నిన్న లేని అందమేదో ...
ఇంటి నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అడవి. అందులో ఒక చెఱువు. మొన్నటి ఆదివారం తెల్లవారుఝామున అక్కడికి చేరుకున్నాను. అడవిలో మంచి నీటి సౌకర్యంగల ప్రదేశం ఎలా వుండాలో అలాగే వుందాప్రాంతం. అక్కడ నడుస్తూండగా కనబడిన దృశ్యాలివి. భూతాపం పెరుగుతూపోతే మరికొన్నాళ్లకు ఇలాంటి దృశ్యాలు కళ్లబడకుండా పోతాయేమో! జాగరూకతతో మెలగాలనే స్పృహ ప్రపంచ మానవాళికీ దాని గమనాన్ని నిర్దేశిస్తున్న శక్తులకూ కలుగుగాక.
కామెంట్లు
చాలా బావున్నై!
మీ ఈ రెండవ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా, మొదటి సారి ? ఎలా మిస్ చేసానబ్బా?
సరే,అద్భుతంగా ఉన్నయ్, ఫోటోలు.
-- విహారి
@రవి - నాకూ కొన్ని పాత బ్లాగులు ఈమధ్యే కంటబడుతున్నాయి. :)
@విహారి - చెయ్యితెగిన రచయితయ్యుండేవాడు. వీడియో చివర్లో మొసలి బుస్స్ మంటుంది చూశారా? అప్పటిదాకా నాకూ తెలీలా దాని దగ్గర నేను మరీ చనువుతీసుకుంటున్నానని. :)
కొత్తపాళిగారూ, "ఆ తాబేలు ఒడ్డుకొచ్చి గుడ్లుపెడుతూ వుండింది" అని రాశాను కదా, మా వూరి మనిషితో ఐతే "ఆ తాంబేలు గడ్డకొచ్చి గుడ్లుబెడతాన్నింది" అని చెప్పేవాణ్ణి. వుండినది అనేమాటనే వుండింది అన్నాను. గుడ్లు పెట్టుచూ నుండెను - గ్రాంథికమున. :)
అట్లాగే ఇంగోటి. తాబేలు ఇక్కడ మా వూళ్ళో తాంబేలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.