కంటబడుతున్నాయి. :)
@విహారి - చెయ్యితెగిన రచయితయ్యుండేవాడు. వీడియో చివర్లో మొసలి బుస్స్ మంటుంది చూశారా? అప్పటిదాకా నాకూ తెలీలా దాని దగ్గర నేను మరీ చనువుతీసుకుంటున్నానని. :)

కొత్తపాళిగారూ, "ఆ తాబేలు ఒడ్డుకొచ్చి గుడ్లుపెడుతూ వుండింది" అని రాశాను కదా, మా వూరి మనిషితో ఐతే "ఆ తాంబేలు గడ్డకొచ్చి గుడ్లుబెడతాన్నింది" అని చెప్పేవాణ్ణి. వుండినది అనేమాటనే వుండింది అన్నాను. గుడ్లు పెట్టుచూ నుండెను - గ్రాంథికమున. :)
oremuna చెప్పారు…
10/10
అజ్ఞాత చెప్పారు…
కొత్తపాళీ గారు 'ఉండింది ' బదులుగా 'జరిగింది ' వాడాలి అని నాకూ ఓ సారి చెప్పారు. అప్పుడు కరెక్టెనేమో అనుకున్నాను. అయితే రానారె, నువ్వు చెప్పినట్టు 'వున్నింది ' ... మన సీమ లో వాడుక..అప్పుడు గుర్తుకు ర్యాలా. ఇప్పుడు గుర్తుకొచ్చింది (యాద్ కొచ్చింది?) :-)

అట్లాగే ఇంగోటి. తాబేలు ఇక్కడ మా వూళ్ళో తాంబేలు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము