గూగులమ్మ పదాలు
గూగులమ్మపదాలు నాలుగవ భాగం:
****************
పని లేనిదే పాట
పనికి పాటకు బీట
బతుకు దెరువుల తేట
ఓ గూగులమ్మా!
కవిత రాసినవాడు
కర్మకాండల నాడు
కాళిదాసయినాడు
ఓ గూగులమ్మా!
పాలకుడు సిరిరాజు
పాఠకుడు కరిరాజు
మకరి ఈ కవిరాజు
ఓ గూగులమ్మా!
రెండు పదముల రాశి
ద్విపద యగుటంజేసి
నేను కవితా పిపాసి
ఓ గూగులమ్మా!
'నిరంకుశ' కవి తోటి
పాఠకజన 'మావటి'
నిరంతరమూ పోటి
ఓ గూగులమ్మా!
తీవ్రముగ తలపోయ
కవిత కుంకుడుగాయ
ఆడించు తలకాయ
ఓ గూగులమ్మా!
****************
పని లేనిదే పాట
పనికి పాటకు బీట
బతుకు దెరువుల తేట
ఓ గూగులమ్మా!
కవిత రాసినవాడు
కర్మకాండల నాడు
కాళిదాసయినాడు
ఓ గూగులమ్మా!
పాలకుడు సిరిరాజు
పాఠకుడు కరిరాజు
మకరి ఈ కవిరాజు
ఓ గూగులమ్మా!
రెండు పదముల రాశి
ద్విపద యగుటంజేసి
నేను కవితా పిపాసి
ఓ గూగులమ్మా!
'నిరంకుశ' కవి తోటి
పాఠకజన 'మావటి'
నిరంతరమూ పోటి
ఓ గూగులమ్మా!
తీవ్రముగ తలపోయ
కవిత కుంకుడుగాయ
ఆడించు తలకాయ
ఓ గూగులమ్మా!
కామెంట్‌లు
మూడోది చదివి అప్రయత్నంగా నవ్వొచ్చింది.
నాలుగూ ఐదూ కొంచెం మసగ్గా ఉన్నై
చమత్కారాన్నీ మాట విరుపుల్నీ బాగా సాధిస్తున్నావు. జయహో
ప్రాస పదములు కూర్చి
లోక ఙ్ఞానము చేర్చి
కలుపు కవితా మిర్చి
ఓ కూనలయ్యా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.