గూగులమ్మ పదాలు

గూగులమ్మపదాలు నాలుగవ భాగం:
****************

పని లేనిదే పాట
పనికి పాటకు బీట
బతుకు దెరువుల తేట
ఓ గూగులమ్మా!

కవిత రాసినవాడు
కర్మకాండల నాడు
కాళిదాసయినాడు
ఓ గూగులమ్మా!

పాలకుడు సిరిరాజు
పాఠకుడు కరిరాజు
మకరి ఈ కవిరాజు
ఓ గూగులమ్మా!

రెండు పదముల రాశి
ద్విపద యగుటంజేసి
నేను కవితా పిపాసి
ఓ గూగులమ్మా!

'నిరంకుశ' కవి తోటి
పాఠకజన 'మావటి'
నిరంతరమూ పోటి
ఓ గూగులమ్మా!

తీవ్రముగ తలపోయ
కవిత కుంకుడుగాయ
ఆడించు తలకాయ
ఓ గూగులమ్మా!

కామెంట్‌లు

rākeśvara చెప్పారు…
బావున్డాయి.
కొత్త పాళీ చెప్పారు…
పట్టు వదలకుండా ఎసైన్మెంటు కొనసాగిస్తున్నందుకు అభినందనలు

మూడోది చదివి అప్రయత్నంగా నవ్వొచ్చింది.

నాలుగూ ఐదూ కొంచెం మసగ్గా ఉన్నై

చమత్కారాన్నీ మాట విరుపుల్నీ బాగా సాధిస్తున్నావు. జయహో
అజ్ఞాత చెప్పారు…
బాగున్నాయి మీ గూగులమ్మ పదాలు. అలాగే ఓ కూనలయ్య పదం:

ప్రాస పదములు కూర్చి
లోక ఙ్ఞానము చేర్చి
కలుపు కవితా మిర్చి
ఓ కూనలయ్యా!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము