ఒక ట్రావెలాగుడు - చివరి టపా

తట్టాబుట్టా సర్దుకొంటుండగా, ఒక రేంజరు మమ్మల్ని చూసి, "సర్దుకొని వెళ్తున్నారా?" అన్నాడు. మేం ఔననగానే, "ఎక్సలెంట్ డెసిషన్! డ్రైవ్ సేఫ్" అని సాగనంపాడు. తిరుగు ప్రయాణంలో కొన్ని దృశ్యాలు -




385


జాతీయ రహదారి I-10


మొత్తానికి ప్రధాన రహదారిమీదకు వచ్చి పడ్డాం. పొద్దున్నుంచీ ఏమీ తినకపోవడంతో ఒకటే నకనక. మంచి భోజనం చెయ్యాలని సరైన భోజనశాల కోసం ప్రయత్నిస్తే ఏ కారణం చేతనో అన్నీ మూతబడి వున్నాయి. బహుశా మంచువల్ల కావచ్చు. "బర్గర్ కింగ్" - అని ఒకే ఒకటి కనిపించింది. (పోకిరి సినిమా గుర్తుకువచ్చిందా?) ఇది చెత్త తిండి, వద్దనుకుని టౌను మొత్తం ఒక చుట్టు చుట్టినా ఏమీ కనబడలేదు. "బర్గర్ కింగ్" పక్కనే "డైరీ క్వీన్". అదీ అలాంటిదే. ఆకలికి తాళలేక అయిష్టంగానే అందులో చొరబడ్డాం. కాసింత చెత్త తిన్నాక నాకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. మిగతా ముగ్గురూ ఇంకా ముఖాలు వేళ్లాడేసుకునే వున్నారు.

ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్లను నవ్వించాలి. మిత్రులాగా, "బర్గరుకింగూ, డైరీక్వీనూ" పక్కపక్కనే వుండటం కేవలం యాదృచ్ఛికమేనంటారా? ఆని కన్ను గీటాను. చిరునవ్వులు మెరిశాయి. పైగా రాజ్యం క్లిస్ట పరిస్థితుల్లో వున్నప్పుడు ఈ కింగూ, క్వీనూ మాత్రమే అన్నదాతలుగా అవతరించారు - అన్నాను. కదా! ఆశ్చర్యంగా అన్నాడు సా.యి.

మళ్లీ నవ్వులు మాయమయ్యాయి.
అప్పుడు నాకు ఒక కొత్త సందేహం వచ్చేసింది.
కింగ్‌సైజ్, క్వీన్‌సైజ్ - వీటిలో ఏ సైజు పెద్దదో మీకు తెలుసా అనడిగాను.
నాకొచ్చిన ఈ సందేహానికి మిత్రులు పగలబడి నవ్వారు.
కింగు సైజే పెద్ద దన్నాడు మాలో ఒక మేల్ షావనిస్టు.
కింగ్ సైజు కేవలం ఒక చిన్న సిగరెట్టు మాత్రమే. క్వీన్ సైజ్ బెడ్ అంటారు విన్నావా? అన్నాడింకొకడు.
అసలు కింగన్నాక లక్ష వుంటాయి.
క్వీన్ అన్నాక అంతకంటే ఎక్కువే వుంటాయి.
ఈ లక్షా ప్లస్‌లో మీరిప్పుడు వేటి గురించి మాట్లాడుతున్నారు ...

ఈ రకంగా ఒకే యీడున్న నలుగురు పనిలేని మానవులు ఒకచోట చేరితే సంభాషణలు ఎంతదూరం వెళ్లాలో అంతదూరమూ వెళ్తూండగా, హ్యూస్టన్ వైపు మా ప్రయాణం కొనసాగింది. ఆ మధ్యలో కాస్త చీకటి పడ్డాక, ఒక చోట కింగ్ సైజు ,క్వీన్ సైజుల కంటే పెద్ద సైజులో తూరుపు దిక్కున చంద్రుడు ఉదయిస్తూ కనిపించాడు. ఆ బింబాన్ని చూస్తూ బండి నడపడం ఒక మధురానుభూతి. మా ఛాయాగ్రహణమొర్రివారు బండిని ఆపించి చంద్రుని బంధించారు. నేనూ ప్రయత్నించాను - ఇలాగ:

కామెంట్‌లు

oremuna చెప్పారు…
Good One.
రానారె చెప్పారు…
ఒరెమూనా, సుజాత గార్లకు - ఈ లాగుడంతా తెగేదాకా ఓపికగా చదివినందుకు కృతజ్ఞతలు. :)
Unknown చెప్పారు…
చాలా బాగుంది రానారె.
ఇంత మంచి ట్రావెలాగు ఈ మధ్యలలో ఎక్కడా చదవలేదు. భేష్... ఇలాంటి అడ్వెంచర్లు ఇంకా ఎన్నో చెయ్యాలి నువ్వు. మీ సా.యి, వాహన మోహనుడి సాంగత్యంలో.
రానారె చెప్పారు…
థాంక్యూ ప్రవీణ్. చెయ్యొచ్చుకానీ, వాళ్లిద్దరూ దొరికే అవకాశం తక్కువ. :)
teresa చెప్పారు…
Good narration and beautiful pictures!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము