అనగనగా ఒక పల్లె. పల్లె మొగసాల ఒక పెద్ద చింత మాను. మాని పక్కగా పల్లె లోపలికి బండ్లబాట. ఆ మాని మొదలు చాటున ఒక కుక్కపిల్ల. ఎండి రాలిన చింతాకు దుగ్గు మీద పడుకొని బాట వెంబడి వచ్చీపోయే జనాలనూ ఎద్దులబండ్లనూ చూస్తూ, ఎండకు తావటిస్తోంది. ఉన్నట్టుంది కాళ్లతో దుగ్గును పక్కకు తోసి, ఒక ఎముకను నోట గరచుకుని మళ్లీ పడుకుంది. ముందరికాళ్లను ముందుకు చాపుకొని, మోర ఆ కాళ్లమధ్యలో పెట్టుకొని, నోట ఆరంగుళాల ఎముకను అడ్డంగా కరచుకొని విశ్రాంతిగా చప్పరిస్తూంది లేదా చప్పరిస్తోంది. **** **** **** **** **** **** **** **** **** చప్పరిస్తూ+ఉంది=చప్పరిస్తూంది - సవర్ణదీర్ఘసంధి చప్పరిస్తా+ఉంది=చప్పరిస్తోంది - గుణసంధి ఇప్పుడు రామాయణంలో ఈ పిడకల వేట చేయవలసిన అవసరం ఏమిటని మీకు అనిపిస్తూండవచ్చు. అక్కడికే వస్తున్నా. "చప్పరిస్తూ ఉంది" అని చెప్పడానికి 'చప్పరిస్తూంది' లేదా 'చప్పరిస్తోంది' అని కాక, 'చప్పరిస్తుంది' అని మనలో కొందరు రాస్తున్నారు. '...స్తూంది' లేదా '...స్తోంది' అన్నది వర్తమానాన్ని (ప్రస్తుతం జరుగుతున్నదాన్ని) తెలియజేసేదైతే, '...స్తుంది' అన్నది భవిష్యత్ కాల ...
కామెంట్‌లు
బొమ్మ బావుంది:)
ఇప్పుడు అదేగా :)
బొమ్మలో కూడా చెయ్యి తిరిగే ఉన్నట్టుంది...
నీకు పని తక్కువయ్యినట్టుంది. కొత్త పాళీ గారి కథ రాయి.
@రాధిక: సకలకళా... అనేశారా, ఈ మధ్య చోరకళలో కొంత వెనకబడిపోయానండి, ఇంకా చాలా వున్నాయి ప్రావీణ్యం సంపాదించవలసినవి. :)
@ramya: చెయ్యితిరిగిన రచయిత అనే ప్రయోగం వుంది కదండి! ఇప్పుడదేగా అంటారా, కాదు. ఇప్పుడు నా చెయ్యి మామూలుగానే వుంది. ఇంకా తిరగలేదు. :)
@ప్రవీణ్: దెబ్బతీశావ్. కార్టూన్ సరిగా పండలేదని నీ మాటతో అర్థమయింది. బొమ్మలు గీయడంలో నేనసలే అధ్వాన్నం. ఈ కార్టూన్ అయిడియా రాగానే MSPaint లో గీసిపారేసి టపాకట్టించేసి, "ఇది నా మొదటి కార్టూన్" అనుకుని సంబరపడ్డాను. ఇంకో మొదటి కార్టూనుతో మళ్లీ వస్తా. :)
బాలకృష్ణ సినిమా ఎంత చెత్తగా వున్నా అడినట్లు, మీకున్న ఇమేజ్ వల్ల అందరూ బాగుందంటున్నారు.
అవి విని మీరు మరిన్ని బొమ్మలు వేయ ప్రేరేపితులౌతారని భయంతో నిజాన్ని చెబుతున్నాను.
ఇరగదీసిండు.. మొదలైనవి అంటారని !
స్వర్గం లో శోభన్ బాబు వున్నట్టు కార్టూన్ వేద్ధామని ఆలోచించిస్తూ ఈ కార్టూన్ చూశా. ఇది మన వల్లయ్యే పని కాదని చేతుల్ని కాళ్ళకు వ్యతిరేక దిశకు పంపించేశా.
ఏవన్నా కార్తూన్ వేసే మెళుకువలు చెప్పరూ.. అప్పుడెప్పుడో శోధన సుధాకర్ చెప్పాడు కానీ తవ్వకాల్లో దొరక లేదు.
ఇట్లు,
ఆల్ సౌత్ పోల్, నార్త్ పోల్, ఈక్యేటర్ రానారె అభిమానుల సంఘం,
విహారి.
(రాకేశ్వర రావు కోసం)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.