సంబరపడాల్సినంతేం లేదిక్కడ!
"... మనం సంబరపడాల్సినంత పనేంలేదు అని చెప్పడానికున్న మరో కారణం -- ఇక్కడ రాజకీయ వ్యవస్థలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ మనం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు. అయినప్పటికీ మనం స్థిరంగా ఉండగలిగామంటే అదంతా రాజ్యాంగం చలవే." --- పూర్తి పాఠం ఈనాడులో రామచంద్ర గుహ . " ... మునుపెన్నడూ లేని ఈ రాజకీయ దగ్గరితనాన్ని పాకిస్తాన్‌తో పోల్చి చూసుకోవాలి. పాకిస్తాన్, అక్కడి ప్రజలతో అమెరికా నెరపిన మైత్రితో బేరీజు వేసుకోవాలి. ఆదేశంలో అల్లా, ఆర్మీ రెండింటికీ అమెరికా బాగానే సాయం చేసింది. పాక్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేయడంపై అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయుధాలు సోవియట్‌ను ఎదుర్కోవడానికి అని పైకి ప్రచారం చేసినప్పటికీ అవి తమపైకి ఎక్కుపెట్టడానికే అని భారత్ విశ్వసించింది. డబ్బు రూపేణా అందిన సాయంతో అక్కడి సైన్యం స్థిరాస్తిపైన, కర్మాగారాలపైన, హోటళ్లపైన పట్టు బిగించింది. జనరల్ జియా ఉల్‌హక్ హయాంలో ముల్లాలు వేలాది మదర్సాలను తెరిచి యువతను మతమౌఢ్యులుగా మార్చారు. అమెరికా గమనిస్తుండగానే ఇదంతా జరిగింది. అప్పుడు చేసిన సాయం వల్ల పాకిస్తాన్ సమాజంపై అమెరికా పట్టు సాధించింది. భారత్‌లో మతపరమైన అతివాదం అల్లాకు...