గూగులమ్మ పదాలు

గురువుగారూ, అందుకోండి అయిదో విడత పదాలు.
*****


ఐపి వున్నది గనుక
వేంకటేశ్వరు డింక
వీడవచ్చును శంక
ఓ గూగులమ్మా!


వంశ చరితల శంస
జెంత గూడి రిరంస
రంతు సినిమా హింస
ఓ గూగులమ్మా!


పంచెకట్టు పరికిణి
పాతరికపు చెలామణి
జీన్సె నేటి ధోరణి
ఓ గూగులమ్మా!


హొంత యగు యిల్లాలు
పొంత నుండిన చాలు
సొంత మౌను సుఖాలు
ఓ గూగులమ్మా!


జనమ నిచ్చిన ఇంతి
జలము నిడచిన గొంతి
'కర్ణతల్లి'ట కుంతి
ఓ గూగులమ్మా!

కామెంట్‌లు

కొత్త పాళీ చెప్పారు…
మొదటిదీ చివరిదీ చాలా బావున్నై. జీంసు పదం గతి తప్పింది. మిగతావి నాకు అర్ధం కాలేదు.
అదలా ఉండగా, భువన విజయం కోసం రాసినవి కూడా ఇక్కడ పెట్టేస్తే అది కూడా ఒక విడతగా లెక్కేసుకోవచ్చుగా, అన్నీ ఒక చోట ఉంటాయి.
రానారె చెప్పారు…
"జీన్సు" గతి తప్పిందని రాసినప్పుడే అనిపించింది. మాత్రల లెక్క సరిపోవడంతోటే పరమార్థం సిద్ధించదని తెలిసినా పొట్లంకట్టేశాను. దీనితో ఈ పద్యం కసుగాయ అయిపోయింది. 'అర్థం కాలేదు' అనిపించకుండా రాస్తా తరువాతి విడతల్లో. భు.వి.లోవి కూడా తెచ్చిపెడతా. థాంక్యూ వెరీమచ్.
teresa చెప్పారు…
hoMta aMTE eviTi? telugu padamEnA?
రానారె చెప్పారు…
'హొంత' తెలుగు పదమే. నేర్పరి అని దీనికి అర్థం. చిన్నప్పుడు నవోదయ ప్రవేశపరీక్షల కోసం మాకు చాలా పదాలకు నానార్థాలు, పర్యాయపదాలు నేర్పారు. వాటిలో హొంత ఒకటి. అప్పుడప్పుడూ గుర్తొస్తూ వుంటాయి. ఈ పదాన్ని నేనెక్కడా వాడుకలో చూడలేదు. నేనే వాడుకలోకి తేవచ్చుగదా అని ఈ పద్యంలో ఉపయోగించా. గూగులమ్మ పదాల్లో ఇలాంటి మారుమూల పదాలనూ, నిఘంటువుల్లో మగ్గిపోయే పదాలూ యిమడవని తెలిసింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము