Wednesday, February 20, 2008

సంబరపడాల్సినంతేం లేదిక్కడ!

"... మనం సంబరపడాల్సినంత పనేంలేదు అని చెప్పడానికున్న మరో కారణం -- ఇక్కడ రాజకీయ వ్యవస్థలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ మనం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు. అయినప్పటికీ మనం స్థిరంగా ఉండగలిగామంటే అదంతా రాజ్యాంగం చలవే."

--- పూర్తి పాఠం ఈనాడులో రామచంద్ర గుహ.

" ... మునుపెన్నడూ లేని ఈ రాజకీయ దగ్గరితనాన్ని పాకిస్తాన్‌తో పోల్చి చూసుకోవాలి. పాకిస్తాన్, అక్కడి ప్రజలతో అమెరికా నెరపిన మైత్రితో బేరీజు వేసుకోవాలి. ఆదేశంలో అల్లా, ఆర్మీ రెండింటికీ అమెరికా బాగానే సాయం చేసింది. పాక్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేయడంపై అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయుధాలు సోవియట్‌ను ఎదుర్కోవడానికి అని పైకి ప్రచారం చేసినప్పటికీ అవి తమపైకి ఎక్కుపెట్టడానికే అని భారత్ విశ్వసించింది. డబ్బు రూపేణా అందిన సాయంతో అక్కడి సైన్యం స్థిరాస్తిపైన, కర్మాగారాలపైన, హోటళ్లపైన పట్టు బిగించింది. జనరల్ జియా ఉల్‌హక్ హయాంలో ముల్లాలు వేలాది మదర్సాలను తెరిచి యువతను మతమౌఢ్యులుగా మార్చారు. అమెరికా గమనిస్తుండగానే ఇదంతా జరిగింది. అప్పుడు చేసిన సాయం వల్ల పాకిస్తాన్‌ సమాజంపై అమెరికా పట్టు సాధించింది. భారత్‌లో మతపరమైన అతివాదం అల్లాకు బదులు రాముడిపేరుతో సాగుతోంది. అమెరికా నుంచే వారికి సాయం అందుతోంది. పాకిస్తాన్‌లో గతంలో ఏం జరిగిందో, ఇప్పుడేం జరుగుతోందో గమనంలోకి తీసుకుని మత మౌఢ్యుల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలి. వేరే శక్తులపై నమ్మకం పెట్టుకునే కంటే మన రాజ్యాంగంపై విశ్వాసంతో ఉంటే మంచిది."

11 comments:

తెలుగు అభిమాని said...

పాకిస్తాన్ లోని ఇస్లాం మతమౌఢ్యాన్ని భారతదేశంలో హిందువులు ఆత్మ రక్షణకై చేస్తున్న పోరాటాన్ని ఒకే గాటన కట్టడం కేవలం మన hindu pseudo secularist ల వల్లే అవుతుంది. దానిని నీ వంటి మేధావి endorse చేయటం --ndtv లో arm- chair expert ల చర్చ చూసిన చందంగా ఉంది. మనోధర్మం కరువైన మహాగాయకుడి పాట కచ్చేరిలా , చందస్సు కోసం వ్రాసిన చెత్త పద్యంలా కూడా ఉంది.

రానారె said...

తెలుగు అభిమానిగారూ,
నేను మేధావిని కాను. ముఖ్యంగా ఈ విషయంపై నా పరిజ్ఞానం అతి స్వల్పం. ఆత్మరక్షణ అవసరమే. అంతకుమించి అనవసరమైనదేదో జరుగుతోందని మాత్రం నా అభిప్రాయం.
మీ వ్యాఖ్యలోని ఉపమానాలు బాగున్నాయి. వాటిలో చివరిది నాకు అనుభవమేలెండి. :)
నిర్మొహమాటంగా వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

Sriram said...

తెలుగూభిమాని గారూ, మీ కామెంటులోని ఉపమానాలు నిజంగా అదిరాయి.

రాంచంద్రగుహా గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది... :)

oremuna said...

ఎవరీ గుహ? ఏమిటీ కథా కహానీ?

రానారె said...

నిన్న 'ఈనాడు'లో వచ్చిన ఒక వ్యాసం.
ఈరోజు దాని లంకె (URL)మారిపోయింది.

రవి వైజాసత్య said...

గుహా, భారత స్వాతంత్ర్యము తర్వాత చరిత్రను చాలామటుకు నిష్పాక్షితగా, సమగ్రంగా వ్రాసిన మంచి చరిత్రకారుడు..అంత మాత్రం చేత ఈయన ఊహాగానాలన్ని నిజమని నమ్మలేం.
వ్యాసంలో మొదటి భాగం చక్కని విశ్లేషణ..పాకిస్తాన్ కూలితే మనం నవ్వుతూ చూస్తూ ఉండలేం..కానీ అమెరికాతో భారత సంబంధాలు, పాకిస్తాన్-అమెరికా సంబంధల్లాగా ఉంటాయని జోస్యము చెప్పటం దృష్టిలోపమో లేకపోతే అమెరికా ఏహ్యమో అయ్యుండాలి. అమెరికా-భారత సంబంధాలు అమెరికా-చైనా సంబంధంలా ఉండాలే కానీ అమెరికా-పాకిస్తాన్ (???ఆక్..తూ)
భారత వామపక్ష మొగ్గును ఆ పరిస్థితుల్లో బాన్-హోమీ అని సమర్ధించిన గుహా గారూ, దక్షిణపక్ష మొగ్గును ఎందుకిలా తెగుడుతున్నారు? 50వ దశకపు సోషలిష్టులను బాన్-హోమీ అని క్షమించెయ్యొచ్చు..21వ శతాబ్దపు సోషలిస్టులను ఏం చెయ్యాలి?

నాగరాజా said...

భారతదేశంలో రాముని పేరు మీద మరీ "అంత" మతవాదం ఏమీ పేట్రేగట్లేదు అని నా అభిప్రాయం. గుహలో కొంచెం క్రియేటివిటీ ఎక్కువే...

ప్రవీణ్ గార్లపాటి said...

@నాగారాజా గారు:

బీజేపీ, శివసేన గురించి మీరు మర్చిపోయారా ? ఏం ?
హైదరాబాదులో నా కళ్ళతో చూసాను హిందూ ముస్లిం కొట్లాటలు, కత్తులతో జీపుల్లో ఊరేగడాలు. అందులో బీజేపీ వారి రాముడి పాత్ర ఏమీ లేదంటారా ?

సత్యసాయి కొవ్వలి said...

గుహా గారు చాలా నిక్కచ్చిగా కరాఖండీగా రాయగలరు, మాట్లాడగలరు. కానీ పాపం మనదేశంలో మైనారిటీలకి సప్పోర్టిస్తే కానీ ఇంటలెక్ట్యువల్సవరని అపోహకొద్దీ బీజేపీని తెగనాడే వీక్ నెస్ చాలామందికి ఉంది. రాముడిపేరుమీద దౌర్జన్యాలు జరగట్లేదనను. కానీ రాముడి పేరు మీద బతికేవాళ్ళకి ఊతమిచ్చింది మన కుహనా లోకికవాదులని చెప్పక తప్పదు. శివసేనా, బిజేపీ లు బొంబాయి,హైదరాబాదు లలోనే ప్రాబల్యం చెందడం- రియాక్షనరీ ప్రోసెస్ అని నా అవగాహన. ఓగుడో, మసీదో అభివృద్ధి పధకానికి (ఉదా. హైవే)అడ్డొస్తే వాటిని కేవలం అడ్డంకులుగా భావించి తీసిపాడేయ్యగల ప్రభుత్వాలొస్తే కానీ మనం బాగుపడం. మతాన్ని ఒక క్వాలిఫికోషన్గా హైలైట్ చేయడం అనవసరమేమో.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

కాంగ్రెస్ పార్టీకి భుజకీర్తులు తొడిగే మైనారిటీవాదిగా రామచంద్ర గుహాకి హిందువులలో విశ్వసనీయత లేదు.

ప్రపంచ టెఱ్ఱరిజానికి బహిరంగ కోచింగ్ సెంటరుగా, అనేక పొరుగు దేశాలకు ఉపద్రవకారిగా మారిన పాకిస్తాన్ అనే దుష్టదేశం (rogue nation) విచ్ఛిన్నం కావడం మన జాతీయ అవసరం. అలాగే ప్రపంచానిక్కూడా ఇది అవసరం. అందువల్ల మనకొచ్చిపడే ప్రమాదమేమీ లేదు. పాకిస్తాన్ విచ్ఛిన్నమైనా దాని అణ్వస్త్రాలు అక్కడి ఇస్లామిక తీవ్రవాదులకు చిక్కవు. ఎందుకంటే ఆ అణ్వస్త్ర తయారీకేంద్రాల్ని వాటిల్లోని ఉత్పత్తుల్ని సంయుక్త రాష్ట్రాలు వ్యూహాత్మకంగా స్వాధీనం చేసుకుని చాలా నెలలవుతోంది. ఈ విషయం ఇక్కడ చాలామందికి తెలియదు.

సుగాత్రి said...

@తాలబాసు గారు: అణ్వాయుధాల వరకూ మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ "పాకిస్తాన్ విచ్ఛిన్నం కావడం ... వల్ల మనకొచ్చిపడే ప్రమాదమేమీ లేదు." అనడం అపోహే. ఎందుకంటే పాకిస్తాన్లో సంక్షోభం ఏర్పడుతోందని భావించినప్పుడల్లా మనదేశంలో కల్లోలం సృష్టించడం ద్వారా మనల్ని రెచ్చగొట్టి, ప్రజల దృష్టిని మళ్ళించి గండం గట్టెక్కడం పాక్ నాయకులకు అలవాటు. రాజకీయ నాయకులు ఆ పని చెయ్యలేనప్పుడు సైన్యమే నేరుగా పగ్గాలు చేబడుతుంది. అందువల్ల వాళ్ళు సుభిక్షంగా ఉంటేనే మనకు మంచిది.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.